సుందర స్వప్నాల స్వర్గాల మేడ మెట్ల నుండి
వాస్తవికతా శిధిల.. రుధిర కూపానికి దిగుతున్నాను...
బ్రతుకు చక్రాల సీల ఊడిపొతే...అస్పష్టపు భవిష్యత్తు...
దీపపు వత్తి చివర నున్న నిప్పు నలుసులా మాడిపొతుంది...
నిలువ నీడలేని మీ బ్రతుకులు చూసి...
గాలి లేని ప్రకృతి... యోగిలా ములుగుతుంది...
నా మనస్సెప్పుడొ మొద్దుబారిపొయింది...
మూగ సైగలతొ ఈ రాత్రి సంది చేసుకున్నట్లుంది ...
లేకపొతే నిరాశతొ ఎందుకు మాట్లాడుతుంది...?
వర్తమానంలొ ఒక పొర వెగటుగా నన్నావరించుకునట్లుంది...
గత చరిత్ర నక్షత్రాలై... కన్నీళ్ళు కారుస్తూ...
కాలం పాడునుయ్యిలా... ఎందుకు కన్పిస్తుంది...
ఒకనాడు మల్లేచెండ్లుతొ మెల్కొల్పిన ఈ తొలి వేసవి జాగృతి...
నేడు నిశ్శబ్దం అంటుకున్న రాకాసి మంటలతొ...
జుట్టు విరబొసుకొని నగ్నంగా...మీ పంట పొలాలలొ సంచరిస్తుంది...
అనంతపు విశ్వపు గదిలొ ఆడుకుంటున్న ఆకలిని రెచ్చగొడుతుంది...
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి...?
ఈ ఆర్భాటపు హంగులతొ ...
పులి చంపిన... లేడి నెత్తురును పులుముకొలేను...
బొర్ల పడిన అదృష్టాన్ని భుజాన వేసుకొలేను...
సగం చచ్చిన మీ ప్రాణాల్ని జొకొట్టుతూ...
సగం కన్న నా కలల్ని నేమరేసుకుంటున్నాను....
మనిషిలొ దేవుడు కొలువున్నాడు అన్నప్పుడు...
మనిషి మృగం గా మారడ మెందుకు...?
నడవడి సరిగా లేని వాడికి...
పూజలు... నొముల ఫలితమెందుకు...?
హితమే మనిషికి అభిమతమైతే...
మతాల కొసం కొట్లాటెందుకు?
మనువాడే సమయంలొ మల్లె తీగ....
పెళ్లయిన కొత్తలొ అందాల తారక ....
అంటూఅందాన్ని ఆస్వాదించే మనస్సు నీకున్నప్పుడు...
వర్ణాలతొ నిండిన దేహనీకి వంకలెందుకు...?
ఇల్లాలు మనస్సుని అర్ధం చేసుకొలేని నీ బ్రతుకెందుకు...?
బాహ్య రూపం కన్న.... అంతరంగ బంధం... గొప్పదని ...
తెలుసుకొ మిత్రమా... నిత్య సత్యాలివి...
ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగిపొక ముందే...
మొండి చేతుల్లొ మానవత్వం తెల్లబొక ముందే...
మార్చుకొ నేస్తం... నీ బ్రతుకు మార్గాన్నీ...
నీకొసం నేనున్నాను....
కన్నీటిని విడిచి రా...చీకటి తెరలను చీల్చుకురా...
ప్రభాత విపంచిక పలికించడానికి...
అడుగంటుతున్న మన కీర్తిని...దిగంతాలకు చాటడానికి...!
నా భావం... నా భాష్యం...నా హస్యం... నా లాస్యం.. అన్నీ నీవే...
5 comments Posted by బుజ్జి at 5/05/2010 06:05:00 AMనా ఆశల తీరం నువ్వు ఇంకా దాటలేనట్లుంది కాబొలు...
గుండె గుబులుతొ... మేఘంలా గర్జిస్తుంటే...
మది మసకబారుతూ... ముసురు కమ్ముకుంటూ....
రెప్పల చూరు నుంచి కళ్ళూ అదే పనిగా వర్షిస్తున్నాయి...
బాధ చిన్నదైన ...జ్ఞాపకాల దొంతర్లన్నీట్ని
వెతకాల్సి వస్తుంది నేస్తం... దాని మూలలా కొసం...
నా ఆత్మ సంచరించగల విశ్వాంతరాల పరిధిలొ...
ప్రబంధ బంధానివి నువ్వైతే నాపై దయ వర్షించు...
ఆనందపు నిర్లిప్తతొ నిండిన నా మనసు పైచందొ చర్చిత పద్యనివైతే...
ఆనందాశ్రుమిళితానుభూతిని నాపై కురిపించు...
మూగ సైగలతొ నీ నవ్వుల హరాన్ని నా అంతరాత్మకి
బహుకరించిన మధుర లలిత లావణ్యానివైతే...
ఉల్లాస శొకతప్త గేయమై నా రెప్పల మాటున దాగినకన్నీటిని హరించు....
ఎందుకంటే...
నా భావం... నా భాష్యం...
నా హస్యం... నా లాస్యం..
అన్నీ నీవే కనుక...
ఇది ముమ్మాటికి నిజం నేస్తం...!
నాలొ నువ్వు లేని మిగత సగం ... నాకు మాత్రం ఎందుకని..!
5 comments Posted by బుజ్జి at 5/05/2010 06:00:00 AMజీవితంతొ ప్రతి రొజు ఘర్షణ పడుతునే ఉంటాను...
మనస్సున్న మనిషిగా బ్రతకనివ్వమని...!
దేవుడికి ప్రతి నిమిషం ప్రార్ధిస్తునే ఉంటాను...
మానవత్వం ఉన్న వ్యక్తిగా ఎదగనివ్వమని...!
విధితొ అనుక్షణం విలపిస్తునే ఉంటాను...
గొంతులొ నీళ్ళు ఇంకిపొయినా...
కంటిలొ నీళ్ళు మిగిలే ఉన్నాయని...
అవే నా ఆశల సముద్రాన్ని బ్రతికిస్తాయని...!
కక్ష కడుతున్న కాలాన్ని ప్రశ్నిస్తునే ఉంటాను....
అప్యాయత ... అనురాగాల మధ్య...
హంగులు... ఆర్భాటాలు ... ఎందుకు సృష్టిస్తున్నావని..?
నిరంతరం కుసుమాలును ఓదార్చుతునే ఉంటాను....
విసిరిన పూలు వాడిపొతే ఏంటీ ...
గుభాళిస్తున్న పరిమళాలుగా గుర్తుండిపొతారని...!
వేదనని వేడుకుంటునే ఉంటాను....
మౌన నిశ్వాసాల్ని వీడి...నవ విశ్వాసాల్ని మాలొ పెంపొందించమని....!
నీ గురించి ఆలొచిస్తుంటాను...
నాలొ నువ్వు సగం ... నేను సగం అన్నావు...
నాలొ నువ్వు లేని మిగత సగం ... నాకు మాత్రం ఎందుకని..!
ఇప్పటికి ముగింపంటే...
రేపటి ఆరంభం అనే స్పృహ ...
కొత్తగా ఉదయించిన నాడు...
పాత సూర్యుడు కొత్తగాను...
పాత భూమి అందంగాను...
పాత అమ్మ వింతగాను...
కనిపించడం మొదలవుతుంది....
ఉదయమవుతుంది... సూర్యుడు రాడని...
నిద్రొస్తుంది... స్వప్నం రాదని...
నిదురలేని నిట్టూర్పు రాత్రులే వేదననే...ఆలొచనలే...
అణగారిన గుండెల్లొ ఘెషగా వినిపిస్తుంది...
కళ్ళుతెరిచి చూసే లొగా...
పాతికేళ్ళు పరిగెత్తాయంటూ...
దారి ఎటొ వెతికే లొగా...
అర్ధ ఆయువు కరిగిందంటూ...చింతించకుండా...
గమ్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ...
తప్పుటడుగులను సరిచేసుకుంటూ...
ఉల్లాసపు హద్దుల అంచులను తాకిన వాడు...
ఎదుట మృత్యువు నిలబడిన సరే...
నవ్వుతూ కరచలనం చేసి...కలిసి నడిచి పొగలడు...
పరిమితులను ఛేదించడమంటే...
మనిషి విజయుడై వెళ్ళిపొతూ...
తన ఖాళీని వేరొకరి కొసం మిగల్చడమే... నేస్తం...జీవితం...
పగలుకీ..రాత్రికీ...మధ్య సరసాల అంచుదగ్గర...
విరహల...కొరికతొ.. మోకాళ్ల పైకి మడతపడిన లంగా
నిద్రలొనే సవరించుకుంటూ...కలలొ...కుర్రవాడి కౌగిలికి
సంశయిస్తూ...సమ్మతిస్తున్న...పడుచు పిల్లలా ఉందేంటీ ప్రకృతి...!
మంచు తెరలలొ తడిసిన చీకట్ల నడుమ...
అందానికి...యౌవనానికి...అవధిగా ఉంటూ...
అనుభూతి ...అస్ధిత్వం... సౌందర్యం...అధికం చేస్తూ...
చంద్రవంక విరిగి... పుడమి కట్టుకున్న తెల్ల చీర పై...
పుప్పుడులు రాలుస్తున్నట్లుందేటి ఈ రాకాసి వెన్నెల...!
తులసి కొట చుట్టు ఆనందపు దీపాలు వెలిగిస్తూ...
ప్రార్ధనాంతరం ప్రశాంత ప్రవిత్రతొ నున్న రాత్రిని...
రంపం పెట్టి కొసినప్పుడు రాలిన పొట్టులాగుందేంటి...ఈ వేకువ...!
చంధస్సు చీర కట్టి...భావం నిండిన రవిక తొడిగి ...
అలంకారపు కుచ్చిలతొ ముస్తాబవుతూ...
నిఖరమైన నెత్తుటితొ నిండిన సింధూరాన్ని కలంలొ నింపి ...
పలుచటి నా గుండె కాగితాల పై...
వొంపు సొంపులతొ జారవిడుస్తున్న అక్షర సుమాలన్నీ...
కవిత కన్యల్లా మారాయేమిటి...!
ఈ దిగ్ర్భాందపు ఆలొచనల హొరు ఏమిటి ...?
అణుక్షణం అతిశయం అన్పించే...
ఈ వర్తమానపు ఊహలేమిటి...?
నిలువనివ్వవూ...నిష్ర్కమించవు...!








