నాకు తెలీయనిదేదొ ఉందనుకునే బాల్యంలొ...


చిన్నప్పటి జ్ఞాపకంలా నా తలపుల్లొకి నువ్వొస్తున్నావు ఎందుకు...?

నయనంలొ అశృవే స్వప్నంగా మారుతున్న ఈ మునిమాపు వేళలొ...

మహిత రత్నరాశులగా మెరుస్తూ... నా గుండె వెనుక దాగుతున్నావెందుకు...?

నా నుండి కదిలిపొయే నీ ఆలొచనలు నన్ను ప్రశ్నిస్తూ...

జాలిగా చీకటిని ఆశ్రయిస్తున్నాయి...

నిద్రలొ నీ సొగసైన కలలు నన్నునిలదీస్తూ...

వెలుగులొ మౌనంగా మాయమవుతున్నాయి...

నిన్ను నువ్వే బంధించుకొని...నమ్మకాల సూత్రలలొంచి తప్పించుకొలేక...

కన్నీటి రూపంలొ...నా కళ్ళ నుండి జ్ఞాపకాలుగా జారిపొతున్నావు...

నా అంతరాంతర నిశేదిలొ ఏకాకిని చేస్తూ...

మది వాకిటన విడిచి మౌనంగా మరలిపొతున్నావు...

మంచి గంధాలను రాసుకుంటూ...మల్లెపూల మీద పడుకునే నీకేం తెలుసు...

నాలొ అణుచుకున్న రొదన రాత్రుల గురించి...!

ప్రలొభాలకు లొంగిపొతూ...మోహపు మాధుర్యంలొ తేలుతున్న నీకేం తెలుసు...

ఎన్ని విలువలు...ఎన్ని వెలుగులును కొల్పొయానో..!

మరక పడిన నమ్మకాన్ని చేరుపుకుంటూ...

మోజుపడిన ఆత్మను మోసుకుంటూ...

సుమనస్సుందర వసంతలొ ఉగాది కొసం అన్వేషిస్తున్నాను...




ఒకప్పుడు తన అమాయకమైన కళ్ళల్లొ...


ఆనందపు స్వప్నాలతొ కలకలలాడేవి...



బ్రతుకు పరుగులు తీసే ప్రవాహంలా సాగేది..


నేడు ఒంటరిగా ఎవరికొసమో ఎదురు చూస్తుంది...



నిట్టూర్పుల వేడితొ సెగలు రేపుతూ..


తన ఒంటరి వయస్సుకి చలి కాచుకుంటుంది...



దిగులుగా.. దీనంగా... పొగొట్టుకున్న దాన్నీ..


పొందాలనే ఆశతొ..



శూన్యం వంకా.. సుదీర్ఘ తీరం వంకా చూస్తున్నట్లుంది...


అందమైన ఆ కళ్ళు వెనుక ఉన్నఆగాధలలొ..



అంతులేని నీరీక్షణ...ఏదొ తెలియని ఆవేదన...


గుండెల్లొ గతాన్నీ... గడిపిన జ్ఞాపకాలనీ నింపుకొని...



గుప్పెట్లొ తనకే తెలిసిన రహస్యాలను దాచుకొని...


ఎవరి కొసమో చైతన్యపు అంచుమీద ఎదురుచూస్తుంది...



వ్యధా చిహ్నితమైన తన నేత్రాల క్రింద ఇంకా నలుపు చారలు చెరగలేదు...


చిన్నప్పటి ఆదర్శాలు ... అహంకారాలు ఇంకా నశించలేదు...



గుండెకు గుచ్చుకున్న తన జ్ఞాపకాల మువ్వలతొ...


తన జీవితం మీద తానే నిద్రపొయింది...



అందుకే నమ్మకు నేస్తం... నవ్వలేనివాడిని.. పువ్వులు చిదిమేవాడిని...!



కనురెప్పలు కాపలా కాస్తున్నా...

నీ కలలును ఆపలేకపొయింది...

నీ భావాలు ముట్టడిస్తున్నాయని తెలిసి...

నగ్నంగా ఉన్న నేత్రాలనూ...

ప్రతి రొజు కన్నీటి పొరలతొ కప్పుతుంది...

నేను ఊహించిన హృదంతర దృగంతర దివ్యత్వం..

నీ పిరికితనపు వాగురలొ చిక్కి...

నీ జడత్వపు నీలాలిలొ నవసి... నశిస్తుంది...

ధైర్యంగా నిలబడే దృక్పధం నీకు లేనప్పుడు...

వలచి ప్రయోజనం ఎందుకు...?


ఆదర్శాలతొ నిండిన ఆశయాలు నీకున్నప్పుడు...

నిట్టూర్పులతొ వేదనను మిగల్చడం ఎందుకు...?

కప్పుకున్న నిన్నటి కలల్నే తలుచుకుంటూ...

ముగింపులేని కధగా మిగిలిపొతున్నాను...

మరుగున పడిన నిన్నటి మాటలను చీల్చుకుంటూ...

అంతం లేని వ్యధతొ మరలిపొతున్నాను...

లొలొపల నవ్వుకుంటున్న నీ గర్వంతొ సమరాంగాన్నీ కొరుకుంటున్నావు...

నా మనొంగణంలొ నీవు వెలిగించిన తొలిదీపాన్నీ... నీవే ఆర్పేస్తున్నావు...!

మనొవ్యధని చేకూర్చే ఆలొచనలు...మనొగత భావాలలొ నలుగుతున్న నీ జ్ఞాపకాలు...

అనంతమైన నా ప్రేమకు ప్రతీకలని...ఎప్పుడు తెలుసుకుంటావు...!

నీ మౌనం అనే శాపం ఇచ్చే కన్న...మరణమనే శిక్షను విధించు నేస్తం...





ముసలిదైపొయింది...నా భరత ధాత్రి...



మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని...



ముసురుకున్న బాధల వానకారులొ



మసలుకొనే దెలా చివరికంటూ...



మసి బారిన చూపుతొ... ససి చెడిన రూపుతొ...



సాగర భ్రాత కెరటాల గుండె హొరులలొ



మోయలేని తన వయస్సుని తలచుకొని...



వేల యేళ్ళ బరువును దించమని...



తన సొదరుడైన సముద్ర సన్నిధిన



కన్నీరు పెట్టుకొని ఏడుస్తుంది...నా పిచ్చి ధాత్రి...



పచ్చని తన పడుచుదనం మీద వెచ్చగా పడిన



ప్రధమ సూర్యొదయాశ్లేషానికి పులకరిస్తూ...



నీలాల మోహన వస్త్రం దొలిచి...



మౌళి మీద హిమసుందర కిరీటం ధరించిన



ఆనాటి మహరాణి నా భరతదాత్రి...



నేడు ఈ పాడు నాగరికతలొ పాలిపొతూ...కాలుష్యానికి కరిగిపొతూ...



పాపత్ములకు పురుడు పొస్తూ...రుధిరంలొ తడిసిపొయింది...



ముడుచుకుని పొయిన తన వొడలి ముడతలను చూస్తూ...



భావ శూన్యురాలై మూగబొయింది...



నేను చూసాను...

నిజంగా ఆకలితొ అల్లాడి

మర్రిచెట్టు కింద మరణించిన ముసలివాణ్ణీ...

నేను చూసాను...

నిజంగా తల్లి లేక... తండ్రి లేక ఏడుస్తూ...

ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ...

మురికికల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలుణ్ణీ...

నేను చుసాను...

నిజంగా నిరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు

ప్రసవించి మూర్చిలిన దృశ్యాన్నీ....!

నేను చూసాను...

నిజంగా పిల్లకు గంజికాసిపొసి... తాను నిరాహారుడై...

రుద్ధబాష్పాకులిత నయనుడైన వృద్ధుడను...

నేను చూసాను...

నిజంగా... దైన్యాన్ని.. హైన్యాన్ని...

క్షుభితాశ్రు కల్లొలనీరధుల్ని... శవాకారవికారుల్ని....

నేను చూసాను...

క్షయగ్రస్త భార్య ఇక బతకదని...

ప్రచండ వాతూల హత నీపశాఖవలె

గజ గజ వణికిపొయిన ఆరిక్త...అశక్త గుమాస్తాని...

అయిదారుగురు పిల్లల గలవాణ్ణీ....

ఇది ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి...?

ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి?




నన్ను నిర్బంధించకు నేస్తం...


ఈ రాత్రిని ఇక చూడలేను...


కృత్రిమ వేషాన్ని అభినయింపలేను..


మానవత లేని లొకాన్ని స్తుతింపలేను...


మానవునిగా శిరసెత్తుకు తిరగలేను...


ఈ నాగరికతారణ్యవాసం భరించలేను...


ఒక్క నిరుపేద వున్నంతవరకు...


ఒక్క మలినాశ్రు బిందు వొరిగినంత వరకు....


ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు...


ఒక్క శుష్కస్తస్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంత వరకు....


ఒక్క తల్లి నీరవాక్రొశ రవమ్ము విన్నంత వరకు...


ఒక్క క్షత దు:ఖిత హృదయ మూరడిల్లనంత వరకు...


నాకు శాంతి కలగదింక నేస్తం... నేను నిగర్వినైనాను...


ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను...


ఈ గుండె గూడుపట్లు ఎక్కడొ కదలినవి...


ఈ కనులు వరదలై పారినవి...


ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి...


ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు...?


ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు?


ఏ భొగవంతుని విచలింప చేయగలదు?


ఏ భగవంతునికి నివేదించు కొనగలదు...?



నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి..

మరో హృదయం పడే తపన ''ప్రేమ'' అయితే..

అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే ''స్నేహం''..

మునిమాపు వేళ రెండు నక్షత్రాలు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు..

ముని కాళ్ళ మీద నిలిచిన దేవతలు..

మనల్ని అసూయగా చూస్తున్నారేమిటి..నేస్తం..ఆ దిష్టి కళ్ళతొ..!

నవనవాలైన నీ ఆశల వర్ణాలతొ ఉదయించిన భానుడు..

సింధురం కన్న ఎరుపైన నీ హృదయాన్నిచదువుతూ..

ఇతడే నీ స్నేహితుడని ఏడిపిస్తున్నాడేమిటి నేస్తం..ఆ దురుసు నొటితొ..!

ఒకరి నడుం ఒకరు చుట్టుకొని..

మన స్నేహంతొ విరియించుకున్న ప్రతి పువ్వూ అనార్తవంగా మారుతూ..

ఎర్రని పెదవుల పై తెల్లని నవ్వులగా విరుస్తూ..

ఎవ్వరికి దొరకని మన రహస్యాల్ని వశపరుచుకుంటున్నాయి..

హిమస్నాత మాలతీలతలతొ అల్లుకున్న మన బంధాన్ని..

శ్రీ గంధపు సనాతనతొ నిండిన మన స్నేహపు పరిమళాన్ని..

హేమంత సమీరాలకు ఒక అలంకారమనీ..గర్వపడుతున్నాయి..

నీవిచ్చిన ఈ స్నేహ సుమాలకు నేను ఏమి ఇవ్వగలను నేస్తం...

కడకంటితొ కార్చిన కన్నీటి బొట్టును తప్పా....!




ఎప్పుడొ...ఒళ్లొ కూర్చొబెట్టుకున్న గుర్తు...


పాయసం తినిపించిన జ్ఞాపకం...


ఊయలలూపిన అనుభవం...


అంతకు మించి మాతృత్వపు అనుభూతులు


తేలియని ఎందరొ అనాధులు ...


ఆకలేస్తుంటే... గొరుముద్దలు తినిపించకపొతేనేమి...


రైలు పట్టాల పక్క వదిలేసి పొతేనేమి...


అనాధశరణాలయలొ పెరిగితేనేమి...


మమ్మల్నీ కన్నది ఓ అమ్మే కదా...


నీ మనసులొ ఇంతటి క్రూరత్వమా...


లేకుంటే మాకేమిటి ఈ దారుణం...


చిందర వందరగా అక్షరాలును తుడిచేసిన తెల్లకాగితం...


మసకబారిన నలుపు-తెలుపుల ఛాయాచిత్రం...


ఎవరొ కక్షగట్టి చిదిమేసిన లేత జ్ఞాపకం...


వ్యక్తావ్యక్త భావాల నైరూప్య చిత్రం...


అర్ధమైన కానట్టున్న మార్మిక కవిత్వం...


అనాధలకు అమ్మంటే కలలాంటి ఓ నిజం...


ఎందుకంటే...ఉన్నా రాదు కనుక...


మా గుండేలొ మేమిచ్చుకున్న రూపం...


తేజొవతీ..త్రినయనా...లొలాక్షీ... కామరూపిణీ..


మాలినీ...హంసినీ..మాత మలయాచల వాసినీ...!


మీరు పుస్తకాలలొ... సినిమాలొ చూసే అమ్మ...


మమ్మల్ని ఇలా వదిలేసిన అమ్మ...బహుస ఒకటి కాదేమో...


ఎంత చెప్పిన వినని నా పిచ్చి మనసులొ ఈ రొజుకి ఒక ఆశ...


శరణాలయపు గేటు చప్పుడైతే నువ్వేమోనని...




మాతృత్వం కూడ ఓ ఉద్యొగమైతే...


ప్రపంచంలొ అత్యతిక జీతం అమ్మకే ఇవ్వాలి...


అమ్మ ముద్దల వెనుకే కాదు...


అమ్మ దెబ్బల వెనుక కూడ అపారమైన ప్రేమ ఉంటుంది...


దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం...


సృష్టిలొ ప్రతి జీవికి అమ్మ ఉండటం...


నీకంటు ఓ అస్తిత్వం లేనప్పుడు...


నిన్ను కొరుకునేది అమ్మ...


నువ్వెలా ఉంటావొ తెలియనప్పుడు...


నిన్ను ప్రేమించేది అమ్మ...


జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు...


నేనేమిచ్చిన తక్కువే...


బాల్యంలొ చలిపులికి వణుకుతుంటే...


వెచ్చని తన కౌగిలొ నిద్రపుచ్చుతుంది...


సమస్యలతొ సతమతమవుతుంటే...


ఆరాధనతొ నిండిన తన ప్రార్ధనతొ కాపాడుతుంది...


అదే నేస్తం అమ్మంటే..."మాతృ దినొత్సవ శుభాకాంక్షలు" మీ రేవా...



పగటికి చితి పేర్చి సంధ్యా జ్వాలలను మాలలుగా...నీ మెడలొ వేయ్యలేను..

వెన్నెలను మధిస్తూ తీసిన నా వేదన గరళాన్ని...నీకు బహుమతిగా యువ్వలేను

వెలుగును వెనక్కి నెట్టుతూ...రేపటి కొసం అతికించుకున్న

నా పాతముఖాన్ని నీకు చూపించలేను...ఎందుకంటే..

మలినమైన నా మనసు...నీశేది చీకట్లునీ కప్పుకుంటుంది..

చెమ్మగిల్లిన నా చూపు...కొత్త కన్నీటి కొసం వెతుక్కుంటుంది..

నీ రూపం నా దేహనికి తగిలినప్పుడు...నిరాశ మంచుల మారుతూ..

నా ఆనంద ప్రభాతపు...నీల సముద్రంపై..

వెండి మువ్వలా కరుగుతుందనుకున్నాను...

కాని బ్రతుకు అంచుమీద నల్లని దు:ఖపు కెరటంతొ

విరుచుకుపడుతుందనుకొలేదు..

నీ ఊహల కౌగిలిలొ ఒదిగిన కాంక్ష తప్తమై..

ఉష: కాంతిలా మారి నా గుండెని శొభింపజేస్తుందనుకున్నాను..

కాని చినిగిన స్వప్నపు సంచిలొ..

చితికిన బాష్పంలా మారుతుందనుకొలేదు నేస్తం..

కదలని కాల గడియారపు గుండెల్నీ...సుతారంగా మీటుతూ..

అనంతమైన శూన్యాన్ని అలుముతూ వెళ్ళీపొయావు..

సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపిస్తున్నట్లుగా...

ఈ జీవిత ఘటానికి శెలవంటూ...

అవ్యక్తంగా మూలుగుతుంది వెలుగుతుంది...నా ప్రాణదీపం...

కడసారైన నిన్ను చూడాలని...!




దేవుడు దీనంగా నావైపు చూస్తూ...తలదించుకుంటున్నాడు..


నేను ఏమైనా అన్నానా?


ఆశలు పెంచుకుని...ఆకలి అని అరుస్తూ అన్నింటా విఫలుడై


ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి గురించి అడిగానా?


యౌవ్వనం అమ్ముకుంటూ...అలసి జీవనం సాగిస్తూ సాగిస్తూ..


సంధ్యవేళలొ ఉరి తీసుకున్న సానిపడుచు గూర్చి అతనితొ చెప్పానా?


కార్గిల్ యుద్దంలొ చితికిన తన కొడుకు వార్తవిని


చీకట్లొ..ఏట్లొ దూకిన ముసిలిదాని పసరు గుండె నే చూపించానా?


కాలి కమురు కంపుకొట్టే కాలం కధ...మానవ వ్యధ...


నేను అతనితొ వివరించానా?


నిఖిల సృష్టిలొని ఖిలం గూర్చి..


నీరవ సుందర హృదయ పాత్రలొ నిండిన హాలహలం గూర్చి


నిజం చెప్పమని నేనడిగానా?


ఆకత్తయి మొగుడైనా ఆ వెధవ ప్రతిబింబాన్ని


అప్యాయంగా మోసే ఆడదాని ఒళ్ళు గూర్చి కాని..


ఆపుకొలేని యౌవ్వనంలొ తప్పటడుగువేసిన


పెళ్ళికాని పిల్ల కన్నీళ్ళు గూర్చి నేనేప్పుడైనా అడిగానా?


నీకు తెలుసు...నేను అడకపొయిన ఇవన్నీ నిజాలేననీ!


దేవుని చెక్కిళ్ళమీద దీనంగా జారే ఆ కన్నీటిని చూస్తూ..


వెళ్ళిరమ్మని వీధి చివరిదాకా సాగనంపి వచ్చాను..


మానవుడే దానవుడై తిరగబడినప్పుడు..


పాపం పెద్దవాడు...మనల్నీ కన్నవాడు..వాడు మాత్రం ఏం చేస్తాడు...




ఈ వేళ నువ్వు వస్తావని...


ఈ ఉదయానికి అందం తెస్తావని...


ఒలికిన అత్తరు సుతారపు సువాసన విదిల్చే ఘుమఘుమలలొ


కురుల్ని సిగగా చుట్టి... గులాబీలు తురిమి...


నా ఆశల గుమ్మం ముందు నిల్చున్నాను...నీకొసం...!


అందానికి అవధిగా... యౌవ్వనానికి సుందరిగా...


ఆకుపచ్చని సిగ్గుల్లొ... వలువల్లొ దాగుతూ...


నీరెండవాన చినుకుల్లొ తడుస్తూ...


ఒక్కొక్క ఉద్రేకపు తరంగాన్ని గుండెల్లొ జాగ్రత్తగా


కొత్తచీర వంపుల్లా మడుస్తూ... నిల్చున్నాను నీకొసం...!


సౌభగ్యాన్ని ఆకాంక్షిస్తూ... మైత్రీ దీపాన్ని వెలిగిస్తూ...


శాంతిసౌఖ్య తారావళిగా... మందారకుసుమహారావళిగా...


కదళించే ఈ వలపు వేడి నిట్టూర్పులతొ...


రగిలిపొతున్న మది విరహ భారాన్ని ఊరడిస్తూ...


కాంక్షనిండిన కళ్ళతొ నిల్చున్నాను... నీ కొసం...!


జాము రాక ముందే... వెలుగు చూడక ముందే...


తనువు తొలి కొర్కెలతొ తరబడిపొతుంది...


తలుపులు మూసిన నా గుండె గదిలొ...


నీ తలపుల గడుసుతనం ఇంకా వేదిస్తునే ఉంది...


మునిమాపు చీకటి చేదిరిపొక ముందే వస్తావు కదూ...




నా గదికి తొరణమాలలు ... ధూప... దీపమ్ములు ఎందుకు..

ఏ బాధ నివారణకు ... ఏ వాంఛ పరిపూర్తి కొరకు?

దేవుడూ మానవుడూ వీరిద్దరూ... యీ అనంత విశ్వంలొ మూర్ఖులే...

ఏ కొణం నుంచి చూచినా ఓటమిని అనుభవించే వాళ్ళు వీళ్ళే కనుక...

ఒకనాడు నీవు పెండ్లాడిన ఒయ్యారపు భార్య...

తప్పతాగి తందనాలాడుతున్న నీ క్షేమం కొసం...

తులసి కొట చుట్టూ కన్నీటి దీపాలు వెలిగిస్తుంది...

ఇది ఏ నాగరికతకు ఫలశృతి?

అర్ధరాత్రి ధియేటర్లలొ అర్ధనగ్న లాస్యానికి...సెక్సీ హాస్యానికి...

అమెరికన్ జాకెట్లు తొడిగిన బంగారు పిచ్చికలు కిచకిచలాడుతున్నప్పుడు...

ఊరవతల సందులలొ... అంగళ్ళలొ...

విక్రయార్ధం రంగేసిన...రకరకాల మొనగాల్ని.. విలాసం పేరుస్తుంది...

ఇది ఏ భొగవంతుని విచలింప చేయగలదు?

దారి తెలియక తడబడుతున్న అంధుడిని చూసి

చీకటి నీ తల్లి అని...కటువైన నిజాన్ని కాలం చెప్పుతుంది...

ఇది ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి...?

విధి విపక్షుల్ని... పక్షుల్లా తరుముతుంటే...

అలవాట్లు ఆచారాల రైలుపట్టాల మీద దొర్లుకుంటూ...

మైలుపడ్డ దుప్పటిలా నన్ను అలుముకుంటుంది...

నా బాధ ఏ సౌధాంతరాలకు పయనించగలదు?

ఏవరి గుండెలను స్పృశించగలదు...?




అనాది నుండి మంచు చీకటితొ చెయ్యి కలిపి


పగటి వెలుగుతొ బాంధవ్యం నటించడం నేను చూశాను...


ఆదర్శవాది అర్ధరాత్రి బురఖాతీసి


అద్దంలొ నగ్నంగా ప్రతిఫలించడం చూశాను...


అమ్మాయిల కన్నుల్లొ సరదాకీ...


సభ్యతకీ...మధ్య జరుగుతూన్న యుద్ధాన్ని చూశాను....


కత్తి అంచులాంటి మంచులొ...ముండ కొసం మొగుడొదిలేసిన


అసహాని ఆరొసారి గర్భిణి అయిన ఆడపడుచును నేను చూశాను...


నిత్యం చెదురుతున్న మబ్బుల మధ్య నలుగుతున్న సూర్యుడిలా...


సమస్యల మధ్య మూల్గుతున్న సగటు జీవిని నేను చూసాను...


చైతన్యపు అంచుమీద నున్న తల్లికి...


తన అడుగుజాడల్లొ నడుస్తున్నతనయుడికి మధ్య...


నీచపు సంబంధాన్ని అంటకట్టే అత్త..మామలను నేను చూసాను...


నిన్నరాత్రి తన కలల గుమ్మంలొకి ఆహ్వనిస్తూ...


నేడు తల్లిదండ్రుల కొసం...ప్రియుడిని పాతాళంలొకి తొక్కేస్తూ...


వేరేవాడి కౌగిలిలొ వెచ్చని సుఖ: కొసం


ఆరాటపడే ఆడపిల్లను నేను చూసాను..


ఈ చరిత్ర విచిత్ర సుముద్రాలవలొకిస్తూ...


విధి విసిరిన తుంపర్లలొ తడుస్తూ...


కాల తీరాన ఒక్కణ్ణీ నడుస్తున్నాను...


ఎందుకంటే...


మనుగడ పడికట్ల మరమేకుల్లా దిగబడుతుంటే...


నా మనస్సెప్పుడొ మొద్దుబారిపొయింది నేస్తం...!




గ్రీష్మ ప్రధమ దివసాలైనా....


ఇంకా వసంతపు గడుసుతనం వేధిస్తునే ఉంది నీలా...!


నవ్యమైన ... దుర్నిరీక్ష్యమైన కాంతి కొసం...


ప్రతి రాత్రి చీకటిని చంపుతున్నాను...


ఆ వెలుగులొ నీవు కన్పిస్తావని...!


నా కన్నుల కాంక్ష లాసజ్య ధనువువై...


నీ కౌగిలిలొ వొదిగిన నా తనువు కొసం...


నిశ్మబ్దపు పరుపుపై పవలిస్తున్నాను...


ఆనాటి మధుర స్మృతిగా మిగిలిపొతావని...!


ఎర్రనైన ఏకాంత సరస్సున...విరిసిన ఎర్ర కలువలా...


సంస్కారపు కేశపాశంలొ తురిమిన అనురాగపు గులాబిలా...


స్నిగ్ధ దరహాస పరిమళాలను గుభాళిస్తున్నావు...


నీవు కానరాక ఒంటరిగా ఎన్ని దీన నయనాల్నీ...


ఎన్నీ మౌన నిశ్వాసాల్నీ ఏరుకున్నానొ....


ఇంతలొ వివేకం లేని ఆవేశంలా...


సంయమనంలేని సౌఖ్యంలా...


నాకే తెలియని ఓ నిస్పృహ నన్నావరించుకుంది...


నా బ్రతుకులొ అదృష్టం నవ్వుతుందొ..


ఏడుస్తుందొ... నాకే తెలియని ఓ విభ్రాంతిలొ...


నా నొసటన ఆనందపు నెలవంకలు ఇక లేవని....


విధి లిఖించిన వెర్రి చిత్రంలా మిగిలిపొయాను..




ఒక నిశార్ధ భాగంలొ... నక్షత్ర నివహగగనంలొ

తరతరాల ఓ నిస్పృహ నన్ను హత్తుకుంటుంటే...

నులివెచ్చని మనసులొ... చినుకు రాలినట్లు...

సేదతీరు నిదురలొ... కలలు జారినట్లు...

ఎదొ తెలియని నీ మోహం...నన్నావరించుకుంటుంది...

సంజె చీకట్లలలొ కలిసిన మన నిశ్వాసాలు...

చరచరాలు తాకిన నా మూర్తిని మధురంగా స్పృశిస్తున్నాయి...

మనం చెప్పుకున్న రహస్యాలు...కలలుగన్న ఆదర్శాలు...

నేడు హేమంత శైత్యానికి గడ్డకట్టుకుంటూ...

నాటి వాసంత విహారాల జాడలుగా నిలుస్తున్నాయి...

పెదవి సందులలొ విరిసిన చిరునవ్వుతొ...

సిగదాల్చి సిరిమల్లెలతొ ...

నీ హృదంతర దృగంతర దివ్యత్వమైనదని తలచుకొని.....

నీ జ్ఞాపకాల తుంపర్లలొ తడుస్తూ...

ఊహలను లలిత లతాంతమాలుగా కడుతూ...

మన ఆశల కలలతీరాన ఒకణ్ణీ నడుస్తున్నాను...

వ్యధశీల మది మీద విరహన్నీ చేరిపివేస్తూ...

నీకొసం ఆనంద ముద్రిత నేత్రాలతొ ఎదురుచుస్తూన్నాను...

వస్తావు కదూ...!


నీ నవ్వుల్లొ వైడూర్యాలు లేవు...


నీ కళ్ళల్లొ రత్నకళీకలు లేవు...


అందాన్ని చూసి స్పందిచలేని నువ్వు


బాధను కని...కన్నీరుని విడవటం దేనికీ....!


నిర్లిప్తంగా వెళ్ళిపొయే నిన్ను చూస్తుంటే...


నీలిమ...అతృప్త అశాంత తరంగాల అంచుల్ని దాటి


విరుచుకు పడుతున్నట్లు...


మమకారం... అపార కృపా తరంగితాలై నాటి...


స్నిగ్ధ దరహాస పరీమళాలను వెదజల్లుతున్నట్లు అన్పిస్తుంది..


జారిపొతున్న చీకటిని వదలలేక దీపం...


వదలిపొతున్న స్నేహన్నీ విడవలేక నా ప్రాణం...


మూగ సైగలతొ మేల్కొన్న నిశ్మబ్ధంతొ.. నిరాశగా మాట్లాడుతుంది...


దీపపు వత్తి చివర నిద్రపొయే నిప్పు నలుసులా ఆరిపొయింది...


అయిన వంచలేను నీ ముందు నా శిరస్సునీ...


ఒప్పలేను అలుముకుంటున్న నా ఓటమినీ....


నేను నిదివరకటి నేను కాను....


నాకు విలువల్లేవు... అనుభూతులు అంతకన్న లేవు...


మాలిన్యం మనసులొ ఉంచుకొని...


నీలా మల్లెపువ్వులా నవ్వటం నాకు చేతకాదు నేస్తం..!

;;