జీవితం అనుభవాల మూట...
భావలు అవ్యక్తవ్యక్తంగా...నీ ముందు గెంతులేస్తునప్పుడు...
సమాధి చేయబడ్డ కొరికలు...నీ ముందు సాక్షత్కరిస్తున్నప్పుడు...
దేన్నీ సాధించలేననే అసంతృప్తి...నీ ముందు నాట్యం చేస్తున్నప్పుడు...
నీలొ ఉత్సహన్ని నింపే ఆయుధం...అమ్మ...
నీతికి నిదర్శనం...త్యాగానికి ఆకారం...
సత్యానికి ఆదర్శం...ప్రగతికి సొపానం...
స్నేహనికి ప్రతిబింబం...విజయానికి ఓంకారం...అమ్మ...
తొలి పలుకులకు గర్వపడుతూ...తప్పటడుగులకు మురిసిపొతూ...
తప్పుటడుగులను సరిచేస్తూ...
నీ నవీన జీవన గమనానికి బాటలు వేసే మార్గదర్శి...అమ్మ...
గుండెలొని రాగాన్ని...మమతానుబంధాలతొ అల్లీ...
నిదురరాని ఘడియలలొ... అనురాగంతొ నిండిన జొల పాట పాడుతూ...
నిశేదిని పాలించు నిద్రసీమను ... నీ కంటి దరికి ఆహ్వనిస్తుంది...
కలతలన్ని మరచి....కలల దొంతరల్లొ తేలిపొమ్మంటుంది...
దూరమున్న ఆ పేగు బంధం... ఓ పలకరింపు కొసం తపిస్తూ...
ఓ చిన్న మాటకై ఎదురు చూస్తుంది...
అనుక్షణం నీ వెంటే ఉన్నానంటూ...మదికి ధైర్యాన్నిస్తుంది...
నిరాయుధ సిపాయిలా కష్టాలను శాసిస్తూ...
జీవన పొరాటంలొ నిగ్గు తేలిన బలశాలి... అనుభవ శాలి... అమ్మ...

కళ్ళు తెరిస్తే...
రాలే ఆకులు... ఎండిన చెట్లు...
ఒలికే కన్నీటి బొట్లు...
అంతే లేని ఆకాశం... నేనున్నాననే నిశ్శబ్దం...
అలసట లేని అగాథాలు... ఆలోచనల సుడిగుండాలు...
కలచ వేసే కష్టాలు....సమస్య వలయ చక్రాలు...
సమసిపోవు... మాసిపోవు...
మరపురావు... మదిని వీడవు...
కళ్ళు మూస్తే...
ఊపిరి నిప్పుల శగలన్నీ...
ఉప్పెనలా ప్రవహిస్తున్నాయి...
గుండెల్లో రగిలే బడబాగ్నులన్నీ...
ద్రవించే లావా ప్రవాహాలవుతున్నాయి...
మదిని కలచి వేస్తున్నాయి... మౌన్నాని మధిస్తున్నాయి...
ప్రశాంతతని హరిస్తున్నాయి...
రూపం లేని శత్రువుల్లా మారి... నిదురకు దూరం చేస్తున్నాయి...
చీకటితొ నిండిన నా హృదయంలొ...
దీపాన్ని వెలుగునిస్తావనుకున్నాను... కాని...
జ్వాలావేశపు చూపులతొ...
నా ఊహల ప్రపంచాన్ని కాల్చి బూడిదచేస్తూ...
జీవం లేక జారే కన్నీరులా మిగులుస్తావనుకొలేదు...!
కలల విశ్వాంతరాళంలొ...
నీతొ మొదటి అడుగుకై ఆలొచిస్తూ...
సంవత్సరాలు గడిపేస్తూ వ్యచ్చించిన కాలం...
అవిశ్రాంత సంగ్రామాలుగా మారి....నా గమ్యాన్ని చేరిపేసింది...
అంధకారంలొ నా భవిష్యత్ మిగిలిపొయింది...
ప్రపంచానికి మరొ రొజు గడిచిపొయింది...
మన భాషని మనం మాట్లడక పొతే ఎవరు మాట్లాడుతారు...?
మన అక్షరాలు మనం వ్రాయకపొతే... ఎవరు వ్రాస్తారు..?
మన సాహిత్యం మనం చదవకపొతే... ఎవరు చదువుతారు....?
మన అమ్మను మనం గౌరవించకపొతే... ఎవరు గౌరవిస్తారు....?
యాభై ఏడక్షరాలు...మూడు ఉభయాక్షరాలున్న
మన వర్ణమాల ప్రపంచ భాషల్లొనే రెండొది...
శతాబ్దాల నాడే మన అజంతాల భాష... దిగంతాలకు వ్యాపించింది...
ప్రపంచ కధనికలొ గుణాఢ్యుడైన...హాలుడు గాధసప్తశతైన......
రాయలవారి ఆముక్తమాల్యదైన.. త్యాగయ్య... రామయ్యకర్పించిన...
ఘన రాగ పంచరత్నాలైనా...అనుసృజన చేయ్యడం అసాధ్యం...
కాని నేడు...
తల్లి పాడే చందమామ పాట కొండెక్కిపొతుంది...
బామ్మ చెప్పే ఓరాజు కధ కంచికి పొయింది...
అమ్మ మమ్మిగా మారిపొతుంది...
నాన్న అనే తెలుగు తొటకు డాడి అనే కలుపు అంటుకుంది...
ఎ బి సి డి ల వేడికి తెలుగు పలుకులు మాడిమసయిపొయాయి...
బుడతడి భుజం మీదున్న బండెడు పుస్తకాలలొ...
మచ్చుకైన ఒక్క తెలుగు పుస్తకం కనబడకుండా పొయింది...
భాష దురభిమానాన్ని ఎవరూ హర్షించరూ... అలాగే
అంటరాని భాషగా తొసేస్తున్న...
మన వింత మనస్తత్వాన్ని ఎవరూ సమర్ధించరూ కూడ...!
మా తెలుగు తల్లికి మల్లెపూదండ... అంటూ...
ఏకంగా తెలుగు భాషకే ... మంగళ హారతి పాడేస్తున్నాం...
నేను తెలుగు వల్లభుడిని...అందుకే తెలుపుతున్నాను....
"మాతృభాషా దినొత్సవ శుభాకాంక్షలు...."
మౌనంతొ మాటలు కరువైన రోజులుకి దూరం గా...
నాలొ నేనే మట్లాడుకుంటూ...
నన్ను నేనే ఓదార్చుకుంటూ... గడిపిన క్షణాలను మరచి పొతున్నాను...
చిక్కటి నిషేదిలొ ఉలిక్కి పడిన నా కళ్ళలొకి...
అంధకారమైన భవిష్యత్తుని చూస్తూ....
ఆవేశంతొ రగులుతున్న నా గుండె చప్పుళ్ళకి లయగా ...
విర్రవీగుతూ...వికృత నాట్యంతొ సాగిపొతుంది కాలం గానుగెద్దులా....
ఉదయం కోసం ఎదురు చూసినా నా బ్రతుకుని వికటాట్టహాసం చేస్తూ...
నిదుర లేని చీకటి రాత్రులనే మిగిలుస్తూ.. వెళ్ళీపొతుంది విధి విలాశంగా...
సమస్యల శృంఖలాలును తెంచుకొని బాహ్య ప్రపంచం లోనికి అడుగు పెట్టాను....
ఎటు వైపు చూసినా... పచ్చిక బయళ్ళతో ప్రపంచం కళకళలాడుతోంది...
చల్లగాలుల పలకరింపులతో... మేను పులకరిస్తుంది....
చీకటి గుహలకు దూరం గా...
నాలుగు గోడల మధ్య బందీ గా ఉన్న రొజులని మరచి పోవాలని...
విజయాల వెలుగు రేఖల వైపు అడుగులు వేస్తూ...
భయాలన్నిటినీ ధైర్యంతొ విచ్చుకున్న కత్తులకు బలి ఇస్తూ...
చైతన్య వర్ణాల నిండిన... స్వేఛ్ఛా లొకం లోకి పరిగెడుతూనే వున్నా....
మలి సంధ్య వెలుగులను నింపిన దీపాలకొసం....పులకించే పుష్యరాగాలుగా...
నాలొ ఉన్న నమ్మకానికి...
నన్ను నడిపించే ధైర్యానివి నువ్వేనని ఎలా చెప్పను...?
నాలొ ప్రతి శ్వాసకి ....
నేను బ్రతికున్నది నీ ఆశతొనేనని ఎలా తెలుపగలను...?
నీ పేరు పలకాలనే పెదవులకి...
నా చిరునవ్వే నువ్వని ఎలా చెప్పను...?
నిన్ను ఆర్తిగా వెతికే నా చూపులకి...
నా కంటిపాపే నువ్వని ఎలా చెప్పను...?
మదన పడుతున్న నా మదికి....
నా మనసాక్షివే నువ్వని ఎలా చెప్పను...?
నీ ఆలొచనల్లొ తెలుతున్న నా ఊహలకి...
కంట పడని నా ప్రాణం నువ్వని ఎలా చెప్పను....?
నా అంతర్మధనంలొ నలుగుతున్న నీ ప్రతి జ్ఞాపకానికి...
నా గుండెచప్పుడు నువ్వని ఎలా తెలుపను....?
నిశేదిని పాలించు నిశ్శబ్దనికి....
తడబాటుతొ నిండిన ఈ హృదయ ఎడబాటుని ఎలా చెప్పను...?
స్నేహితులుగా మనం కలిసి గడిపిన కాలనికి...
నీ మీద నాకున్నది ప్రేమే అని ఎలా చెప్పగలను...?






