నెత్తురు వరదల్ని చూసిన మనకీ ప్రక్క వాడి కన్నీటి వాన ఓ లెక్కా....
4 comments Posted by బుజ్జి at 5/05/2010 03:18:00 AMఏదొ భారం దిగిపోతుందనీ...
మనసు తేలికపడుతుందనీ అనుకుంటూ...
అర్ధం చేసుకుని... మనల్నీ అనునయిస్తారని...
ఆశ పడతాం...పొరబడతాం...
మన బాధ మనకు ఎప్పుడూ...
ఓ సంచలన వార్తగానే మిగిలిపొతుంది...!
ఒకరి వేదన మరొకరి పై...
ఆకాశంలా విరిగి పడదు...
నక్షత్రాలు బూడిద రాశులుగా రాలి పడవు...
అందుకనే ఏమో...
ఒక ప్రక్క దిగులు మేఘాలు...
గుండె దిగుడు గుంట లొనే కురుకుపొతుంటే...
మరొ ప్రక్క కలతలు...
కష్టాలు... కన్నీళ్ళు...అవమానాలు...అనుమానాలు...
మనసు బావిలొనే ఇంకిపొతున్నాయి... అయినా...
మనసును మించిన ఇంకుడు గుంత మరొకటేముంది.... నేస్తం...!
మన ఐదు ఖండాల సంస్కృతి...
కాదొక స్ధిరబిందువని గ్రహించలేరు పాపం వీళ్ళు...
ఆలొచించలేని మంచివారు మనవాళ్ళు....!
నెత్తురు వరదల్ని చూసిన మనకీ
ప్రక్క వాడి కన్నీటి వాన ఓ లెక్కా...చెప్పు!
ఉదయపు నీ రెండలొ నిలిచిన శిరొజ
సౌఖ్యాన్నిదువ్వెనతొ మంచుబాలను చూసి...
ఉష: కుమారివి నీవని తలస్తున్నాను...
ఎందుకంటే అది అందమైన నిజం...
తడబడుతూ నడుస్తూన్న అంధుడిని చూసి...
చీకటి నీ తల్లి అని చెప్పకని వారిస్తున్నాను...
ఎందుకంటే అది కటువైన నిజం...
కట్టు తప్పిన నగరంలొ...
పట్టు తప్పిన సంఘంలొ...
ఆకలాహుతి కొసం...అడుకుంటున్న...
చిదిమితే పాలుగారే చిన్నారి బుగ్గలు...
మోహన యౌవ్వన వనసుమాలు...
తరుణవయస్కులు...
ముక్కుతూ... మూల్గుతూ... ఉండే ముసలాళ్ళును...
చూసి...అరుగు మీద మేల్కొన్న ముష్టివాడిలా ఆక్రొశిస్తున్నాను....
ఎందుకంటే... ఇది దయనీయన మైన నిజం...!
మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని...
ముసురుకున్న బాధల వానకారులొ...
మసి బారిన చూపుతొ... ససి చెడిన రూపుతొ...
ముగ్గు బుట్టలాంటి తలపై...కొండంత బరువును చూసి...
మూల్గుతున్న ముసలి తల్లి... నా భరత ధాత్రని విలపిస్తున్నాను...
ఎందుకంటే...ఇది హృదయద్గతమైన నిజం...
వస్తావో..రావో..తెలియని సంధి ఆలొచనల నడుమ...
నువ్వు రావాలనే సరికొత్త ఆశల తీరాల మధ్య...
నన్ను మబ్బులా కమ్మేసే...
మధురమైన నీ ఊహలలొ పరవశిస్తూ...
నీ కొసం...నీ జ్ఞాపకాల అసరాతొ సాగుతున్నాను...!
అందం తాకని అంబరానికి వర్ణాలేన్నొ అద్దావు...
ఈ సంధ్య ఇలాగే ఉండిపొనీ నేస్తమా...!
చలనం లేని గుండెలొ కాంక్షాకిలల్ని వెలిగించావు...
ఈ కాంతి లతాంతాల్ని అలాగే నిలిచిపొనీ మిత్రమా...!
శిధిలమైన సంబంధాన్ని ధ్వంసం చేయకుండా...
నూతన సంబంధాల్ని ఎలా పేనగలం...?
గాయపడకుండా...దగ్ధమవకుండా...
అగాధ లొతుల్లొ మునిగి తేలకుండా...
ఎలా ప్రేమించగలం..?
నీవు రాని నిశీధులు...
నా నిదురకు నీషేదాలని ఎప్పుడు తెలుసుకుంటావు...
నిర్లిప్తంగా వెళ్ళిపొయే నిన్ను చూసినప్పుడు...
నీ జ్ఞాపకాలు...నా ఆశల తీరం వదలి...
అంతరంగపు సముద్రంలొకి జారిపొతున్న చప్పుడు...
ఇప్పటికి ఇంకా విన్పిస్తూనే ఉంది నేస్తం...!
వందల వేల శిశిరాల్ని దాటకుండా
ఒక వసంతం కొసం కలలు కనడం అవివేకం అని తెలుసుకున్నాను...
నా మనసులొ మాట...
నీకు చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి విఫలమౌవుతున్నాను...
నీకు దూరంగా ఉండాలని ప్రయత్నించిన అనుక్షణం ఓడిపొతున్నాను...
గుక్క తిరగని ఏడ్పులతొ...
కారిపొతున్న కన్నీరు మీద...
తడబడే పాదాలతొ...నత్త నడకలు నడుస్తూ...
ఎడతెగని దిగులును అలింగనం చేసుకుంటూ...
ఎంత కాలం ...ఇలా నేను ?
అనురాగం... ఆత్మీయత కలబొసిన మమతతొ...
మానవతలను మేళవించిన ఈ వనితని...
ఆ దేవుడు ఇచ్చిన కానుక అనుకున్నాను ...
కానినువ్వు మాత్రం...
కన్నీరే ఎండిన కనులే నాకుంటే...
కనులే దాటని నీ కలలను చూడమంటున్నావు...
వేకువే ఎరుగని రేయి ఒకటుంటే....
వేదనే తరగని నీ ఆవేదనని కనమంటున్నావు...ఇది న్యాయమా...!
వరమే పొందని నా తపముతొ...
నా ఆశలు ఆరిన మనసులొ...
గాయాలు మానిన మనిషిగా మారుతూ...
కనీకారం లేని ఈ కలతలను చేధిస్తున్నాను...
మజిలీ... మజిలీకి అలసిపొతూ...
రేపటి ప్రధమ సూర్యోదయాశ్లేషం కొసం... అన్వేషిస్తూ....
ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకుంటున్నాను....
ఇవ్వన్నీ నీకొసం కాదా నేస్తం...!
నీ అందం...
ఏ గులాబి కి కొత్త రంగు తెస్తుందొ...
ఏ నక్షిత్రానికి కొత్త మెరుపు వస్తుందొ...
ఏ మబ్బుకి కొత్త నునుపు నిస్తుందొ... తెలియదు కాని...
నీ ముఖ సౌందర్యాన్ని కొరి...
చంద్రుడు మేఘముల మాటున సొమరిలా దాగుకొన్నాడు...
నీ తనువును స్పృశిస్తూ...నీ ముద్దు పెదవులు తాకుతూ...
జాలువారుతున్నఆ పరిమళాన్ని చూసి...
ఏదొ కొత్త పుష్పమను భ్రాంతితొ అనిలుడట్టే నీ చుట్టు తిరుగుచున్నాడు...
నీ సిగ్గులలొ ఎర్రబడిన వెన్నెలను చూసి...
సూర్యొదయ మయిందేమోనని పుడమి పులకరిస్తుంది...
నీవీ ప్రపంచము నిట్టు క్షొభ పెట్టుట న్యాయమా చెప్పు...!
నీవు వస్తావొ... రావొ...తెలియని...ఆలొచనల నడుమ..
ముఖంలొ నిండిన అరుణ కాంతిని ...
సాయంత్రం తన పశ్చిమదిశలొ జారవిడుస్తూ...
నలుపు రంగుతొ నా ముఖాన్ని కప్పుతుంది...
నాలొ కాంక్ష వెయ్యి కాగాడాలుగా వెలిగిస్తుంది...
నీవు లేక నిష్ఫలమైన నా జీవితంలొ....
విచారగ్రస్తమైన నా మదిగృహాంలొ నిండిన నీలిమని...
నీ నేత్ర కాంతులతొ చీల్చుతావనే ఆశతొ....
ఆనంద ముద్రిత నేత్రాలతొ...ఎదురుచుస్తున్నాను నేస్తం...!







.jpg)