దేనికొసం ఈ యువత వేతుకులాట...!?

అందం కొసమా....?

తగ్గుతున్న లావణ్యం కొసమా...?

కానే కాదు....

మారని తమ బ్రతుకుల ప్రక్షాళన కొసం....!

బద్దలైంది మీ బద్దకాల అద్దమే....మీలొ రగులుతున్న కసి కాదు.....

ఎదురు చూస్తుంది విజయమే ...గేలిచేస్తున్న అపజయం కాదు....

శకాలాల నిండా మీ ఆత్మవిశ్వాసమే....దెబ్బతిన్న మీ నీరాశలు కాదు....

మగత నిద్రలొ నిప్పులు లేవు... మరిగే గుండెలొ అరుపులు తప్పా...!

మనుగడ కొండపై రుధిర జ్వాలలు లేవు...జీవం చిందుస్తున్నా సింధూరాలు తప్పా...!

ఆవిరవుతుంది ఆత్మసాక్షి కాదు.... మది వీడని ఓటమి కలవరం తప్పా....!

రెప్పల తెరల్లొ చీకటి లేదు....తూర్పు రేఖల సూర్యతేజం తప్పా....!

నీరాశతొ నిండిన కళ్ళూను కడిగి చూడు....పరుగులు తీసే లక్ష్యం ఉంది....

మరిగే చెమట చుక్కను తుడిచి చూడు....చేరువయ్యే మార్గం చెంతనే ఉంది....



రెక్కలు లేకపొయిన నన్నొ "పక్షి"ని అన్నారు....

కనుల ముందు నీ అందాన్ని చూస్తున్నా నన్నొ గుడ్డి వాణ్ణీన్నారు...

నేను ఎంత స్వేచ్చగా ఉన్నా పూర్తీ బందీనన్నారు.....

నేను ఎంత ఆరాధిస్తున్నా.... నన్నూ నాస్తీకుణ్ణీన్నారు...

నువ్వే చెప్పు.... మన ప్రేమ సాక్షీగా....

నేను ప్రేమ పక్షినా...?

మన ప్రేమ గుడ్డిదా...?

నేనొ ప్రేమ ఖైదీనా...?

నేనొ ప్రేమ నాస్తీకుడినా...?

నీ జవాబు అవును అయితే మనది అమర ప్రేమరా...!


పుష్ప గుచ్చం నీకిస్తే... నవ్వుల జల్లుల్ని నాకిచ్చావు...


మనసు పడి ప్రేమిస్తే... మమతల వాన కురిపించావు....

ప్రేమ వరదలై పారేక ఎక్కడ కొట్టుకు పొయేవు....?

నా ప్రతి చూపు నీకై వెతుకులాటే....

నువ్వు ఎక్కడ ఉన్న నా గుండే గది ఖాళీ....

అలకలు మాని వచ్చి చేరిపొ....!

వలపుల తొటలొ వసంతాలు ఏరుకొ...!


నీ కనులకు కాంతి నేను....

నీ కలలను కన్నది నేను....

నీ కష్టమైన... నష్టమైన... మొత్తం నేను....

నీ చిరునవ్వు.... దిగులు... నేను....

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...

నీ ప్రతి నిమిషం తొడై నిలిచేది నేను....

నువ్వు కన్పించక పొతే బెంగతొ వెతికేది నేను...

నీ కన్నిటిని తుడిచేది నేను....

నువ్వు గెలిచిన విజయం నేను...

నీ అలసట తీర్చేది నేను....

నీ మెలుకువకు దీపం నేను....

నిన్ను అడుగడుగున నడిపించేది నేనని మరువకు మిత్రమా.....



నీకు తెలుసు ఒక్క రాత్రిలొ ప్రేమ పుట్టదని...

ఒక్క రాత్రిలొ నక్షత్రం పుట్టదని....

నా సృజనాత్మక లొకాన్ని మెల్కొపావు....

ఆ అంతర్లొకాలు పూస్తున్న పరిమాళాలే ఈ నాటి

గాలుల్లొ కలిపి వ్యాపిస్తున్నావు....

ఒంటరిగా  వంతేన మీద కూర్చొని...

నా మీద చంద్రుడి చేత వెన్నెల కురిపించుకుంటున్నా....

పారిపొతున్న ప్రవాహన్ని చూస్తూ..... మదిలొ బాధ....

నీకేం తెలుసు మిత్రమా....

నా అర్ధరాత్రుల్ని కాల్చే దీపాలకే తెలుసు....

నా నిట్టూర్పుల వేడి కధలు....

కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకొ......

ఎక్కడ నా కలలన్నీ నిజమవుతాయో....

ఆ మధుర నిశ్మబ్దం లాంటి ప్రవాసం నీ దరహసం...

రాజు నగరాల్ని పాలించినట్లు....గాలి తొటల్ని పాలిస్తుంది....

నీవు నా ఊహలన్ని పాలిస్తున్నావు....

చిన్నప్పుడు కాశీ మజిలి కధల్లొ నుంచీ.....

అరెభియన్ నైట్స్ కధల్లూ నుంచీ....

నా చైతన్య సీమల్లోకి దిగిన రాజకుమారులందరూ....

నీవుగా తలచి ప్రేమిస్తున్నానని మర్చీపొకా......!




తొటలొ పూలెన్ని ఉన్నా....సిరిమల్లె వంటి నీ నవ్వు చాలు....

ఎద పరిమళభరితమయ్యెందుకు....


నింగిలొ తారలెన్ని ఉన్నా.... జాబిలి వంటి ఈ మోము చాలు.....

మదిలొ వెన్నెల కురిసేందుకు.....


నా అన్నవారెందరున్నా.... నీ చెలిమి చాలు.....

నిశేదిని గొడల్నీ చీల్చేందుకు.....


నా దు:ఖ:మెంతున్నా.... నీ ఓదార్పు చాలు....

జాలువారే కన్నీటి తడిని తుడిచేందుకు.....


నా ఆనందం కొరకు వెనుక ఎందరున్నా....నీ తొడు ఉంటే చాలు.....

మౌనంగా ఉన్న గుండెలొ అనుభూతులను నింపెందుకు..........


నేను గమ్యం చేరేందుకు రెప్పల మాటున చీకటెంత ఉన్నా... నీ స్నేహం చాలు....

బ్రతుకున పున్నమి వెలుగులు విరిసేందుకు......


నా నీడగా ఎందరున్నా..... నా ప్రియ సఖి... నువ్వుంటే చాలు......

జీవితాంతం నీతొ కలిసి నడిచేందుకు......



మనసునే మగ్గంలొ విచ్చుకున్న మన స్నేహాన్ని సరికొత్త చీరగా మలిచాను....

జాలువారే కన్నీటిలొ ఆనందపు రంగులను కలిపి....చెలిమిని చెమికిలుగా దిద్దాను......

అనురాగపు చెక్కిళ్ల పై విరబూసే చిరునవ్వుల అందాలను జెరీ అంచుగా చిత్రీంచాను....

అత్తరు పూసిన మన నేస్తాల మొగలి పొత్తును ఆర్బాటపు హంగులను అద్దుతున్నాను.....

నా ఊహలన్ని పాలిస్తున్న నీ అలక ...కులుకుల సింగారాన్ని సప్తవర్ణాల దారాలుగా మలుస్తున్నాను...

నా అనుభవాల వ్యక్తీకరణకు అందని నీ అందాలన్ని కలబొస్తూ ఈ కొంగుకు చెంగును ముడివేస్తున్నాను...

చుర చుర చూపులతొ చీకటిని చిలుకుతూ...వెలుగుల నీ రూపాన్ని వింధ్యామర పైటగా సవరిస్తున్నాను....

ఎన్నొ నా కలలా అంతరాలలొ వెలిసిన ఆ కళత్మాక నేతా....

పసిడి కాంతులతొ నిండిన నా వన్నేల రాశికి అర్పిస్తున్నాను...



నన్ను విడిచిన నీ లొకంలొకి....నా ఒంటరితనపు గదిలొంచి

ఆశ... ఆశగా పరుగు పెడుతూ వస్తాను....

చేతినిండా కలువ పూలు పట్టుకొని నుంచుంటాను...

ఒక్కటైనా నువ్వు తీసుకుంటావని వెర్రిగా కాంక్ష పడతాను...

నువ్వు పలకరింతగా నవ్వగానే....ఆశ్చర్యం...

నా చేతిలొ బరువు పెరిగి ఇంకొ కలువ వచ్చి చేరుకుంటుంది... నీలా....


నీ చూపులు... పువ్వుల పాదాలతొ లేలేతగా కదలి వచ్చి...

చిగురుటాకుల్లా నన్ను తాకి....

యుగ యుగాల జ్ఞాపకాల కొసం...

నాలొ... నా లొ లో...అన్వేషిస్తావన్న భావన ....

అయిన నీ ఎడబాటుల మజిలి దొరకదేం మిత్రమా....

కలలా ఆకాశంలొ కురుస్తున్న....వెన్నెల వర్షాన్ని ఒడిసి పట్టుకొని తాగుతున్నా....

నా కనుఇంటిలొ ...తర తరాల వెలుగును ప్రసాదిస్తావన్న ఆరాధనతొ....

అయినా ఈ గుండేలొ నీ ప్రేమ దాహం తీరదేం నేస్తమా....

మౌనాన్ని దాటి వచ్చి నా మనసులొ మాట నీకు చెప్పలేకపొయా...

త్వరలొ మనస్పూర్తిగా నా మనసు నీ కందిస్తా....

ఇంతకి ఏముంది నీ చూపులొ...



దూకుదామా.... తాకుదామా... మెల్లగా వచ్చి ఆక్రమించుకుందామా అన్నట్లుగా....

నీ చూపుల సమరం ను నా ఒంటిపై పారడినట్లుగా చాకచక్యతను చూపిస్తున్నావు....

తనువు పరాజితమై మరులుతున్న నిశివేళలొ నీ సరసం కూడ కొద్దిగా రుచి చూపించరా...!

అనుమతిలొ నా ఊహల అంగరక్షకుడిగా పహరా కాస్తున్నావు...

తడారిపొయిన నా కలలా ఏడారిలొ నీ సొగసు చినుకులను కురిపించరా....

కర్ణపుటంచుల నుండి జారుతున్న మగసిరితొ నా అందానికి అంటుకడుతున్నావు....

మధన చెరసాలలొ ఖైదీ కాని కాంక్ష వుంది తాపంతొ కరుణించరా ...

అంతులేని ఎడబాటుతొ గుండెలొ విరహపు గార మోగిస్తున్నావు....

నవసొయగాల తడి సుగంధాన్ని అంతు చూడనిదే నాకు నిద్ర రాదురా...

దేహపుటగాధాలలొ శాశనాలు కూడ ఆపలేని గాఢతను రగిలిస్తున్నావు....

ఉద్వేగంతొ కాలుతున్న నా ఏకాంతానికి నీ అదర సుధలతొ ఆర్పేయరా....

శతజన్మలైన ఆగిపొని యాత్ర చేసి బుగ్గలొ సిగ్గులను పూయిస్తున్నావు...

నా హృదయ సామ్రాజ్యనికి అధిపతివై నన్ను హత్తుకొరా...

ప్రాయమైనా... నా ప్రాణమైనా .....నీకొసమేరా...!

ఈ కుసుమం పై నీ కొప ఖడ్గం దూస్తావేందుకురా.. కనికరించి సేదతీరరా....


నీవు నా చెంతనుంటే....

ఊహతొనే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిస్తావు...

నవనాడులూ జ్వలింపజేస్తావు....నరనరాలు జ్వరిస్తావు.....

జాగుచేయక దరిచేరుదామంటే....

చుట్టు చీకటీ ...ఆపై వాన ... జంటగా వెక్కిరిస్తున్నాయి...

కలహంసై తనువును సుతిమెత్తగా తడుముడుతుంటే....

నీ జ్ఞాపకాలతొ భారంగా... బాధగా కనులు మూసుకుంటే....

ఇక నిద్రలేలా వస్తుంది....రాత్రి ఎలా గడుస్తుంది.....

దగ్గరలేని దూరంలొ... ఓపలేని భారంతొ... అణుక్షణం నీ కొసం తపిస్తున్నా....

కదలని పగళ్ళు.... కలలా రాత్రులు ... కలత నిదురలు....

నిట్టుర్పుల సెగలు... ఓదార్పులేని దిగుళ్ళు ఎన్నాళ్ళీలా....


గాడ నిద్రలొ సేద తీరుతున్న వేళ....

కలొ...కలవరమో...ఏదొ ఓ ఉలికి పాటు రూపంలొ తనువును...

మనసును ఒక్కసారిగా కుదిపితే...

అసంకల్పితంగానే ఓ మెత్తటి చేతి స్పర్స వెచ్చగా జొకొడుతుంది....

"నిశ్చింతంగా ఉండు ...నేనుండగా' అన్నట్లు ప్రేమగా లాలిస్తుంది...

అక్షరాలలొ ఒదగని అద్బుతమైన నీ స్నేహనుభూతిని భరొసాగ అందిస్తుంది...

బ్రతుకు పుస్తకంలొ తొలిపుటలొ ఆ స్నేహం తల్లిదైతే....

చివరి అక్షరం వరకు ఆ నిశ్చింతను అందించే హక్కు ...అధికారం జీవనసహచరితే...

మనలొ సగభాగమై...తన అస్తిత్వన్ని మనలొ చూసుకొనే జీవిత భాగస్వామిదే....

ఆ బంధం ఎంత సున్నితమో... అంత అమృత ప్రాయం....చెడితే అంత విషతుల్యం....



ఎదురుగా ఉన్నప్పుడు కన్నుల్లొ...

దూరంగా ఉన్నప్పుడు నా ఊహల్లో కాలక్షేం చేస్తుంటావు....

ప్రంపచాన్ని పట్టించుకొనంతగా పరవశంలొ ముంచేత్తిస్తావు......

అణువణువునా నిండి నా హృదయాన్ని చైతన్య ప్రవాహంగా మారుస్తావు....

మనసును మౌనంగా పాలిస్తావు....

ఆశలను ఆకాశంలొ విహరింపజేస్తావు....

అనుభవ వ్యక్తికరణకు అందని భావంగా నిలుస్తావు....

చెప్పలేని అనుభూతితొ మనసును హత్తుకుంటావు...

ఊహల పల్లకిలొ ఓలలాడిస్తావు.....

ఏమిటి నేస్తం ఈ మాయ.....!



నగిషీ కొసం ప్రాకులాడే మానవుడు

అందని చుక్కలవైపు చూపును నిలుపుతున్నాడు ...

కళ్ళముందు కదలాడే కటిక నిజాలను చూడకుండా...

గాలి మేడల సౌదాలలొ గుడ్దివాడై జీవిస్తున్నాడు.....

జీవన నాడులైన అప్యాయతలను వదిలి....

స్వర్గాన్ని అందుకొవాలనే ప్రేరాశతొ నింగికి నిచ్చేనలేస్తున్నాడు....

అనురాగల విలువ మరిచి... అనుబంధపు పేగు తెంచి....

సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మారుతున్నాడు...

మమకారాలను అదృష్యం చేస్తూ.....

మానవ ఇతిహసాని మరిపింపచేసే ఈ చదువు సంష్కారాలేందుకు......!

కరుణను కాల్చే మతాన్ని ఆస్వాదిస్తూ....

గుండేను దయ లేని బండగా మార్చే కులాలతొ నిండిన ఈ సారం లేని సాంప్రదాయాలేందుకు....!

బుణం తీర్చుకొనే తరుణం వస్తే పురాతన జీవితాన్ని బూడిద చేస్తున్నాడు...

ఆర్బాటపు ఏరుకు చెరుకొగానే.... ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....

ఎప్పుడు మారుతుంది ఈ సమాజం....మనసున్న మనిషిగా అభిలషిస్తున్నాను.....



కడుపు కింత కూటికొసం అలమటిస్తే.....

కనపడ్డొడల్లా కడుపు కిందకి సూసినొడే గాని...

కనికరించినొడు లేడు ఈ దేశంలొ....

"బొడ్డులొ రూపాయి బిల్ల..." పాటకి నువ్వదరగొట్టేశావని

ఒకడొచ్చి నా గుండెల మీద వందనొటు గుచ్చితే....

ఇంటికాడ తన బిడ్డ జరానికి మందులొస్తాయని నవ్వాలొ...

లేక వాడు తన రొమ్ముల్ని నొక్కినందుకు ఏడవాలొ తేలియక.....

పాట...పాటకి డ్రస్సులు మార్చినట్లే...

ప్రతి అవమానానికి నవ్వుకట్టగా మార్చుకుంటునా వాళ్ళేందరొ....

ఒక రూపాయి తన్ను చూసి ఈలేసినా...

ఒక కళా పొసన తన్ను చూసి కన్నుగొట్టినా....

ప్రొగాం అయిపొయాక ప్రతి ఊరు "నీ రేటేంతని అడిగినా"....

ఎదురు తిరిగితే ఎండు కుంటమే దిక్కు గనుక....

మొఖం రంగుతొ పాటు అన్ని కడిగేసుకుంటు పొయిన వారెందరొ....

అయిన వెండి తెరకొ న్యాయము... ఎడ్లబండి స్టేజికొ న్యాయమా....

బొడ్డు సుట్టూ పదారు రీళ్ళు తిప్పి తిప్పి మొకాన కొడితే....

బంగారు నందుల పురష్కారాలిచ్చే దేశంలొ....

నేను బొడ్దు సూప్పిచ్చే సరికి ఆశ్లీలమై కూకుందా...?

అని ప్రశ్నించుకునే వారు లేకపొలేదు....

కూటి కొసం కొటి విద్యల్లొ ఇది కలిసిపొవలిసిందేనా....

ఎప్పుడు మారుతుంది ఈ సమాజం...

ఒక భావి భారత పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను.....!


(నేను గ్రానేట్స్ పని మీద చీమకుర్తి వెళ్ళవలిసి వచ్చింది....అప్పుడు అక్కడ తిరునాలలొ....

రికార్డింగ్ డాన్సర్స్ నీ చూసాను....ఆశ్లీలంగా ఉన్న నృత్యాన్ని ద్వేషించాలొ...లేక...విధి వారి

బ్రతుకులను ఇలా మార్చిందని బాధ పడలొ తేలియక ఈ కవిత రూపంలొ పొందిపరచాను.....

తప్పులుంటే మీ యొక్క పెద్ద మనసుతొ ఈ చిన్న వాడిని క్షమించండి..... )



(వరద బాధితులను దయచేసి మానవతతొ అదుకొండి....మీకు తొచిన సహయం చేయ్యండి.... మీ రేవా....)

ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకొంది....

ఆనందం మనసులొ మయూరబర్హంలా విప్పుకొంది...

ఆలొచన లెందుకు జవ్వని...!

విలొకించు వర్షా సంధ్యని....!

అని ఒక కవి అన్నట్లుగా....

ప్రకృతి వికహట్టహసం చేస్తే మనిషికిక దిక్కేది...?

కరుణ చూపాల్సిన వరుణుడు ప్రళయ గర్జన చేస్తే వేరే దారేది...?

అన్యాయం విలయమై విరుచుకు పడింది....

మానవ జీవితం కకావికమైనది...

ప్రజల కల చెదిరింది... తీరని వ్యధ మిగిలింది....


ప్రతి ఉదయం భారం తొనే మొదలవుతుంది...

ప్రతి రాత్రి సమస్యల సుడిగుండంతొనే ముగుస్తొంది...

రేపటి మీద వారికిప్పుడు ద్యాసలేదు...

ఈ పూట గడిస్తే చాలన్న ఆశ తప్ప...!

మనం తేరుకొని ఒక్కసారి తేరపార చూస్తే...

నలుదిశల కన్పిస్తున్నది.... ప్రళయ శిధిలాలు...

వినిపిస్తున్నది శిధిల నాధాలు...

జన జీవన స్రవంతికి జీవనాడులైన అనుబంధాలు

అయిన వారికొసం మినుకు మినుకు మనే ఆశతొ....

ఎదురు చూపలు ఆదరవు కొసం అన్వేషణ....

అన్ని కొల్పొయి.... అందర్ని కొల్పొయి....

జీవం ఉన్న జీవచ్చావాలు...అడుగడుగునా స్మశాన వాటికలు....

మానవ ఇతిహసంలొ అనుబంధపు పేగు కదలాలిప్పుడు....

అందుకొసం ఒక్క క్షణం మనసు పెట్టి ఆలొచించండి....


ఆరొజు ఎప్పటిలాగే తెల్లవారిందని అనుకున్నారే కాని...

తమ బ్రతుకులిలా తెల్లారిపొతాయని వారు ఊహించలేదు...

ప్రకృతి ఒడిలొ దగాపడిన జీవితాలు... మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి.....

సాటి మనిషికి సాయమందించడమే కధా మానవతా....!

ఆపదలొ అదుకొవడమే కధా సహృదయతా.....!

పట్టెడన్నం వారికిప్పుడు పరమానం.....

చిరిగిన వస్త్రం వారికిప్పుడు పట్టు వస్త్రంతొ సమానం....

మీ హృదయపు కవాటలు తెరిచి....

దాతృత్యపు పార్వర్సాన్ని సృశించండి....


తెల్లవారితే కూడు దక్కదు....

పొద్దు వాలితే గూడు చిక్కదు...

కంటికి మింటికి ఏకధారగా కారే కన్నీటి సంద్రంలొ ఎన్ని ఉప్పెనలొ...!

గాయపడ్ద గుండెల్లొ గూడుకట్టిన ఎన్ని ఫెను తుఫానులొ....!

నిన్న తల్లి ఒడిలొ హయిగా ఆదమరిచి నిద్రపొయిన చంటి వాడు...

నేడు కంటికి కూడ కానరాని దూరతీరాలకు తరలిపొయిన తల్లిని తలంచుకుంటు...

ముంజేతులతొ కన్నులు తుడుచుకుంటూ...

ఏ అరుగు మీదనొ....అనాధలా నిద్రపొయే పరిస్ధితి...

ఆర్ధిస్తొంది దీనంగా... అదుకొండి మనసారా....!


తిలక్ గారు అన్నట్లు.....

ఆ రొజుల్ని తలంచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి

విచారం కూడ కలుగుతుంది....

నేటి హేమంత శిధిల పత్రాల మధ్య నిలిచి....

నాటి వాసంత సమీర ప్రసారాల తలచి...

ఇంతే కధా జీవితం అన్న చింత....

ఇంతలొనే ముగిసిందన్న వంత....

చెమ్మగిల్లిన నాకళ్ళును చెదిరిన నా మనస్సుతొ....

ఇటు తిప్పుకుంటాను... ఎవరైన చూస్తారేమోనని....


"కమ్మరి కొలిమి... కుమ్మరి చక్రం...

జాలరి పగ్గం... సాలెల మగ్గం...

శరీర కష్టం స్పూర్తింపజేసే గొడ్డలి... రంపం... కొడవలి... నాగలి...

సహస్రవృతుల సమస్త చిహ్నలు....

నా వినుతించే... నా విరుతించే... నా వినిపించే...

నా విరిచించే నవీనరీతికి... భావం.. భాగ్యం.. ప్రాణం... ప్రణం...

అని ప్రస్పూటించిన మహకవి వాక్కులు అక్కడ నేడు తెల్లబొయాయి..."


జిల్లాలు ఎల్లలు దాటి... సముద్ర తీరాన చేరి ....

సాగర గర్జనే నమ్ముకుని బ్రతికే వారేందరినొ ఆ సముద్రమే

నిర్దాక్షణ్యంగా కబళించేసింది....

ఇలా ఎందరవొ ఒంటరి బతుకులు...

మరెన్నొ గుండెల్లొ ఆరని చితులు....

బతుకు వారికిప్పుడు సమరం....

కాస్తంత మన సహయమే వారికి కొండంత ఉపకారం....


అద్దం ముందు నిలబడితే నా కంటి పాపలొ నీ ప్రతిబింబం కన్పిస్తుంది.....

నా గుండెను సృశిస్తే స్తబ్ధతకు ప్రతీకగా నీ పేరు ప్రతిద్వనిస్తుంది....

చిరుగాలిలొ చేతులూపితే నీ స్మృతి పరిమళం చుట్టుముడుతుంది....

నువ్వు నా చెంత నుంటే ఊహల వాతవరణం వేడెక్కుతుంది...

నీ జ్ఞాపకాలు తొడుంటే...నిన్న కన్న కల మరియు రేపు కనే కల నీదవుతుంది....

నీ చిరునవ్వుల వెలుగుంటే....ఎడబాటుల నిశేది అస్తమిస్తుంది....

రెప్పలలొ దాగిన కన్నీటికి నీ ఓదార్పుంటే....అంతరంగాలలొ దాగిన దిగులు ఆవిరవుతుంది...

మరి అణువణువునా నీవైనప్పుడు... నా ఆలొచనలే నీదైనప్పుడు...

నిద్రెలా వస్తుంది... రేయేలా గడుస్తుంది....నేస్తం...!



జీవితం ఒక సంద్రమైతే ....

అందులొ ఎగసిపడే అలలు నీ గురించి కన్న కలలే.....

నా అంతరంగాలలొ ఉప్పొంగే తరంగాలైతే....

అందులొ విచ్చుకున్న ఆలొచనలు నీ గురించి కన్న తలపులే....

నేస్తమా.....!

ఆరాధన భావమో... మరి ఆకర్షణ స్వభావమో తెలియదు కాని

విరబూసిన వెన్నెలలా నువ్వు కన్పిస్తే చాలు...

నా మది వికశించిన పుష్పమవుతుంది....!

జ్ఞాపకాల మధురమో....మరి నీరిక్షణ సుమధురమో.... తెలియదు కాని

కలబొసిన చిరునవ్వుతొ నువ్వు పలకరిస్తే చాలు...

స్వేచ్చయుత మయురిలా తనువు పులకరిస్తుంది....!

ఆశల ఊసులను మూటకట్టుకొని....

సమశయమనే పొరను చేదించి నిన్ను పలకరించాలని...

నీ మృదు మధుర మాటల ప్రవాహంలొ పాల నురగనై పరవశించాలని ....

మనసును దాగిన కొరిక ప్రేరేపిస్తుంది.... కాని

ఉవ్వేతున పొంగుతు వచ్చిన అలలు.... ఇసుక రేణువులను చూసి

తన్మయత్వంతొ మాటలు మరచి వెనుదిరిగి వెళ్ళినట్లుగా.....

నీ చెంత చేరే సరికి కంటపడని బిడియంతొ మాటలకు అడ్డుకట్ల వేస్తున్నాను ...

మౌనంగా మరలిపొతున్నాను....

ఎప్పటికైనా నీ దేహంతరంలొ ఒదిగిన హృదయ వీణను మీటి....

నీ గీతామృతంలొ నేనూ ఒక బిందువు కావాలనీ....

నీ చల్లని గాన ప్రవాహంలొ పల్లవిగా నిలవాలనీ ....

కల కాలం నీ స్నేహం కొసం పరితపిస్తూ......

నిశ్మబ్ధ మహ సముద్రంలా నీరిక్షిస్తాను....

 





అలలా సవ్వడితొ నిండిన సంద్రపు హాసాలను ఆస్వాదించగలను కాని నిన్ను సముద్ర హసినిగా అభివర్ణించలేను...

చీకటిని తరుముతూ హేమంతపు వెలుగు కిరణాలను ప్రసరించగలను కాని నిన్ను హేమలతగా సాకలేను...

మమతనురాగలతొ నిండిన తేజొదీపాన్ని విక్షించగలను కాని నిన్ను మమతగా పలకరించలేను....

ఆరాధనతొ నిండిన చల్లని చూపులలొ పవిత్రతా చేకూర్చగలను కాని నిన్ను పవిత్రగా ఆస్వాదించలేను....

నిశేదిలొ స్మరిస్తూ... ఎడబాటులొ శొధిస్తూ.. నీరిక్షించగలను కాని నిన్ను ప్రియగా ప్రాణం పొయ్యలేను....

పదాలను పువ్వులుగా కూర్చగలను కాని నిన్ను పద్మగా పిలవలేను ......

సాహిత్య సుమాలలొ నృత్యరీతిలేన్నొ సాక్షాత్కరించగలను కాని నిన్ను రంభగా రచించలేను....

ఒదిగి పారే నదిలొ ఒంపులను స్వాగతీంచగలను కాని నిన్ను ఊర్వశిగా ఊహించలేను....

ఆరబొసుకున్న దృశ్యాలను తలపులలొ చూడగలను కాని నిన్ను మేనకగా మలుచుకొలేను...

ధారగా పడుతున్న గులాబి రెక్కలను తాకగలను కాని నిన్ను రొజాగా మదించలేను...

కలలలొని దూరతీరాలను భావంగా మలచగలను కాని నిన్ను కవిత గా కూర్చలేను...

స్వేచ్చయుత ఉదయ సంధ్యలా నీ రూపాన్ని కాంక్షించగలను కాని నిన్ను సంధ్యలా చూడలేను....

నీలి మబ్బుల ఓయ్యారి నడకలను చూడగలను కాని నిన్ను నీలిమ గా తలచుకొలేను...

వెన్నేలొ ఆడపిల్లని చూసి పులకించగలను కాని నిన్ను పున్నమిగా పరితపించలేను....

హృదయ గానంలొ రాగరంజితం చేయగలను కాని నిన్ను రాగిణి గా బంధించలేను....

ఊహల హరివిల్లులొ దారులన్ని స్వర్గంగా మార్చుకొగలను కాని నిన్ను ఊహ గా ఆరాధించలేను..

అందుకే

నా మదిలొ ఆత్మీయతతొ నిండిన నిన్ను "బంగారం" అని పిలుస్తున్నాను...

ఓ స్నేహితుడిగా జీవితపు కడవరకు నీకు తొడుగా నడవాలని ఆశపడుతున్నాను....



వెన్నెల కాసే అడవి అందాలను ఆస్వాదించాలని ఆశ...

పాటకు అందాన్నిచ్చె పల్లవి కావలని ఆశ....

సెలయెటికి సొగసులనిచ్చె ఓ అలలా బ్రతకాలని ఆశ....

మార్గం లేని జీవితాలకు మార్గదర్సకం కావాలనే ఆశ...

జాలువారుతున్న కన్నీటికి ఓదార్పు అవ్వాలని ఆశ...

అరవిరిసిన కుసుమ సుధను భ్రమరంనై ఆస్వాదించలన్న ఆశ...

జాలువారుతున్న స్వాతి చినుకును పుడమి తల్లినై దొసిలి పట్టాలని ఆశ....

ఉదయిస్తున్న సూర్యునికి తూర్పుని కావలని ఆశ....

విర్రవిగిన వెన్నెలకు శసినై హత్తుకొవాలని ఆశ.....

గానుగెద్దులా తిరుగుతున్నా కాలన్ని నా గుప్పెట్లొ బంధించాలని ఆశ....

తాపంతొ మత్తెకిస్తున్న ప్రకృతి కాంతను మంచు బిందువునై ముద్దాడాలని ఆశ....

హొయలతొ గుబులు పుట్టిస్తున్నా పులరాశులన్నింటికి పరిమళమై కమ్మెయాలని ఆశ....

నాలొ ఎన్ని ఆశలు ఉన్నా నన్ను కని పెంచిన తల్లిదండ్రులు....

నన్ను ఆశీర్వదీంచే నా గురువుల ఆనందాన్ని చూసి తరించాలని ఆశ...



నిరాశ నిస్మృహలతొ నేను నిస్తేజమైన వేళ...

వెన్నల చంద్రుడులా ఉత్సహన్ని నింపింది నీ పిలుపు....

వైణీకుడిగా నిష్పల ఎండమావులకై నేను పరుగులు తీసే వేళ....

సైలయేరై సేద తీర్చింది నీ తలపు....

ఆశయ సాగర మధనంలొ నేను అలసిన వేళ....

అమృత హస్తమై ఆదరించింది నీ వలపు....

జీవన వ్యూహంలొ దారులన్ని మూసుకుపొయిన వేళ....

ప్రస్పూటిస్తున్నా సౌధాల అడుగొడలని కూల్చింది నీ తీర్పు...

ఏకాంతంలొ అక్షరాలన్ని నన్ను అపరిచితుడుగా చూస్తున్న వేళ....

మౌనంలొ దాగిన భావాలకు ఆకృతినిచ్చింది నీ ఓదార్పు....

ఉప్పొంగే అంతరంగాలల్లొ నా గమ్యం దిశ కొల్పొయిన వేళ....

నా బాటలొ జీవానంతర పరిమళాలు వెదజల్లింది నీ రూపు....

నా ఖండాంతర జ్ఞాపకాలన్ని జల సమాధి అవుతున్న వేళ...

ఆశగా అంతరాలను మెల్కొపింది నీ చల్లని చూపు.....

నేను నమ్మిన ఈ లొకం నన్ను ఒంటరిని చేసిన వేళ....

"నీకు నేనున్నాను నేస్తం" అని అప్యాయంగా ఆహ్వనించింది నీ హృది తలుపు....

అందుకే నేస్తం నీ వ్యక్తిత్వానికి నేను అంకితం....

;;