ద్వారానికి వయ్యరంగా అనుకొని నిలబడి....


ఓయ్యారి వాలు జడనికొమలమైన నీ చేతులతొ తిప్పుతూ...


వేడి చూపులను నా పై విసురుతూ...


ముని పంటితొ పెదవిని నొక్కి పట్టి...


కాలి బ్రొటన వ్రేలుతొ నేలకు రాస్తున్నావు...


కాని నీ బ్రొటన వ్రేలు తీసి చూడు...


నేలకు ... నీ వ్రేలుకు మధ్య...నలుగుతున్న నా హృదయం...


ములుగుతుంది ...!


పడమటి దిక్కున అస్తమిస్తున్న భానుడుకి విశ్రాంతిని ప్రకటిస్తూ...

అసుర సంధ్యలొ మృత్యునీడలా క్రమ్ముకు వచ్చే...

నీశేది తెరల మాటున వీస్తొన్న ఈదుర గాలులు...

విరహంతొ నలుదిశల విరుచుకు పడుతున్న వెండి వెన్నెలని చూసి...

పులకరింతతొ...పొటెక్కి...ఉధృత రూపంతొ ఎగసి పడుతున్న సముద్రపు అలలు...

బ్రతుకు తెరువుకొసం వల విసురుకుంటూ...

లొలోపలికి పొతున్న దృశ్యం పారదర్శకంగా తొచింది...

క్రమక్రమంగా కనుమరుగైపొతున్న కొడుకు రూపం...

ఏటిలొ నిరంతరం వాళ్ళకు బ్రతుకు వేట...

జీవన సత్యం ఊహలకు అతీతంగా... రొజు మృత్యుపు ఒడిలొ ఆట...

తనతొ క్షణమైన సంభాషించని దుఃఖంతొ...

తప్పన సరియైన భుక్తి కొసం...

తెరచాపనెత్తిన సాహస తనయుడిని కొసం...

తీరం దగ్గర తలడిల్లుతున్న...ముసలి తండ్రీ...

ఎన్నాళ్ళుకొ తన స్మృతి పథంలొ మెదిలిన జ్ఞాపకంతొ...

తన మసక కళ్లపై అడ్డంగా చేయి వుంచి...

కారే కన్నీటిని అంతర్లీనం చేస్తూ...

వేదనతొ నిండిన నేత్రాలతొ...

వెలిగి వెలగక వెలుగుతున్న లాంతరులా నీరిక్షీస్తున్నాడు...

వద్దన లేడు..వారించను లేడు...

ఆ వయసులొ అతనిదీ అదే వరస కనుక...

అంతరంగంలొ నలుగుతున్న ఆలొచనల నడుమ...

సతమతమవుతున్న ఓ ముసలి ప్రాణం...



కొత్త ఆశలతొ కొవెల గంటలు మోగిస్తూ...

కొటి కాంక్షలతొ కొయిల పాటలు పలికిస్తూ...

ప్రణవ నాధంలా తరలి వచ్చింది వికృతి నామ ఉగాది...

వేప పూతలు.. లేత మామిళ్ళు... మంచి గంధాలు...

మంగళ తొరణాలు... పసుపు గడపలు... పంచంగా శ్రవణాలతొ...

తెలుగు లొగిళ్ళు కళ కళలాడే ఈ పండుగ వేళ...

నా సొదరి సొదర మనులకు... మరియు... ఈ సభకు విచ్చేసిన

శ్రేయోభిలాషులకు... అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నాను...

ముంగిటనే సరికొత్త శతాబ్ధి నిలచిన ఈ సుమధుర సమయాన

ఎప్పటిలానే నేను ఆనందంగా ఉండాలని... నా ఆనందం మీకు...

అంకితమవ్వాలని... చెక్కు చెదరని మీ విశ్వాసమే

శ్రీరామ రక్షగా మును ముందుకు నడిపించాలని కొరుకుంటు...

వికృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాను...



సంధ్యరంగులను హత్తుకొని... పొగ మంచు తెరలను చీల్చుతూ...

కొమ్మ సంధుల్లొ నుండి స్వర్ణ కాంతులతొ రవితేజుడు

పచ్చదన్నాని పట్టుచీరగా కట్టిన ప్రకృతి కాంతను పలకరిస్తున్నాడు...

నవ వసంతానికి స్వాగతం పలుకుతూ...

లేత పచ్చ మామిడి పిందెలను పుడమి ఒడిలొ చిలకరిస్తుంది...

చైతన్య స్రవంతి పాడే వేళ....

విరగబూసిన వేప పూత వెండి తలుకులు...

ప్రకృతికి అలంకార శోభితమై...

వికృత నామ సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాయి ....

తెలుగు సంస్కృతిలో భాగమై....జీవితపు సారాన్ని పంచే వేదికై....

నిత్య పరిమళాల వేడుకై...గత జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ...

ఆరున్నర రుచుల కలగలుపు లాంటిదే జీవితానుభవమంటూ...

ప్రభవిస్తోంది... క్రొంగొత్త వెలుగుల ఉగాది...!

ముగ్గులేసిన ముంగిట్లో....మామిడి తోరణాల వాకిట్లో...

ఉగాది అడుగిడు తరుణం...స్నేహం...ప్రేమ... పదింతలవ్వాలి...

విజయాలు మన సొంతమవ్వాలి....తేనె తేటల మన తెలుగు...

నిత్య పరిమళాలు... వెదజల్లుతూనే వుండాలి!!


నన్ను కన్నవారికి దగ్గరగా లేని...


'నా' అనుకున్నవాళ్ళు తొడు లేని...


సుదూర తీరాల అంతరాలను కొలవలేని...


ఈ బ్రతుకెందుకు...?


అమ్మ ఒళ్ళో సేద తీరలేని...ఈ జన్మేందుకు...?


ఉరుకులతొ పరుగులు తీస్తూ....


తపనతొ నిండిన... ఈ అవిశ్రాంత జీవితానికి అంతెక్కడ....?


తీరని ధన తృష్ణతొ... నీరాశ మూటను వీపున వేసుకున్న...


ఎందరో నా లాంటి...బ్రతుకు జీవులు...దూర తీరాలకు పయనిస్తూ...


నిలువ నీడను హారిస్తున్న... ఆశల భవనాలను చూస్తూ....


క్షణమైన సంభాషించలేని దుఖా:లను... మధిలొ దాచుకుంటూ...


చేజారిన గతాన్ని తలచుకుంటూ...


భవిష్యత్ అంటే భయపడుతూ....


వర్తమానంలొ నత్త నడక నడుస్తున్నారు...


తీరాన్ని చేరాలన్న కెరటంలా...


గమ్యాన్ని చేరాలన్న ఆశతొ...


మట్టిగడ్డపై శిరస్త్రాణముంచి... ఓటమిని ఒప్పుకుంటూ...


మదిని కలచివేసే భావలు ఇకపై ఉండవని నిశ్చయించుకొంటూ...


కనుసైగతొ కవ్విస్తున్న కాలాన్ని కౌగిలించుకుంటున్నారు...


మరణ శాసనంతొ ఆహ్వానిస్తున్న విధి ఆకర్షణకు... ప్రాణార్పణ చేస్తూ...


నిశ్శబ్ధపు స్వర్గ ద్వారం వైపు పయనిస్తున్నారు... మరొ జీసస్ లా...



తినడానికి మూడు రొట్టెలున్నప్పుడు...

తినల్సిన వారు నలుగురైనప్పుడు...

నాకు ఆకలి లేదు అనే మొదటి వ్యక్తీ... స్త్రీ....

ఇప్పటికి ఆఖరి విస్తరి... ఆమెకే..! చివరి పంక్తి ఆమెదే...!

అయోద్య రాముడి కొసం... అమృత ఫలాలను సేకరిస్తూ...

కొనపంటి రుచిని తప్ప... కడుపారగ తిని ఎరుగదు...పాపం పిచ్చి శబరి...!

ఏక చక్రపురంలొ ఐదిళ్లూ అడుక్కొంటూ ....

తన పంచ ప్రాణాలైన పాండవులను పొషించింది... ఆ ముసలి కుంతి...!

కొవ్వొత్తిలా కరిగిపొయేది ఆమె....!

ప్రమిదలా వెలుగు పంచేది ఆమె...!

తన సంకల్పం వజ్రసమానం...

ప్రేమ... త్యాగం... బాధ్యత... పేరేదైన పెట్టండి...

అగ్నిశిఖలను అదిమి పట్టినా... ఆ జ్వాలలు ఆకాశంవైపే చూస్తాయి...

ఎత్తైన శిఖరాలను అధిరొహించే కొద్దీ...ప్రపంచం మరింత విశాలం కనిపిస్తుంది...

విజయాల రహదారిలొ సాగిపొతున్నా...

నిడంబరమైన తన మహొన్నత ప్రస్థానం సాగిపొతునే ఉంటుంది...

ఆటంకాలను దాటుతూ పయనించే అభివృద్ది వీచికలు...

అమానుషాలను ఎండగడుతూ...చీకట్లును ప్రక్షాళన గావిస్తూ..

సమున్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ...

సాధికార పధంలొ సాగిపొతున్న వనితలకు... "మహిళా దినొత్సవ శుభాకాంక్షలు..."



జీవితం అనుభవాల మూట...

భావలు అవ్యక్తవ్యక్తంగా...నీ ముందు గెంతులేస్తునప్పుడు...

సమాధి చేయబడ్డ కొరికలు...నీ ముందు సాక్షత్కరిస్తున్నప్పుడు...

దేన్నీ సాధించలేననే అసంతృప్తి...నీ ముందు నాట్యం చేస్తున్నప్పుడు...

నీలొ ఉత్సహన్ని నింపే ఆయుధం...అమ్మ...

నీతికి నిదర్శనం...త్యాగానికి ఆకారం...

సత్యానికి ఆదర్శం...ప్రగతికి సొపానం...

స్నేహనికి ప్రతిబింబం...విజయానికి ఓంకారం...అమ్మ...

తొలి పలుకులకు గర్వపడుతూ...తప్పటడుగులకు మురిసిపొతూ...

తప్పుటడుగులను సరిచేస్తూ...

నీ నవీన జీవన గమనానికి బాటలు వేసే మార్గదర్శి...అమ్మ...

గుండెలొని రాగాన్ని...మమతానుబంధాలతొ అల్లీ...

నిదురరాని ఘడియలలొ... అనురాగంతొ నిండిన జొల పాట పాడుతూ...

నిశేదిని పాలించు నిద్రసీమను ... నీ కంటి దరికి ఆహ్వనిస్తుంది...

కలతలన్ని మరచి....కలల దొంతరల్లొ తేలిపొమ్మంటుంది...

దూరమున్న ఆ పేగు బంధం... ఓ పలకరింపు కొసం తపిస్తూ...

ఓ చిన్న మాటకై ఎదురు చూస్తుంది...

అనుక్షణం నీ వెంటే ఉన్నానంటూ...మదికి ధైర్యాన్నిస్తుంది...

నిరాయుధ సిపాయిలా కష్టాలను శాసిస్తూ...

జీవన పొరాటంలొ నిగ్గు తేలిన బలశాలి... అనుభవ శాలి... అమ్మ...





కళ్ళు తెరిస్తే...

రాలే ఆకులు... ఎండిన చెట్లు...

ఒలికే కన్నీటి బొట్లు...

అంతే లేని ఆకాశం... నేనున్నాననే నిశ్శబ్దం...

అలసట లేని అగాథాలు... ఆలోచనల సుడిగుండాలు...

కలచ వేసే కష్టాలు....సమస్య వలయ చక్రాలు...

సమసిపోవు... మాసిపోవు...

మరపురావు... మదిని వీడవు...

కళ్ళు మూస్తే...

ఊపిరి నిప్పుల శగలన్నీ...

ఉప్పెనలా ప్రవహిస్తున్నాయి...

గుండెల్లో రగిలే బడబాగ్నులన్నీ...

ద్రవించే లావా ప్రవాహాలవుతున్నాయి...

మదిని కలచి వేస్తున్నాయి... మౌన్నాని మధిస్తున్నాయి...

ప్రశాంతతని హరిస్తున్నాయి...

రూపం లేని శత్రువుల్లా మారి... నిదురకు దూరం చేస్తున్నాయి...

చీకటితొ నిండిన నా హృదయంలొ...

దీపాన్ని వెలుగునిస్తావనుకున్నాను... కాని...

జ్వాలావేశపు చూపులతొ...

నా ఊహల ప్రపంచాన్ని కాల్చి బూడిదచేస్తూ...

జీవం లేక జారే కన్నీరులా మిగులుస్తావనుకొలేదు...!

కలల విశ్వాంతరాళంలొ...

నీతొ మొదటి అడుగుకై ఆలొచిస్తూ...

సంవత్సరాలు గడిపేస్తూ వ్యచ్చించిన కాలం...

అవిశ్రాంత సంగ్రామాలుగా మారి....నా గమ్యాన్ని చేరిపేసింది...

అంధకారంలొ నా భవిష్యత్ మిగిలిపొయింది...

ప్రపంచానికి మరొ రొజు గడిచిపొయింది...

;;