నా కళ్ళ అంతరాల్లొకి తొంగిచూస్తున్న నీ చూపుల సవ్వడేమిటి ... !

నా సందిగ్ధ తలంపుల వెనుక దాగి ఉన్ననీ ఆకర్షణల సత్యమేమిటి ....!

నా రెప్పల దుప్పటి కప్పుతున్న చీకటిలొ చిక్కుకున్న నీ కలల కాంతేమిటి...!

నన్ను నేనే కనలేని నీర్లిప్తంగా కరిగిపొతున్న ఈ మనసేమిటి....!

నా నిశి రాత్రి నడకలొ కడతెరని నీ బహుదూరపు గమ్యమేమిటి....!

నా వెచ్చని కన్నిటిలొ జారిపొతున్న నీ జ్ఞాపకాల సుడులేమిటి....!

నా తనువును చింద్రం చేస్తూ తరుముతున్ననీ తీపి తలపుల సంగతేమిటి....!

సాహిత్య సుమలు చిందే ఈ చంద్రుడు మదిలొ నీ నిరాశ మంటల వెన్నెలేంటి....!

నా శరీరపు మాయ పొరల వెనుక నీ మోహపు అలలా అలజడులేమిటి...!

నా జీవన వధనంలొ కలత పొందిన నీ ఆలొచనల వేదనేమిటి...!

నా చిరునవ్వుల సంద్రంలొ కలచివేస్తున్న నీ ఆశల ఎడబాటుల ఉనికేమిటి....!

శాపంగా నలిగిపొతున్న నా ఆత్మీయపు భావాలకు నీ ఉద్వేగపు ఊపిరేమిటి.....!

నా గతంలొ గనీభవించిన కన్నీటి మనుగడలొ నీ తేజొ దీప లావణ్య రూపమేమిటి....!

గుండె లొ బాధను చూసి మౌనంగా వర్షించే నా నులివేచ్చని కన్నీటికి నీ ఓదార్పు ఏమిటి....!




మనం మౌనంగా గడిపే ఆ నిమిషాల్ని నేను ప్రేమిస్తాను....

కబుర్లు చెప్పుకుంటు మనం కలిసి ఉన్న గంటలను నేను ప్రేమిస్తున్నాను...

ఊరికే కలలు కంటు మనం వెచ్చించిన కాలాన్ని నేను ప్రేమిస్తున్నాను....

చేయీ చెయి కలుపుతూ మనం కలిసి నడిచిన ఆ అడుగులను నేను ప్రేమిస్తున్నాను...

హృదయ తంత్రుల్ని సవరించే పువ్వులా సుతారంగా మీటిన నీ స్పర్సని నేను ప్రేమిస్తున్నాను...

బ్రతుకు వాకిట అనుభూతుల హరివిల్లుగా విరబూసిన నీ చిరునవ్వులను నేను ప్రేమిస్తున్నాను...

జీవితాంతం మరపురాని మదుర సృతులైన నీ జ్ఞాపకాలను నేను ప్రేమిస్తున్నాను....

నన్ను విడి వెళ్ళెటప్పుడు మధన పడుతు కార్చిన నీ కన్నీటిని నేను ప్రేమిస్తున్నాను....

ప్రేమను వ్యక్త పరుస్తూ మనం గడిపిన ఆ సమయాన్ని మరి మరి ప్రేమిస్తున్నాను....


ఏకారణం చేత నీవు నాకు దూరమైనా....

నీ మూలంగా వేదనకు చేరువయినా....

విడువదు నా మది నిన్ను తలుచుట....

మరువదు యద నిన్ను పిలుచుట....

కాలం ఆగకున్నా..... నీవు రాకున్నా....

ఎదురు చూచుటే ఈ బ్రతుక్కి అలవాటు ప్రియా....!



నిత్యం నీ చిరునవ్వుల తొలకరిలొ జారి పడే ముత్యాలకై


నేను ఏదురు చూస్తుంటే....

నీవు నన్ను దిక్షించకని ప్రతి సారి

నన్ను పవనం లా తాకి వెళ్ళిపొతున్నావు....

అయినా నీకు నాదొక్కటే మనవి...

నీ ఆనంద ఉద్యన వనంలొ ముద్దాడే

పూలకు పుప్పెడినై నీ పెదవులకు అంటాలని ఉంది ప్రియా...!



వస్తానంటావు...!

మనసు వాకిలిలొ నిల్చుని

హృదయపు తలుపులు తెరిచి నీ రాకకై నీరిక్షిస్తుంటే....

నీవు రావు.....

వస్తానంటావు....!

గుప్పెడు నవ్వుల కొసం

నా మది వాకిలి ముందు నిలబడిన నిన్ను ఆహ్వనిస్తుంటే....

నీవు రావు....

కన్నీళ్ళుతొ నిండుకొని అంధకారంలొ ఉన్న నాకు

నీ ప్రతి ఆలొచన అంకితమిచ్చి

నా నవ్వుల చిరుగంటల గలగలలొ

నువ్వు జ్వలించే చైతన్య ప్రవాహమై

నాతొ కలిసి నడిచిన ఆ క్షణాలు గుర్తున్నాయా ప్రియా...!




నా హృదయాకాశంలో.... అనేక తారలను ఉదయింప చేసిన

నువ్వు హఠాత్తుగా ఎందుకు అద్రుశ్యమయ్యావు.....

విసుగేత్తే ఏకాంతం లో కి విముక్తి లా

ఎందుకు ప్రత్యక్షమయ్యి అంతలోనే దూరమయ్యవు....

అంటే నీవు వట్టి స్నెహితుడవేనా.....!

నా మనొ గగనపు వెన్నెల సితపత్రం మీద

నా కను రెప్పల మాటున దాగున్న అశ్రువులు

రాలి పడుతుంటే...

ఆరని కాష్టం లా నా తనువే మండిపొతుంటే.....

చివరి చూపుగానైనా నిన్ను చుసే భాగ్యం లేదా నేస్తం....

అగాధ సాగర గర్భంలోకి చేరిన నేను

ఇక నిన్ను విసిగించను...

నాకు ఎడబాటు తప్పని సరి అయితే

దాన్ని అమరం గా మలుచుకుంటాను....

నీ కనుల ముందు నేను లేకపొయినా

ఓ కధగా నైన వినిపించి బ్రతికిపొతాను...




చీకట్ల స్దబ్ధ నిశేధిలొ అమ్మలేని నేను ఓ సహ జీవికి అమ్మనవుతుంటే....

నా అలసిన దేహనికి నీవు అమ్మవై....

నీ ఆశ కాష్టాల సెగలొ నాకు చలి కాచుతూ....

నిశ్మబ్ధ వీచికలొ నా నులివెచ్చని కన్నీటిని అదృష్యం చేస్తూ....

నేను పడ్డ కష్టాల చీకట్లలన్ని వెన్నెల కాంతులుగా మార్చుతూ....

నీ అశృధ దారలతొ నెలలు నిండిన నా గాయాలను తనివి తీర కడుగుతూ...

నా గుండె లొతుల్లొ నుంచి తెగి జారిన ముత్యాని (బిడ్డ) కై ఆత్రూత పడుతూ....

నీ చల్లని లాలన వాత్సల్యంలొ అమ్మగా అవతరించిన నేను ....

ఏమిచ్చి నీ బుణం తీర్చుకొను "నాన్న"...

చెమరిన నా కళ్ళను తుడుచుకుంటూ...

నా అంతరాత్మకి నీ అద్బుత వ్యక్తిత్వం గురించి చెప్పుకొవడం తప్ప....!


(నా స్నేహితురాలుకి చిన్నప్పుడే అమ్మ చనిపొయింది... తల్లి స్ధానంలొ తన తండ్రి అన్ని సేవలు చేసి...

అమ్మ లేని తనకు అమ్మగా మారి పురుడు పొసాడు....అందుకే ఈ కవిత నా స్నేహితురాలకి అంకితం

చేస్తున్నాను....మీ రేవా...)




"నలుపంటే నాకిష్టం...

ఆకాశం నలుపని భూగొళం వద్దంటే...

హరివిల్లుకు చొటేది? చిరుజల్లు ఊసేది ?

కొయిలమ్మ నలుపని కొమ్మలు వద్దంటే...

ఆమని కేది అంత అందం? కమ్మని రాగాల బంధం?

చీకటి నలుపని రాత్రిని వద్దంటే...

మనుగడ సాగేనా? మనుషులు మిగిలేనా?

అందుకే చెలియా...

నలుపంటే నాకెంతొ ఇష్టం....

నీ గొంతున పలికే కొయిలన్న....

నీ కాటుక కన్నుల కదలాడే చీకటన్న...

నీలాల నింగి అన్న...

నీ నీలి ముఖమన్నా....మరీ మరీ ఇష్టం....."


మరచిపోవాలనుకుంటాను... ఒంటరిగా వెళుతున్న జీవితంలోకి అనుకోకుండా వచ్చిన నిన్ను....


కానీ నీ చూపు తాకినా మరుక్షణాన ఆ విషయాన్నీ మరచిపోతున్నాను...

మాటలు కలపకూడదనుకుంటాను... ఉవ్వెత్తున ఎగిసిపడే అలజడులు నా గుండెల్లో రేపి నీతొ...

కాని నీ అధర కుసుమల ఊగిసలాటలొ మధుర సుధలను అస్వాదిస్తున్నాను...

అనుబంధాలను తెంచుకొవాలనుకుంటాను.... హృదయాంతర కవాటలలొకి తొంగిచూడని నీతొ...

కాని నీ అనుభవాల వ్యక్తికరణలొ స్నేహ బంధాలను తొడు తెచ్చుకుంటున్నాను...

అందెల సవ్వడి వినకూడదనుకుంటాను....బరువెక్కిన గుండెను తియ్యని శబ్ధలతొ బాధించే నీతొ....

కాని నీ మధుర భావల మువ్వల సవ్వడితొ అగాధాలలొ నిదురించిన జ్ఞాపకాలను మెల్కొలుపుతున్నాను....

బాధ పడకూడదనుకున్నాను....అవమానపు చురకత్తులతొ అభిమానాన్ని చింద్రం చేసిన నీతొ....

కాని నీ ఆశల బ్రతుకు పుటలొ ఒదగని రుధిర అక్షరాలను ఆరాధిస్తున్నాను....

ఎదురుచూపంటే తెలియని నాకు ఎన్ని జన్మలయినా ఎదురుచూసేలా చేశావు....

ఇంకా నిన్ను ఎలా మరవగలను ప్రియా.....!




పూల జడలేసి పట్టు పరికిణీ కట్టుకొని ఘల్లు ఘల్లుమని నడచిన నీ అందెల సవ్వడులు నాకు వినిపిస్తునే ఉన్నాయి....


వాలు జడలేసి హేమంతపు చేమంతులు తురిమి హంస హొయల నీ సింగారపు నడకలు నాకు కన్పిస్తునే ఉన్నాయి....



గుర్రపు తొక జడలేసి సిరికాంతుల సింధూరము నుదిటనద్ది తిరుగాడిన నీ పాదాల గుర్తులు నన్ను స్వాగతిస్తునే ఉన్నాయి....



ఈతపాయల జడలేసి చందనాల చీర గట్టి వయ్యారపు తీగ నడుముకి వడ్డాణం అద్దిన నీ అందాల రాజసం నా కళ్ళలొ కదాలడుతునే ఉన్నాయి...



అరటిపళ్ల జడలేసి అంతరాళపు అవని అందాలను పులిమి...శశి సిగలొ దరించిన....నీ మేనులొ కదిలే చిత్రాలు నాలొ మొదలవుతునే ఉన్నాయి....



పాము మటం జడలేసి తేజొ దీప లావణ్య రూపాన్నిచ్చే పాపిట చీర పెట్టిన ...నీ స్వేచ్చయుత చిరునవ్వుల ఉనికిని నా మదిలొ శొధిస్తూనే ఉన్నాయి...



నాగరం జడలేసి శ్వేత వస్తాల నిశ్మబ్ద వీచికలొ ఇంద్రదనస్సును కుచ్చిలుగా పేర్చిన...నీ సందిగ్ధతలంపుల జ్ఞాపకాలను నన్ను అలింగనం చేసుకుంటునే ఉన్నాయి....



రెండు జడలేసి సృజనాత్మక కళలు చిందే కాటుక దిద్దీన కళ్ళకు... నీ ఏడుపొరల దేహంలో నా జీవన కాంతులు చిమ్ముతునే ఉన్నాయి...


నా తలపుల అంతర్లొకాలలొ పూసిన పారిజాతాల చంద్రకాంత సుందరి నువ్వు...

నా ఎడబాటుల నిశేదిని కాల్చే చందనవంక దీపాల జ్యొతి నువ్వు...

నా అంతరంగంలొ మౌనంగా వున్న మది కలంను తట్టి లేపే అక్షర సంధివి నువ్వు...

నా జీవన వదనంలొ చిరునవ్వుల సౌగంధలను విదజల్లే కాశీరత్నపు కుసుమం నువ్వు..

నా సందిగ్ధపు కడలి కన్నీటిని... అనుభూతుల పన్నీరుగా మార్చినా రాజ ముద్రిక నువ్వు..

నా గ్రిష్మంతొ రగిలిపొతున్న గుండె నిట్టూర్పులకు చమరగీతం పాడిన నా తలపుల రాజుదర్బారాల రాణీవి నువ్వు...

నా పురాతన జ్ఞాపకాల సువాసనలను పుక్కిలిస్తున్నామదుర ఊహల ముద్దులహరం నువ్వు...

నా అధర తాపాలా విరహంలొ నొటి పరదాల కూటమి ని పండించే తాంబులానివి నువ్వు.....

నా దేహం నుండి జారి పడే ఎకాంతంపు లాంతరలొ వెలుగు పువ్వులను పంచే నువ్వుల చెలిమి నువ్వు ...

నువ్వు ఎప్పుడు నాకొక అనుభూతివేరా......



ఈ అమ్మాయిలను అర్ధం చేసుకోవడం మహా కష్టం………..


వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నానంటారు.....


పొగడకపోతే బుజ్జి గాడికి కళాదృష్టి లేదంటారు.....


చెప్పినదానికల్లా ఒప్పుకుంటే డూ డూ బసవన్నని గేలి చేస్తారు...


ఒప్పుకోకపోతే అర్ధం చేసుకునే మనసు లేదని నిందిస్తారు.....


చక్కగా తయాయితే పూలరంగడు అని చురకలేస్తారు....


సింపుల్ గా వుంటే “తాతయ్యల టేస్ట్” అంటారు.....


ఎక్కువ మాట్లాడితే వాగుడుకాయి వీడు ’బోర్ ’అంటారు....


మాట్లాడకపోతే ముద్దు ముచ్చటలేని బండరాయంటారు....


ముద్దు పెట్టుకుంటే జెంటిల్మెన్ వికాదంటారు....


పెట్టుకోక పోతే మగాడివే కాదు పొమ్మంటారు.....


చెయ్యి పట్టుకోబోతే- అందుకోసమే కాసుకుని వున్నానంటారు....


బుద్ధిగా కూర్చుంటే సరసం తెలియని ముద్దపప్పు అంటారు....


వేరే ఆడవాళ్ళ వయపు చూస్తే మగబుద్ధి అంటారు.....


వాళ్ళు వేరే అబ్బాయిల వయపు చూస్తే ‘క్యాజువల్ లుక్ ’అంటారు....


ఓరి తుంటరి భగవంతుడా... ఈ తింగరి ఆడవాళ్ళ నుండి నన్ను నువ్వే కాపాడాలి....



నేను ఆమెతొ కలసి నమ్మకమనే తొటలొ ఓ గులాబి మొక్కను నాటాను...

దానికి స్నేహమనే అమృతాన్ని పొసి పెంచుకున్నాం.....

ఆమెకు... నాకు ... తప్ప మరెవ్వరికి కనిపించని మా మనసనే

విశాల ప్రపంచంలొ అది దిన దిన ప్రవర్దమానమై ఆకులు ... రెమ్మలు వేసింది....

మా నీరిక్షణ ఫలించి కొన్నాళ్ళ తర్వాత ఆ గులాబి కన్య మా స్నేహమనే

జతలొ కలసి పరపరాగ సంపర్కం చెంది మొగ్గ తొడిగింది....

దాని పట్ల మా అభిమానం రెట్టింపైంది....

మొగ్గ వీడి స్వచ్చమైన "తెల్లగులాబి" విరబూస్తుందనుకున్నాము....

కాని కొన్నాళ్ళ తర్వాత పచ్చని చిగుళ్ళాను చీల్చుకుంటు వచ్చిన

గులాబిని రేకులను చూసి ఇద్దరం ఆశ్చర్య పొయాం.... అది "ఎర్ర గులాబి"

మా హృదయ గానం విని అది మరింత రాగ రంజితమైంది.....



ఆశలకు ఆశయాలకు నొచని ఆభాగినినీ....

తల్లిదండ్రులకు గుదిబండని...

తప్పు పట్టే సమాజానికి అవకాశాన్ని...

దైర్యంగా నిలబడాలనే ప్రయత్నంలొ పొందిన ఓటమిని.....

కట్నమిచ్చి మెడను వంచి తాళీగా పొందాను ఉరితాడుని....

మర మనిషిగా మారిన మనిషిని....

మరొసారి అతనికిచ్చా గెలుపుని...

పురుషాదిక్యతలొ పాతాళాన్ని చేరిన గంగని....

అడవిలొ మానై పుట్టక పొతినేనని అనాధిగా రొధిస్తున్నా

ఆడదానినీ.....!


ప్రకృతిలొ ముద్దుకు మూలం.... తల్లి వాత్సల్యం....

ప్రతి మనిషి పుట్టి ...పుట్టగానే... అమ్మ ముద్దు దక్కుతుంది....

అదే తొలి ముద్దు..... ప్రాణవాయువు.....

ఏకాంతంలొ స్త్రీ ...పురుషుల మధ్య అధర కుసుమాలు

తత్తర పడి దగ్గరకు చేరితే... ముద్దు మొగ్గ తొడుగుతుంది...

దేహపుటగాధాల చిమ్మ చీకటి వెదకులాటలొ....

స్త్రీ... పురుషల పెదవుల కాగడా... తియ్యని ముద్దు..

హృదయం లొంచి ప్రవహించి ...

అధరాల్లొ పయనించి ..

పసుపు చెక్కిళ్ళల్లొ సింధురాన్ని పూయించి....

కలలొ కవ్వించి.... మదిలొ ఆనందాలు పూయించి....

గుండే వేగాన్ని పెంచి....కర్ణపుటంచులను లాలించి...

నుదిటిపై తిలకమయ్యి... కళ్ళకు కాటుక గా మారి....

రెప్పల దడి వెనుక మాటువేసి...

మధుర సుధలను ఊరిస్తూ.... నునిసిగ్గులను లాలిస్తూంది ముద్దు........

అదొక గాఢత... అదొక తీవ్రత....


నీ కలల దూర తీరాలను తాకగలను....

వేదన నదిలొ నన్ను ముంచి వెళ్ళు....!

నీ గతం లొ నా భవిష్యత్ ను చూడగలను...

భవిత వైపు నన్ను మళ్ళించి వెళ్ళు....!

ప్రేమ రాహిత్యాన్ని తట్టుకొగలను....

కాస్త ద్వేషన్ని పంచి వెళ్ళు...!

నీ ఆశ శ్వాసగా ప్రాణాన్ని నిలుపుకొగలను...

హృదయ గాయం ప్రజ్వలించి వెళ్ళు....!

వియోగంలొ సుదూరమై సాగిపొగలను....

నీ జ్ఞాపకాలు తొడు ఉంచి వెళ్ళు...!

ఎద చెలమలొ చిరునవ్వును పుట్టించగలను..

కర స్పర్మతొ సృశిషించి వెళ్ళు...!

మదిలొ మండే జ్యొతులను ఆర్పగలను....

కన్నీళ్ళతొ ఆవహించి వెళ్ళు....!

రుధిర చుక్కలను కలంలొ నింపగలను....

మది కాగితాన్ని చదివి వెళ్ళు....!

తలపుల నిశేదిలొ వెలుగును ఆహ్వనించగలను....

తొలి కాంతిగా వచ్చి వెళ్ళు....!

కొత కొసిన ఈ గుండెను నీకు అర్పించగలను...

వలపు సుధ తాగిన అమర్త్యుడను చూసి వెళ్ళు...!


ఉప్పొంగే ఆశల కెరటాలను కడలి దాటే ఫెను తుఫానుగా మారనీయకు...

మబ్బులో నలిగిపొయే సూర్యుడిలా అంతరాల్లోనే ఆ భావాలను నలిగిపొనియ్యకు....

గాలి వానలా హొరెత్తె నీ ఆలొచన తరంగాలను మదిలొ నిశ్మబ్ధ వీచికలా అదృశ్యం కానియ్యకు...

కనుమరుగై పొతున్నా అనుభూతులన్నీ నీర్లీప్తంగా నులి వెచ్చనీ కన్నీరుగా జారనివ్వకు...

మదిలొ ఉబికి వస్తున్న సందిగ్ధ తలంపులను మౌనంతొ అడ్డుకట్ట వేయ్యకు....

పదును పెట్టిన కలం నుండి జాలువారుతున్న భావాలను నీ అసమర్ధతొ తుడిచేయ్యకు...



పాలపొంగు పంచె కట్టుతొ... కల్మషం లేని చిరునవ్వుతొ...

నిండైన మాట తీరుతొ...అప్యాయంతొ పులకరించే ఆ పలకరింపుతొ...

హృదయాలలొ వెలుగుతునే వుంటావు....

రాజశేఖరుడిగా... దివి కేగిన పాలపుంతల రారాజు గా...

తెలుగు నేల పలవరిస్తుంది....

గుండెపగిలి రొధిస్తుంది......

అందుకొ మా ఆత్మీయపు పుష్పాంజలుల నీవాళి...



మావొయిస్టుల గుండెల్లొ సాహకుడు..

తెలుగు తల్లి కలల స్వాప్నికుడు ...

మట్టి పరిమళాల ప్రేమికుడు...

గాంధీలొని స్పూర్తి దాయకుడు....

నెహ్రు లొని దార్మనికత ఆదర్సకుడు...

ఇందిరమ్మ లా పట్టు వదలని విక్రమార్కుడు...

ఓటమి ఏరుగని దీరుడు...మా రాజశేఖరుడు....



నీ ప్రతి అడుగులొ ఆత్మ విశ్వాసం...

నీ ప్రతి పలుకులొ ఆత్మీయానురాగం...

నీ ఆహర్యమే నిండైన తెలుగుదనం...

నిరుపేద గుండెకు నువ్వె దైవం....

పంటకు నువ్వంటే ప్రాణం....

నీ చూపే రైతుకి పట్టెడన్నం...

నీ ఉనికే ఒక భరొసా....

మనిషిగా వచ్చి మహనీయుడవైయ్యావు...





నల్లమల కికారణ్యం లొ వరుణుడి విశ్వరూపాన్ని చూసి పులకిస్తూ...

వెలిగొడులొ జలయజ్ఞం ఫలాలను తిలకిస్తూ....

జనకొటి హృదయాలను బద్దలు చేస్తూ....

రాష్ట్రం యావత్తూ విషాద దిగ్ర్భాంతికి గురిచేస్తూ...

తన్మయం లొనే పంచభూతాల్లొ ఐక్యమయ్యావు...



ఆకాశం వైపు చూస్తే జలయజ్ఞం నీ నవ్వు...

నేలను చూస్తే శ్రమ ఎరుగని బాటసారి నీ తెగువా...

నీటిని చూస్తే పుంతలు తొక్కించాలన్న పొలవరం తపన...

ప్రతి క్షణం పలకరిస్తాయి .........


అప్పటి వరకు బాధ అంటే తెలీదు

అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప

కన్నీళ్ళు అంటే తెలీదు

నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప

కష్టాలంటే తెలీదు

నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప

విడిపోవడం అంటే తెలీదు

చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప

మౌనంగ వుండడం తెలీదు

సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప

మరి ఈరోజేమిటి..

నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి

అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో

భాషగా మారిపోతున్నాయి

మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి

వీడుకోలు చెప్పడం అంత కష్టమా?

అరే...ఇదేమిటి?

ఆకాశంలో కదా మేఘాలున్నాయి

మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?


ఉషస్సులు చూడలేకున్న మెలకువంటేనే భయమేస్తుంది....

నీ ఆలొచనలు చుట్టేస్తాయని....

నువ్వు దక్కవన్న చేదుని జీర్ణించుకొలేని మనసు తనువుని చింద్రం చేస్తుంది....

ఈ నరకం నుండి బయట పడమని....

నేనెంత దూరం పరుగెత్తినా నీ తలపులు నన్ను తరుముతూనే వున్నాయి...

నీ నీడలా తెంచుకొవడం సులువు కాదని.....


నీలి మబ్బుల నీడల్లొ .... వలపు తారల సందుల్లొ...

పూల దారుల వీదుల్లొ.... నడిచి వస్తున్న పగడలా జాబిలి నీవు....

నీ చరణ కింకిణు సవ్వడులు నా గుండెల్లొ వేయ్యి వేణువులవుతాయి...

నీ చిరు గాజుల చిలిపి మోతలు నా హృదయాంతరాళల్లొ కొటి వీణలు మీటుతాయి...

నీ చూపుల సుమశరాలు నా మనసులొ ఆనంద డొలికలు తేలిస్తాయి....

నీ నవ్వులు రతనాలు కర్పూర కళీకలతొ అనురాగ హరతులు పడతాయి....


తియ్యని ఊహల్లొ విహరిస్తూ చేదు నిజం వంటి వాస్తవాన్ని దాటేస్తా.....

మధురమైన ఆశలను గుండెల్లొ నింపుకొని నిరాశలను అధిగమిస్తా....

చేరువకాలేని ఆనందాల సవ్వడులతొ చేరువైన దు:ఖన్ని దిగమ్రింగెస్తా....

ఫలించని ఓటమి చూపులను ఎదురు చూపుల విజయంతొ అలంకరిస్తా....

దిగులుగా ఉన్న నేటిని తియ్యనైన రేపటి తొ జతచేస్తా....

వాస్తవంలొ నరకాన్ని.... ఊహల్లొని హరివిల్లులతొ స్వర్గధామం చేస్తా....

మనసులొని అనుభూతులన్ని అక్షరమాలగా మార్చి నీ కొసం ఎదురుచుస్తా....


నా కళ్ళకు ఎంత ఆశొ....

నువ్వు కనబడవని తెలిసినా వెదుకుతున్నాయి.....

నా కాళ్ళకు ఎంత తొందరొ....

నువ్వు దొరకవని తెలిసిన పరుగులు తీస్తున్నాయి...

నా మనసుకు ఎంత ఆత్రుతొ...

నువ్వు దక్కవని తెలిసినా ఆలొచిస్తుంది...

కాని ఏమి చెయ్యను....

నన్ను బ్రతికిస్తుంది... ఏప్పటికైనా నువ్వు ప్రేమిస్తావనే ఆశే..


నీవు తలుచుకుంటే నీ జ్ఞాపకాన్ని నేను...

నీవు మలుచుకుంటే నీ రూపాన్ని నేను...

నీవు పాడుకుంటే నీ రాగాన్ని నేను...

నీవు నవ్వుకుంటే నీ హసాన్ని నేను....

నీవు రాసుకుంటే నీ భావాన్ని నేను....

నీవు ఇమ్మంటే నీ ప్రాణాన్ని నేను....

నీవు మరిచిపొతే నీ స్మృతిని నేను....

నీవు రమ్మంటే నీ జ్యొతిని నేను....

నీవు దాచుకుంటే నీ బంగారాన్ని నేను...

ఎందుకంటే....

సదా నేను నీ ప్రేమికుడుని కాబట్టి.....


ఇంతకి ఎవరు చెలీ నీవు.....!

పాశంగా... ఆవేశంగా...

నా రక్త నాళల్లొకి చొచ్చుకుని పొతావు...

ఒంటరిని చేసి నా నవనాడుల్లొని సత్తువనీ పిల్చేస్తావు...

తర్కానికి అందని చమత్కరానివై....

తామరాకుల వయ్యారానివై...

అలలా... నా కలల మదిని కదిలిస్తావు...

ఇంతకి ఎవరు చెలీ నీవు.....!

వేడి గాలి పాడే వాడి సంగీతపు సూదులతొ...

నా స్వేద రంధ్రాల్ని శృతి చేస్తావు...

నా శరీరపు మాయ పొరల వెనుక....

మోహపు అలజడులను పుట్టిస్తావు....

అంతరాంతరాల్లొ కదిలే జీవధారవై...

అనూహ్యంగా వెల్లువెత్తే గొదారివై...

నా జడత్వాన్ని బద్దలు చేస్తావు...

ఇంతకి ఎవరు చెలీ నీవు....!


నీ మాటలు "ప్రవచనాలు"

నీ చిరునవ్వులు "బహుపదులు"

నాతొ నీకుంది "ప్రమేయం"...

నేను "ప్రదేశం".. నీవు "సహ ప్రదేశం"

మనసుతొనే ఏర్పడ్డాయి "సంబంధాలు"

మన మధ్య అనుబంధం "అన్వేకం"

కాకుడదు అది "ద్విగుణం"

"శ్రేడులు" సంసారంలొ...

"పదాంతరం" ఒకటితొ

ఏర్పడిన పిల్లలు "అంకశ్రేడి"

కాకుడదు "అపరిమిత సమితి"


అనంత కాలాగ్ని గొళంలొ తిమిరాలు తరుముతున్న వేళ...

నీ స్నేహం సూర్యొదయం లా తొచింది...

బ్రతుకు ఆశ అడుగంటిన అయోమయంలొ

నీ చూపు దిక్చూచిలా నిలిచింది....

అర్దం తెలియని ఆరాటంలొ... భావావేశ పొరాటంలొ...

నీ మాటలు ఓదార్పులా తాకింది.....

అడుగు సానని ప్రయాణంలొ ఒంటరి శిశిర సమీరంలొ...

నీ తొడు వసంతంలా చిగురించింది....


ఘడియైన సడి ఆపని గడియారంలా...

క్షణమైన అలుపెరుగని అవనిలా...

నిమిషమైనా నిలకడ లేని మనసులా...

అనుక్షణం సవ్వడి చేసే హృదయ స్పందనలా...

సదా నీ మధుర స్మృతులని నేమర వేస్తూ...

నీకై నీరీక్షిస్తున్నా...



సృజనాత్మక కళలు చిందే రంగులు నీ జ్ఞాపకాలు...


జీవన కాంతులు చిమ్ముతూ నడిచే సమ్మేలు నీ నడకలు...

సృష్టి అంతా నువ్వు ఒక పువ్వుగా మారి...

నా అంతరాళపు వెండి జలాల్లొ రెక్కలు విచ్చుతున్నావు....

పురాతన సువాసనలు పుక్కిలిస్తున్నావూ....!



నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా...

నాకీ ప్రపంచం మీద ... మనుష్యల మీద... అసహ్యం కలుగుతుంది...

మన మనుసుల మధ్య అడ్డుగొడలుగా నిలిచిన "కుల రక్కసి" పై కసి రేగుతుంది...

నా చేయ్యి పట్టుకొని నడవసిన నువ్వు....ఈ లొకం నుంచే మౌనంగా నిష్ర్కమించావు...

ఈ మహమ్మారే లేకుంటే నువ్వు నా వెంటే ఉండేదానివి కదా ప్రియా...!

మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఒక్కటే....

మీ కులం మీకు ఏమిచ్చింది...ఏమి తీర్చింది?

మీకు కడుపుకొత...నాకు గుండే కొత తప్ప...!

;;