మన భాషని మనం మాట్లడక పొతే ఎవరు మాట్లాడుతారు...?

మన అక్షరాలు మనం వ్రాయకపొతే... ఎవరు వ్రాస్తారు..?

మన సాహిత్యం మనం చదవకపొతే... ఎవరు చదువుతారు....?

మన అమ్మను మనం గౌరవించకపొతే... ఎవరు గౌరవిస్తారు....?

యాభై ఏడక్షరాలు...మూడు ఉభయాక్షరాలున్న

మన వర్ణమాల ప్రపంచ భాషల్లొనే రెండొది...

శతాబ్దాల నాడే మన అజంతాల భాష... దిగంతాలకు వ్యాపించింది...

ప్రపంచ కధనికలొ గుణాఢ్యుడైన...హాలుడు గాధసప్తశతైన......

రాయలవారి ఆముక్తమాల్యదైన.. త్యాగయ్య... రామయ్యకర్పించిన...

ఘన రాగ పంచరత్నాలైనా...అనుసృజన చేయ్యడం అసాధ్యం...

కాని నేడు...

తల్లి పాడే చందమామ పాట కొండెక్కిపొతుంది...

బామ్మ చెప్పే ఓరాజు కధ కంచికి పొయింది...

అమ్మ మమ్మిగా మారిపొతుంది...

నాన్న అనే తెలుగు తొటకు డాడి అనే కలుపు అంటుకుంది...

ఎ బి సి డి ల వేడికి తెలుగు పలుకులు మాడిమసయిపొయాయి...

బుడతడి భుజం మీదున్న బండెడు పుస్తకాలలొ...

మచ్చుకైన ఒక్క తెలుగు పుస్తకం కనబడకుండా పొయింది...

భాష దురభిమానాన్ని ఎవరూ హర్షించరూ... అలాగే

అంటరాని భాషగా తొసేస్తున్న...

మన వింత మనస్తత్వాన్ని ఎవరూ సమర్ధించరూ కూడ...!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ... అంటూ...

ఏకంగా తెలుగు భాషకే ... మంగళ హారతి పాడేస్తున్నాం...

నేను తెలుగు వల్లభుడిని...అందుకే తెలుపుతున్నాను....

"మాతృభాషా దినొత్సవ శుభాకాంక్షలు...."


మౌనంతొ మాటలు కరువైన రోజులుకి దూరం గా...

నాలొ నేనే మట్లాడుకుంటూ...

నన్ను నేనే ఓదార్చుకుంటూ... గడిపిన క్షణాలను మరచి పొతున్నాను...

చిక్కటి నిషేదిలొ ఉలిక్కి పడిన నా కళ్ళలొకి...

అంధకారమైన భవిష్యత్తుని చూస్తూ....

ఆవేశంతొ రగులుతున్న నా గుండె చప్పుళ్ళకి లయగా ...

విర్రవీగుతూ...వికృత నాట్యంతొ సాగిపొతుంది కాలం గానుగెద్దులా....

ఉదయం కోసం ఎదురు చూసినా నా బ్రతుకుని వికటాట్టహాసం చేస్తూ...

నిదుర లేని చీకటి రాత్రులనే మిగిలుస్తూ.. వెళ్ళీపొతుంది విధి విలాశంగా...

సమస్యల శృంఖలాలును తెంచుకొని బాహ్య ప్రపంచం లోనికి అడుగు పెట్టాను....

ఎటు వైపు చూసినా... పచ్చిక బయళ్ళతో ప్రపంచం కళకళలాడుతోంది...

చల్లగాలుల పలకరింపులతో... మేను పులకరిస్తుంది....

చీకటి గుహలకు దూరం గా...

నాలుగు గోడల మధ్య బందీ గా ఉన్న రొజులని మరచి పోవాలని...

విజయాల వెలుగు రేఖల వైపు అడుగులు వేస్తూ...

భయాలన్నిటినీ ధైర్యంతొ విచ్చుకున్న కత్తులకు బలి ఇస్తూ...

చైతన్య వర్ణాల నిండిన... స్వేఛ్ఛా లొకం లోకి పరిగెడుతూనే వున్నా....

మలి సంధ్య వెలుగులను నింపిన దీపాలకొసం....పులకించే పుష్యరాగాలుగా...


నాలొ ఉన్న నమ్మకానికి...

నన్ను నడిపించే ధైర్యానివి నువ్వేనని ఎలా చెప్పను...?

నాలొ ప్రతి శ్వాసకి ....

నేను బ్రతికున్నది నీ ఆశతొనేనని ఎలా తెలుపగలను...?

నీ పేరు పలకాలనే పెదవులకి...

నా చిరునవ్వే నువ్వని ఎలా చెప్పను...?

నిన్ను ఆర్తిగా వెతికే నా చూపులకి...

నా కంటిపాపే నువ్వని ఎలా చెప్పను...?

మదన పడుతున్న నా మదికి....

నా మనసాక్షివే నువ్వని ఎలా చెప్పను...?

నీ ఆలొచనల్లొ తెలుతున్న నా ఊహలకి...

కంట పడని నా ప్రాణం నువ్వని ఎలా చెప్పను....?

నా అంతర్మధనంలొ నలుగుతున్న నీ ప్రతి జ్ఞాపకానికి...

నా గుండెచప్పుడు నువ్వని ఎలా తెలుపను....?

నిశేదిని పాలించు నిశ్శబ్దనికి....

తడబాటుతొ నిండిన ఈ హృదయ ఎడబాటుని ఎలా చెప్పను...?

స్నేహితులుగా మనం కలిసి గడిపిన కాలనికి...

నీ మీద నాకున్నది ప్రేమే అని ఎలా చెప్పగలను...?



క్రూరత్వం వికటాట్టహసం చేసింది...

ఒక అమానుషం జడలు విప్పి నర్తించింది...

అన్నెం... పున్నెం... ఎరుగని బాల్యం మాడి మసయింది...

క్రూరాగ్ని కీలల్లొ చిక్కి...బూడిద కుప్పగా దర్శనమిచ్చింది...

కంటి పాప కనుమరుగయిపొయిందని...ఆ కన్న గుండె మూగబొయింది...

వెలుగునిచ్చే ఆ ఇంటి దీపం ఆరిపొయింది....

మొన్నటి వరకు... సిరిమువ్వల సవ్వడితొ ఆ ఇల్లంతా సందడి...

నేడు మాటలకందని మహవిషాధం...తండ్రి పార్ధివ దేహం...

హృదయ విదారక దృష్యం...దుశ్చర్యకు లేదు క్షమార్హం...

కరుణ చూపల్సిన కనక దుర్గమ్మ... విధిరాతకు తలవంచి...

ఓ నిండు ప్రాణం కసాయిల చేతిలొ కాలుతుంటే... మౌనంగా చూస్తూ...

బండగా మిగిలిపొయింది....

మానవత్వం మచ్చుకయిన లేని ఈ మానవ మృగాలపై...

ధన దాహపు ముసుగులొ దాగిన కసాయితనం పై...

ఉబికి వస్తున్న...నా ఆగ్రహనికి ... లేదు అంతం...

నీ అంతిమ యాత్రను చూసి ....

ద్రవీభవిస్తున్న నా హృదయం కన్నీరు ... మున్నీరుగా విలపిస్తుంది....

చమరిన నా కళ్ళతొ...వేదన నిండిన నా గుండెతొ....

ప్రగఢ సంతపాన్ని తెలుపుతున్నాను...

;;