ఎసెమ్మెస్ లు వెళ్ళుతునే ఉన్నాయి...

కీ బొర్డుపై వేళ్ళు కదులుతునే ఉన్నాయి...

ఈమెయిళ్ళు ఇంకా పూర్తి కాలేదు...

నైట్ పార్టీల మజా ఇంకా తీరలేదు...

పబ్బుల్లొ పరిచయాలు పెరగలేదు...

వెబ్బుల్లొ వెలుసుబాటు ఇంకా చిక్కనేలేదు...

ఎన్ని పనులు... ఎన్నీ వ్యాపకాలు...

గుండెలను హత్తుకున్న ఏడాది అనుభుతులను

తడిమి చూస్తే...ఏం మిగిలింది...?

2010 కాలింగ్ బెల్ కొడుతుంటే....

2009 తలుపుతీస్తూ... కరిగిపొయింది...

కాలం వేగమే అంత...! మా యువత ఉడుకు రక్తం ఉరకల్లాగ....!

ఎన్ని సాధించిన... ఇంకా ఎన్నొ మిగిలున్నాయి...

కొత్త ఎడాది స్వాగతానికి ఆశల తొరణం కట్టాలి...

ఆశయాల గుమ్మం ముందు... లక్ష్యాల ముగ్గులేయాలి...

సరదాల మధ్యనే విజయం సాధించాలి...

వ్యక్తీగా ఎదగాలి...సంఘమై సాగాలి...

ఎంచుకున్న దారి సరైందైతే....

లక్ష్యం చేరకుండా ఎవరూ ఆపలేరు...

ఆత్మవిశ్వాసాన్ని ఊపిరి నిండా నింపి...

ఆగని కాలనికి ఆనందాలను అద్దుదాం...

"నూతన సంవత్సర శుభాకాంక్షలతొ.... మీ రేవా"



గుండెల్లొ బాధ ఆకాశాన్నంటితే ఏం లాభం...అంతా శూన్యం...


ఎండిన కనుపాప తిరిగి వర్షిస్తే ఏం లాభం...అంతా ఆర్ధ్రతమానం...


నీ విరహపు వేడిలొ ద్రవీభవిస్తున్నాను...


నీ వలపుల నీడలొ ఘనీభవిస్తున్నాను...


నీ సుమధుర జ్ఞాపకాలను ఆస్వాదించేది నేనే...


నీ చుర కత్తుల చూపులతొ ఆక్షేపించబడేది నేనే...


జ్ఞాపకాల విలాసంలొ దుఖ: వెచ్చటి కంబళై కౌవ్విస్తుంటే...


బంధనాలు తెంచమని నిన్ను అడిగేదేలా...?


విధి వైపరిత్యంలొ నీ ఎడబాటు సైగలతొ గుండెను మండిస్తుంటే....


ప్రాణ రక్షణకై నీ చిరునవ్వుల హస్తాన్ని అడిగేదేలా...?


నా ప్రతి ప్రశ్నకి ఒకటే వైనం... అదే మౌనం...


మనశ్శాంతి కొ దృక్పధం....మరణం నాకు ఔషదం...



గతం నువ్వై తాకుతుంటే....నా చితిని నేనే చూస్తున్నట్లుంది...

బ్రతికిన కాలంలొ మధుర క్షణాలను వెతుకుతుంటే....

విధి నీతొ గడిపిన నిమిషాలనే గుర్తుచేస్తుంది....

నీ జ్ఞాపకాలను వేదన సిరాగా నాపై చల్లుతుంటే....

శ్వాశ మరిగి గుండెపై తపన పెంచుతుంది....

ఎడబాటుల నీరిక్షీణలొ నిన్ను శొధిస్తుంటే....

వెతికి అలసిన కళ్ళు స్వేదాన్ని చిందిస్తుంది....

ఒక ప్రక్క హృదయం నిట్టూర్పు తొ వాడుతుంటే....

మరొ ప్రక్క ఆత్రుతతొ నీ తలపులు వికశిస్తున్నాయి....

నా కష్టాలకు శత్రువులా... సుఖాలకు సంపన్నురాలిగా... నిలుస్తావనుకున్నాను....

కాని

కారణాలు లేకుండ వెడలిన నిన్ను చూస్తుంటే...

తొరణాలను లేని నా హృదయ వాకిలి ప్రస్పూటిస్తుంది....

మౌనంతొ మరలుతున్నాను....మళ్ళీ నీకు కన్పించకూడదని....

శెలవు నేస్తం....



హృదయాకాశంలొ వెలిగే చిరునవ్వుల సౌగంధం... సంధ్య...
లలిత రాగాల సుమగంధం...కుడి ఎడమల కుసుమ పరాగం... సంధ్య...

మెరిసే నక్షిత్రం... కురిసే వెన్నెల... విరిసే కలువ... పూచే కుసుమం... సంధ్య...

చుక్కల వెలుగుతొ సౌందర్య లొకాలను వెలిగించే హరిత వర్ణాల అందం ... సంధ్య ...

కలల ఆకులపై కురుస్తున్న మంచు బిందువుల సొయగం... సంధ్య ...

ఉషస్సులతొ చీకటిని హరిస్తూ...తన్మయంతొ ఉప్పొంగే భావ కెరటాల వెల్లువ... సంధ్య...

యుగాలని... తరాలని మింగేస్తూ...అనంతానంతగా సాగిపొయే చెలిమి... సంధ్య...

సెలయేరు సొగసులతొ....జలపాతాల రాజసంతొ... జన హృదయాలలొ ప్రవహంచేది... సంధ్య...

తడారిపొయిన కలల ఎడారిలొ చిరుజల్లులను కురిపించే రంగుల హరివిల్లు... సంధ్య...

అధరాలపై కదులుతున్న అస్ధిత్వమైన అక్షరాలకు సరికొత్త అర్ధం... సంధ్య...

ఏకాంతంలొ...మనసు పొరలలొ అలసి...సొలసి...అల్లుకున్న ఆశల అన్వేషణ ... సంధ్య ...

నిశేదిలొ తళ్ళుక్కు మనే తారా దీపం... బ్రతుకు వాకిట నవ్వులు రువ్వే వెలుగు తొరణం... సంధ్య...

ఆశయ సాగర మధనంలొ అమృతతుల్యానికి ప్రతీక ... సంధ్య ...

గడిచి పొయిన జ్ఞాపకాలను కళ్ళ ముందు నిలిపే సుంధర స్వప్నం ... సంధ్య...



ప్రకటన మౌనవ్రతం నడుమ కేంద్రం దొబూచులాడుతుంటే....

ఆందొళనలు... భయందొళనల నడుమ రాష్ట్రం 'బంద్' ఖానా అవుతుంది...

ఆశ... నిరాశల మధ్య ఆంద్రావని కేంద్రం వైపు మోర చాపి చూస్తుంది...

సీమాంధ్రలొ రగిలిన నిరశగ్ని చల్లారలేదు సరి కదా...

నాయకులు దాయదులై భరతమాతను పంచుకుంటున్నారు....

ఒక చొట దీక్ష శిబిరాన్ని భగ్నం చేస్తే... మరొచొట వెలుస్తొంది...

ప్రజల జీవితాలతొ పేకాడే ప్రవృతి పార్టీల్లొ పెరిగిపొయింది...

మొదట చేసిన బాసలను తూచ్ అనడం పరిపాటైపొయింది...

నీతి భాహ్యమైన తీరు నగ్నంగా ప్రజలందరికి కనిపిస్తుంది...

విసిగిపొయిన యువత....లాఠి దెబ్బల తిన్న విద్యార్ధుల మదిలొ...

నిండిన ఆత్మవిశ్వాసం నేడు ఆత్మహుత దాడుల్లొ అంతమవుతుంది...

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మేధావులు ఇప్పుడు ఏమయ్యారు...?

పరిష్కారాన్వేషణలొ పాలు పంచుకుంటున్నారా...! లేక

టివీల్లొ షొ కొసం నీరాహర దీక్షల్లొ తలమునకలవుతున్నారా...!

రాజకియాన్ని ఆటలా మర్చేస్తూ....

భావొద్రేకపు ఉద్యమాల సంద్రంలొ అమాయక ప్రజలను తొసేస్తూ...

మానవ జీవితాన్ని భస్మం చేస్తున్నారు...

నెహ్రు ఆశలకు భిన్నంగా ఎర్రరంగు పావురాలను ఎగురవేస్తున్నారు...

బాపుజీ కలలు కన్న దేశం ఇదేనా?

ప్రజల ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేదెప్పుడు...

క్రొసులకొద్ది నడిచిన నా అంతరంగంలొ ఈ జ్వాలలు చల్లారేద్దెప్పుడు...


ఓ నిర్వేదం...ఒక నిట్టూర్పు...నిర్లిప్తమైన క్షణానికి కారణం...నీ జ్ఞాపకం...


నీ పరిచయం ముందు...సారం లేని బ్రతుకు శబ్ధనికి...సారాంశం లేని నిశ్మబ్ధాన్నీ...


కాలపు ఉద్వేగంలొ...విధిచే నేట్టేయబడ్డ...ఓ జీవం ఉన్న నిర్బేధ్యుడినీ...


నా మౌనాన్ని నీ చూపుల శృతితొ జతచేసి నీ చెలిమికి అర్పించలేను...


హృదయాంతరాలలొ యుగాలుగా దాగిన నిన్ను...


ఒక్క కన్నీటి చుక్కతొ కడిగేయాలేను...


దుర్లభమైన...నీ ఎడబాటు సంద్రాన్ని దాటగలను కాని...


నీ అంతరంగపు సుశుప్తావస్ధలొ ఓలలాడుతున్న నా మదిని ఊరడించలేను...


నీ ఆలొచనలు...కడలిలొ అలలుగా మారి ...నా మది తీరాన్ని ఢీ కొంటున్నాయి..


నిర్వ్యామోహితమైన నీ కర స్పర్స కొరకు...


పగటి వేళ నా మదిలొ నీ రూపాన్ని పతాకొత్సవం చేస్తున్నాను...


అశృవులు నిండిన మగత చూపుతొ నిరాసక్తుడిగా...


రాత్రి వేళ నా అంతరాత్మలొ నీ తలపులకు చందనొత్సవం గావిస్తున్నాను...


హృదయం భావొద్రేకంతొ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీ వలపుల దృశ్యమానంలొ...


అలసి సొలసిన ఈ గొంతులొ మాటరాక గద్గదమవుతుంది...


గతంలొ నేను పారేసుకున్న నీ తలపుల అనుభూతులు...


భవిష్యత్తు లొనైనా దొరుకుతాయని ఆశతొ వెతుకుతున్నాను...

;;