సుందర స్వప్నాల స్వర్గాల మేడ మెట్ల నుండి


వాస్తవికతా శిధిల.. రుధిర కూపానికి దిగుతున్నాను...


బ్రతుకు చక్రాల సీల ఊడిపొతే...అస్పష్టపు భవిష్యత్తు...


దీపపు వత్తి చివర నున్న నిప్పు నలుసులా మాడిపొతుంది...


నిలువ నీడలేని మీ బ్రతుకులు చూసి...


గాలి లేని ప్రకృతి... యోగిలా ములుగుతుంది...


నా మనస్సెప్పుడొ మొద్దుబారిపొయింది...


మూగ సైగలతొ ఈ రాత్రి సంది చేసుకున్నట్లుంది ...


లేకపొతే నిరాశతొ ఎందుకు మాట్లాడుతుంది...?


వర్తమానంలొ ఒక పొర వెగటుగా నన్నావరించుకునట్లుంది...


గత చరిత్ర నక్షత్రాలై... కన్నీళ్ళు కారుస్తూ...


కాలం పాడునుయ్యిలా... ఎందుకు కన్పిస్తుంది...


ఒకనాడు మల్లేచెండ్లుతొ మెల్కొల్పిన ఈ తొలి వేసవి జాగృతి...


నేడు నిశ్శబ్దం అంటుకున్న రాకాసి మంటలతొ...


జుట్టు విరబొసుకొని నగ్నంగా...మీ పంట పొలాలలొ సంచరిస్తుంది...


అనంతపు విశ్వపు గదిలొ ఆడుకుంటున్న ఆకలిని రెచ్చగొడుతుంది...


ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి...?


ఈ ఆర్భాటపు హంగులతొ ...


పులి చంపిన... లేడి నెత్తురును పులుముకొలేను...


బొర్ల పడిన అదృష్టాన్ని భుజాన వేసుకొలేను...


సగం చచ్చిన మీ ప్రాణాల్ని జొకొట్టుతూ...


సగం కన్న నా కలల్ని నేమరేసుకుంటున్నాను....




మనిషిలొ దేవుడు కొలువున్నాడు అన్నప్పుడు...


మనిషి మృగం గా మారడ మెందుకు...?


నడవడి సరిగా లేని వాడికి...


పూజలు... నొముల ఫలితమెందుకు...?


హితమే మనిషికి అభిమతమైతే...


మతాల కొసం కొట్లాటెందుకు?


మనువాడే సమయంలొ మల్లె తీగ....


పెళ్లయిన కొత్తలొ అందాల తారక ....


అంటూఅందాన్ని ఆస్వాదించే మనస్సు నీకున్నప్పుడు...


వర్ణాలతొ నిండిన దేహనీకి వంకలెందుకు...?


ఇల్లాలు మనస్సుని అర్ధం చేసుకొలేని నీ బ్రతుకెందుకు...?


బాహ్య రూపం కన్న.... అంతరంగ బంధం... గొప్పదని ...


తెలుసుకొ మిత్రమా... నిత్య సత్యాలివి...


ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగిపొక ముందే...


మొండి చేతుల్లొ మానవత్వం తెల్లబొక ముందే...


మార్చుకొ నేస్తం... నీ బ్రతుకు మార్గాన్నీ...


నీకొసం నేనున్నాను....


కన్నీటిని విడిచి రా...చీకటి తెరలను చీల్చుకురా...


ప్రభాత విపంచిక పలికించడానికి...


అడుగంటుతున్న మన కీర్తిని...దిగంతాలకు చాటడానికి...!



నా ఆశల తీరం నువ్వు ఇంకా దాటలేనట్లుంది కాబొలు...


గుండె గుబులుతొ... మేఘంలా గర్జిస్తుంటే...


మది మసకబారుతూ... ముసురు కమ్ముకుంటూ....


రెప్పల చూరు నుంచి కళ్ళూ అదే పనిగా వర్షిస్తున్నాయి...


బాధ చిన్నదైన ...జ్ఞాపకాల దొంతర్లన్నీట్ని


వెతకాల్సి వస్తుంది నేస్తం... దాని మూలలా కొసం...


నా ఆత్మ సంచరించగల విశ్వాంతరాల పరిధిలొ...


ప్రబంధ బంధానివి నువ్వైతే నాపై దయ వర్షించు...


ఆనందపు నిర్లిప్తతొ నిండిన నా మనసు పైచందొ చర్చిత పద్యనివైతే...


ఆనందాశ్రుమిళితానుభూతిని నాపై కురిపించు...


మూగ సైగలతొ నీ నవ్వుల హరాన్ని నా అంతరాత్మకి


బహుకరించిన మధుర లలిత లావణ్యానివైతే...


ఉల్లాస శొకతప్త గేయమై నా రెప్పల మాటున దాగినకన్నీటిని హరించు....


ఎందుకంటే...


నా భావం... నా భాష్యం...


నా హస్యం... నా లాస్యం..


అన్నీ నీవే కనుక...


ఇది ముమ్మాటికి నిజం నేస్తం...!



జీవితంతొ ప్రతి రొజు ఘర్షణ పడుతునే ఉంటాను...


మనస్సున్న మనిషిగా బ్రతకనివ్వమని...!


దేవుడికి ప్రతి నిమిషం ప్రార్ధిస్తునే ఉంటాను...


మానవత్వం ఉన్న వ్యక్తిగా ఎదగనివ్వమని...!


విధితొ అనుక్షణం విలపిస్తునే ఉంటాను...


గొంతులొ నీళ్ళు ఇంకిపొయినా...


కంటిలొ నీళ్ళు మిగిలే ఉన్నాయని...


అవే నా ఆశల సముద్రాన్ని బ్రతికిస్తాయని...!


కక్ష కడుతున్న కాలాన్ని ప్రశ్నిస్తునే ఉంటాను....


అప్యాయత ... అనురాగాల మధ్య...


హంగులు... ఆర్భాటాలు ... ఎందుకు సృష్టిస్తున్నావని..?


నిరంతరం కుసుమాలును ఓదార్చుతునే ఉంటాను....


విసిరిన పూలు వాడిపొతే ఏంటీ ...


గుభాళిస్తున్న పరిమళాలుగా గుర్తుండిపొతారని...!


వేదనని వేడుకుంటునే ఉంటాను....


మౌన నిశ్వాసాల్ని వీడి...నవ విశ్వాసాల్ని మాలొ పెంపొందించమని....!


నీ గురించి ఆలొచిస్తుంటాను...


నాలొ నువ్వు సగం ... నేను సగం అన్నావు...


నాలొ నువ్వు లేని మిగత సగం ... నాకు మాత్రం ఎందుకని..!


ఇప్పటికి ముగింపంటే...


రేపటి ఆరంభం అనే స్పృహ ...


కొత్తగా ఉదయించిన నాడు...


పాత సూర్యుడు కొత్తగాను...


పాత భూమి అందంగాను...


పాత అమ్మ వింతగాను...


కనిపించడం మొదలవుతుంది....


ఉదయమవుతుంది... సూర్యుడు రాడని...


నిద్రొస్తుంది... స్వప్నం రాదని...


నిదురలేని నిట్టూర్పు రాత్రులే వేదననే...ఆలొచనలే...


అణగారిన గుండెల్లొ ఘెషగా వినిపిస్తుంది...


కళ్ళుతెరిచి చూసే లొగా...


పాతికేళ్ళు పరిగెత్తాయంటూ...


దారి ఎటొ వెతికే లొగా...


అర్ధ ఆయువు కరిగిందంటూ...చింతించకుండా...


గమ్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ...


తప్పుటడుగులను సరిచేసుకుంటూ...


ఉల్లాసపు హద్దుల అంచులను తాకిన వాడు...


ఎదుట మృత్యువు నిలబడిన సరే...


నవ్వుతూ కరచలనం చేసి...కలిసి నడిచి పొగలడు...


పరిమితులను ఛేదించడమంటే...


మనిషి విజయుడై వెళ్ళిపొతూ...


తన ఖాళీని వేరొకరి కొసం మిగల్చడమే... నేస్తం...జీవితం...



పగలుకీ..రాత్రికీ...మధ్య సరసాల అంచుదగ్గర...


విరహల...కొరికతొ.. మోకాళ్ల పైకి మడతపడిన లంగా


నిద్రలొనే సవరించుకుంటూ...కలలొ...కుర్రవాడి కౌగిలికి


సంశయిస్తూ...సమ్మతిస్తున్న...పడుచు పిల్లలా ఉందేంటీ ప్రకృతి...!


మంచు తెరలలొ తడిసిన చీకట్ల నడుమ...


అందానికి...యౌవనానికి...అవధిగా ఉంటూ...


అనుభూతి ...అస్ధిత్వం... సౌందర్యం...అధికం చేస్తూ...


చంద్రవంక విరిగి... పుడమి కట్టుకున్న తెల్ల చీర పై...


పుప్పుడులు రాలుస్తున్నట్లుందేటి ఈ రాకాసి వెన్నెల...!


తులసి కొట చుట్టు ఆనందపు దీపాలు వెలిగిస్తూ...


ప్రార్ధనాంతరం ప్రశాంత ప్రవిత్రతొ నున్న రాత్రిని...


రంపం పెట్టి కొసినప్పుడు రాలిన పొట్టులాగుందేంటి...ఈ వేకువ...!


చంధస్సు చీర కట్టి...భావం నిండిన రవిక తొడిగి ...


అలంకారపు కుచ్చిలతొ ముస్తాబవుతూ...


నిఖరమైన నెత్తుటితొ నిండిన సింధూరాన్ని కలంలొ నింపి ...


పలుచటి నా గుండె కాగితాల పై...


వొంపు సొంపులతొ జారవిడుస్తున్న అక్షర సుమాలన్నీ...


కవిత కన్యల్లా మారాయేమిటి...!


ఈ దిగ్ర్భాందపు ఆలొచనల హొరు ఏమిటి ...?


అణుక్షణం అతిశయం అన్పించే...


ఈ వర్తమానపు ఊహలేమిటి...?


నిలువనివ్వవూ...నిష్ర్కమించవు...!




లొకం గాఢ నిద్రలొ...


చీకటి దీనంగా పలవరించె సమయాన...


ఉషాగమనాన్నిగుర్తించి...


స్వాగతమిచ్చే వైతాళికుడు... శ్రీ శ్రీ...


నవ ప్రపంచ నిర్మాణ కర్తల ఉత్సాహంతొ...


మానవ జాతిని ఉద్ధరించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన


చిరునవ్వుల ప్రవక్త...శ్రీ శ్రీ..


కళాచతురులమల్లే...


అందాన్ని దూరం నుండి చూసి సంతొషిస్తూ...


సహజ సౌందర్యం తక్కువైనప్పుడు...విచారిస్తూ...


మౌనాన్నీ...కార్యాన్నీ..విజయాన్నీ..


కఠిన పదాల బురఖాలొ...దాస్తూ...


మాటల్ని కత్తులుగా మారుస్తూ...


పదాలను తుటాలుగా వాడుతూ...


హృదయోద్రేకంతొ ఉంప్పొంగించే తెలుగు భగీరధుడు...శ్రీ శ్రీ...


అతనివి అక్షరాలు కావు...ఉద్రేకాలు...


బాధలు కావు...యుద్ధాలు...


కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహాలాన్ని జొడించి...


అదృష్టాధ్వం సమకూరిన అగాధ బాధా పాధ: పతంగాల


ఆక్రందనల్ని అలకించిన వాడు...


కవితా పారయణం చేసిన నిత్య యౌవ్వనుడు...శ్రీ శ్రీ...


కలాన్ని ఉలిగా చేస్తూ...


హృదయాల మీద మగత పెంకులు పగలగొడుతూ...


జడత్వ...మూఢత్వాలను చేధిస్తూ...


జన జీవితాలపై వెలుగు తెరలను నింపిన అగస్త్యుడు...శ్రీ శ్రీ...


మా గురువు గారైనా శ్రీ శ్రీ గారికి అంకితం చేస్తూ మీ రేవా...



ఏదొ భారం దిగిపోతుందనీ...


మనసు తేలికపడుతుందనీ అనుకుంటూ...


అర్ధం చేసుకుని... మనల్నీ అనునయిస్తారని...


ఆశ పడతాం...పొరబడతాం...


మన బాధ మనకు ఎప్పుడూ...


ఓ సంచలన వార్తగానే మిగిలిపొతుంది...!


ఒకరి వేదన మరొకరి పై...


ఆకాశంలా విరిగి పడదు...


నక్షత్రాలు బూడిద రాశులుగా రాలి పడవు...


అందుకనే ఏమో...


ఒక ప్రక్క దిగులు మేఘాలు...


గుండె దిగుడు గుంట లొనే కురుకుపొతుంటే...


మరొ ప్రక్క కలతలు...


కష్టాలు... కన్నీళ్ళు...అవమానాలు...అనుమానాలు...


మనసు బావిలొనే ఇంకిపొతున్నాయి... అయినా...


మనసును మించిన ఇంకుడు గుంత మరొకటేముంది.... నేస్తం...!


మన ఐదు ఖండాల సంస్కృతి...


కాదొక స్ధిరబిందువని గ్రహించలేరు పాపం వీళ్ళు...


ఆలొచించలేని మంచివారు మనవాళ్ళు....!


నెత్తురు వరదల్ని చూసిన మనకీ


ప్రక్క వాడి కన్నీటి వాన ఓ లెక్కా...చెప్పు!



ఉదయపు నీ రెండలొ నిలిచిన శిరొజ


సౌఖ్యాన్నిదువ్వెనతొ మంచుబాలను చూసి...


ఉష: కుమారివి నీవని తలస్తున్నాను...


ఎందుకంటే అది అందమైన నిజం...


తడబడుతూ నడుస్తూన్న అంధుడిని చూసి...


చీకటి నీ తల్లి అని చెప్పకని వారిస్తున్నాను...


ఎందుకంటే అది కటువైన నిజం...


కట్టు తప్పిన నగరంలొ...


పట్టు తప్పిన సంఘంలొ...


ఆకలాహుతి కొసం...అడుకుంటున్న...


చిదిమితే పాలుగారే చిన్నారి బుగ్గలు...


మోహన యౌవ్వన వనసుమాలు...


తరుణవయస్కులు...


ముక్కుతూ... మూల్గుతూ... ఉండే ముసలాళ్ళును...


చూసి...అరుగు మీద మేల్కొన్న ముష్టివాడిలా ఆక్రొశిస్తున్నాను....


ఎందుకంటే... ఇది దయనీయన మైన నిజం...!


మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని...


ముసురుకున్న బాధల వానకారులొ...


మసి బారిన చూపుతొ... ససి చెడిన రూపుతొ...


ముగ్గు బుట్టలాంటి తలపై...కొండంత బరువును చూసి...


మూల్గుతున్న ముసలి తల్లి... నా భరత ధాత్రని విలపిస్తున్నాను...


ఎందుకంటే...ఇది హృదయద్గతమైన నిజం...




వస్తావో..రావో..తెలియని సంధి ఆలొచనల నడుమ...


నువ్వు రావాలనే సరికొత్త ఆశల తీరాల మధ్య...


నన్ను మబ్బులా కమ్మేసే...


మధురమైన నీ ఊహలలొ పరవశిస్తూ...


నీ కొసం...నీ జ్ఞాపకాల అసరాతొ సాగుతున్నాను...!


అందం తాకని అంబరానికి వర్ణాలేన్నొ అద్దావు...


ఈ సంధ్య ఇలాగే ఉండిపొనీ నేస్తమా...!


చలనం లేని గుండెలొ కాంక్షాకిలల్ని వెలిగించావు...


ఈ కాంతి లతాంతాల్ని అలాగే నిలిచిపొనీ మిత్రమా...!


శిధిలమైన సంబంధాన్ని ధ్వంసం చేయకుండా...


నూతన సంబంధాల్ని ఎలా పేనగలం...?


గాయపడకుండా...దగ్ధమవకుండా...


అగాధ లొతుల్లొ మునిగి తేలకుండా...


ఎలా ప్రేమించగలం..?


నీవు రాని నిశీధులు...


నా నిదురకు నీషేదాలని ఎప్పుడు తెలుసుకుంటావు...


నిర్లిప్తంగా వెళ్ళిపొయే నిన్ను చూసినప్పుడు...


నీ జ్ఞాపకాలు...నా ఆశల తీరం వదలి...


అంతరంగపు సముద్రంలొకి జారిపొతున్న చప్పుడు...


ఇప్పటికి ఇంకా విన్పిస్తూనే ఉంది నేస్తం...!


వందల వేల శిశిరాల్ని దాటకుండా


ఒక వసంతం కొసం కలలు కనడం అవివేకం అని తెలుసుకున్నాను...


నా మనసులొ మాట...


నీకు చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి విఫలమౌవుతున్నాను...


నీకు దూరంగా ఉండాలని ప్రయత్నించిన అనుక్షణం ఓడిపొతున్నాను...



గుక్క తిరగని ఏడ్పులతొ...


కారిపొతున్న కన్నీరు మీద...


తడబడే పాదాలతొ...నత్త నడకలు నడుస్తూ...


ఎడతెగని దిగులును అలింగనం చేసుకుంటూ...


ఎంత కాలం ...ఇలా నేను ?


అనురాగం... ఆత్మీయత కలబొసిన మమతతొ...


మానవతలను మేళవించిన ఈ వనితని...


ఆ దేవుడు ఇచ్చిన కానుక అనుకున్నాను ...


కానినువ్వు మాత్రం...


కన్నీరే ఎండిన కనులే నాకుంటే...


కనులే దాటని నీ కలలను చూడమంటున్నావు...


వేకువే ఎరుగని రేయి ఒకటుంటే....


వేదనే తరగని నీ ఆవేదనని కనమంటున్నావు...ఇది న్యాయమా...!


వరమే పొందని నా తపముతొ...


నా ఆశలు ఆరిన మనసులొ...


గాయాలు మానిన మనిషిగా మారుతూ...


కనీకారం లేని ఈ కలతలను చేధిస్తున్నాను...


మజిలీ... మజిలీకి అలసిపొతూ...


రేపటి ప్రధమ సూర్యోదయాశ్లేషం కొసం... అన్వేషిస్తూ....


ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకుంటున్నాను....


ఇవ్వన్నీ నీకొసం కాదా నేస్తం...!




నీ అందం...



ఏ గులాబి కి కొత్త రంగు తెస్తుందొ...



ఏ నక్షిత్రానికి కొత్త మెరుపు వస్తుందొ...



ఏ మబ్బుకి కొత్త నునుపు నిస్తుందొ... తెలియదు కాని...



నీ ముఖ సౌందర్యాన్ని కొరి...



చంద్రుడు మేఘముల మాటున సొమరిలా దాగుకొన్నాడు...



నీ తనువును స్పృశిస్తూ...నీ ముద్దు పెదవులు తాకుతూ...



జాలువారుతున్నఆ పరిమళాన్ని చూసి...



ఏదొ కొత్త పుష్పమను భ్రాంతితొ అనిలుడట్టే నీ చుట్టు తిరుగుచున్నాడు...



నీ సిగ్గులలొ ఎర్రబడిన వెన్నెలను చూసి...



సూర్యొదయ మయిందేమోనని పుడమి పులకరిస్తుంది...



నీవీ ప్రపంచము నిట్టు క్షొభ పెట్టుట న్యాయమా చెప్పు...!



నీవు వస్తావొ... రావొ...తెలియని...ఆలొచనల నడుమ..



ముఖంలొ నిండిన అరుణ కాంతిని ...



సాయంత్రం తన పశ్చిమదిశలొ జారవిడుస్తూ...



నలుపు రంగుతొ నా ముఖాన్ని కప్పుతుంది...



నాలొ కాంక్ష వెయ్యి కాగాడాలుగా వెలిగిస్తుంది...



నీవు లేక నిష్ఫలమైన నా జీవితంలొ....



విచారగ్రస్తమైన నా మదిగృహాంలొ నిండిన నీలిమని...



నీ నేత్ర కాంతులతొ చీల్చుతావనే ఆశతొ....



ఆనంద ముద్రిత నేత్రాలతొ...ఎదురుచుస్తున్నాను నేస్తం...!



సన్నని ఆకులు కట్టే.. ఆకుపచ్చ అద్దాల మెడలొంచి...

ఆకాశపు నీలపు నిగ్గుల కప్పులమీద... తెల్ల మేఘాలలొ తేలిపొతూ...

నీతి వర్తనుల లొంచి దూరంగా వెళ్ళిపొతున్నాను...

నా హృదయారాటాన్ని చల్లార్చాలని...

కదిలే నీళ్ళలొ వెన్నెలా ప్రతిఫలిస్తున్న నీ మోమును చూస్తూ...

తదియ చంద్రుడు కనబడకుండనే కాంతి నెగజిమ్ముతున్నాడు...

గట్టుమీద నుండి సరస్సులొ దూకటానికి...

సంశయించే దానివలె కాలం నన్ను చూస్తూ...

తను చేసిన గాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది...

దాహం కొన్న ఎండే వెన్నెలైనట్లుగా...

మోహం నిండిన యౌవ్వనమే చందనమైనట్లుగా...

ప్రతి నిమిషం చంపుతున్న నీ జ్ఞాపకాలతొ యుద్దం చేయ్యలేక...

అణుక్షణం నన్ను బాధించే అంతర శత్రువుతొ పొరాడలేక...

నా చూపులు...స్త్రీ జాతికి సహజ ఆయుధమైన కన్నీళ్ళను ధరించాయి...

ఈ పునర్జన్మ ఉత్సావాన్ని ఎలా ప్రచురించను...?

ఆ గత జన్మ తప్పిదాన్నీ ఎలా గుర్తించను...?

అడవిలొ మోహమాధుర్యంతొ వికశించిన మల్లెపువ్వునొ...

చలిరాత్రిలొ మౌనంతొ నిండిన వెన్నెల రేఖనొ...

తెలియక...ఒంటరిగా... లొకానంతటికి చక్రవర్తి వలే కూర్చున్నాను...

నీ పాదాల్ని నా ప్రాణాలతొ కడగాలని...!

;;