నాకు తెలీయనిదేదొ ఉందనుకునే బాల్యంలొ...


చిన్నప్పటి జ్ఞాపకంలా నా తలపుల్లొకి నువ్వొస్తున్నావు ఎందుకు...?

నయనంలొ అశృవే స్వప్నంగా మారుతున్న ఈ మునిమాపు వేళలొ...

మహిత రత్నరాశులగా మెరుస్తూ... నా గుండె వెనుక దాగుతున్నావెందుకు...?

నా నుండి కదిలిపొయే నీ ఆలొచనలు నన్ను ప్రశ్నిస్తూ...

జాలిగా చీకటిని ఆశ్రయిస్తున్నాయి...

నిద్రలొ నీ సొగసైన కలలు నన్నునిలదీస్తూ...

వెలుగులొ మౌనంగా మాయమవుతున్నాయి...

నిన్ను నువ్వే బంధించుకొని...నమ్మకాల సూత్రలలొంచి తప్పించుకొలేక...

కన్నీటి రూపంలొ...నా కళ్ళ నుండి జ్ఞాపకాలుగా జారిపొతున్నావు...

నా అంతరాంతర నిశేదిలొ ఏకాకిని చేస్తూ...

మది వాకిటన విడిచి మౌనంగా మరలిపొతున్నావు...

మంచి గంధాలను రాసుకుంటూ...మల్లెపూల మీద పడుకునే నీకేం తెలుసు...

నాలొ అణుచుకున్న రొదన రాత్రుల గురించి...!

ప్రలొభాలకు లొంగిపొతూ...మోహపు మాధుర్యంలొ తేలుతున్న నీకేం తెలుసు...

ఎన్ని విలువలు...ఎన్ని వెలుగులును కొల్పొయానో..!

మరక పడిన నమ్మకాన్ని చేరుపుకుంటూ...

మోజుపడిన ఆత్మను మోసుకుంటూ...

సుమనస్సుందర వసంతలొ ఉగాది కొసం అన్వేషిస్తున్నాను...




ఒకప్పుడు తన అమాయకమైన కళ్ళల్లొ...


ఆనందపు స్వప్నాలతొ కలకలలాడేవి...



బ్రతుకు పరుగులు తీసే ప్రవాహంలా సాగేది..


నేడు ఒంటరిగా ఎవరికొసమో ఎదురు చూస్తుంది...



నిట్టూర్పుల వేడితొ సెగలు రేపుతూ..


తన ఒంటరి వయస్సుకి చలి కాచుకుంటుంది...



దిగులుగా.. దీనంగా... పొగొట్టుకున్న దాన్నీ..


పొందాలనే ఆశతొ..



శూన్యం వంకా.. సుదీర్ఘ తీరం వంకా చూస్తున్నట్లుంది...


అందమైన ఆ కళ్ళు వెనుక ఉన్నఆగాధలలొ..



అంతులేని నీరీక్షణ...ఏదొ తెలియని ఆవేదన...


గుండెల్లొ గతాన్నీ... గడిపిన జ్ఞాపకాలనీ నింపుకొని...



గుప్పెట్లొ తనకే తెలిసిన రహస్యాలను దాచుకొని...


ఎవరి కొసమో చైతన్యపు అంచుమీద ఎదురుచూస్తుంది...



వ్యధా చిహ్నితమైన తన నేత్రాల క్రింద ఇంకా నలుపు చారలు చెరగలేదు...


చిన్నప్పటి ఆదర్శాలు ... అహంకారాలు ఇంకా నశించలేదు...



గుండెకు గుచ్చుకున్న తన జ్ఞాపకాల మువ్వలతొ...


తన జీవితం మీద తానే నిద్రపొయింది...



అందుకే నమ్మకు నేస్తం... నవ్వలేనివాడిని.. పువ్వులు చిదిమేవాడిని...!



కనురెప్పలు కాపలా కాస్తున్నా...

నీ కలలును ఆపలేకపొయింది...

నీ భావాలు ముట్టడిస్తున్నాయని తెలిసి...

నగ్నంగా ఉన్న నేత్రాలనూ...

ప్రతి రొజు కన్నీటి పొరలతొ కప్పుతుంది...

నేను ఊహించిన హృదంతర దృగంతర దివ్యత్వం..

నీ పిరికితనపు వాగురలొ చిక్కి...

నీ జడత్వపు నీలాలిలొ నవసి... నశిస్తుంది...

ధైర్యంగా నిలబడే దృక్పధం నీకు లేనప్పుడు...

వలచి ప్రయోజనం ఎందుకు...?


ఆదర్శాలతొ నిండిన ఆశయాలు నీకున్నప్పుడు...

నిట్టూర్పులతొ వేదనను మిగల్చడం ఎందుకు...?

కప్పుకున్న నిన్నటి కలల్నే తలుచుకుంటూ...

ముగింపులేని కధగా మిగిలిపొతున్నాను...

మరుగున పడిన నిన్నటి మాటలను చీల్చుకుంటూ...

అంతం లేని వ్యధతొ మరలిపొతున్నాను...

లొలొపల నవ్వుకుంటున్న నీ గర్వంతొ సమరాంగాన్నీ కొరుకుంటున్నావు...

నా మనొంగణంలొ నీవు వెలిగించిన తొలిదీపాన్నీ... నీవే ఆర్పేస్తున్నావు...!

మనొవ్యధని చేకూర్చే ఆలొచనలు...మనొగత భావాలలొ నలుగుతున్న నీ జ్ఞాపకాలు...

అనంతమైన నా ప్రేమకు ప్రతీకలని...ఎప్పుడు తెలుసుకుంటావు...!

నీ మౌనం అనే శాపం ఇచ్చే కన్న...మరణమనే శిక్షను విధించు నేస్తం...





ముసలిదైపొయింది...నా భరత ధాత్రి...



మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని...



ముసురుకున్న బాధల వానకారులొ



మసలుకొనే దెలా చివరికంటూ...



మసి బారిన చూపుతొ... ససి చెడిన రూపుతొ...



సాగర భ్రాత కెరటాల గుండె హొరులలొ



మోయలేని తన వయస్సుని తలచుకొని...



వేల యేళ్ళ బరువును దించమని...



తన సొదరుడైన సముద్ర సన్నిధిన



కన్నీరు పెట్టుకొని ఏడుస్తుంది...నా పిచ్చి ధాత్రి...



పచ్చని తన పడుచుదనం మీద వెచ్చగా పడిన



ప్రధమ సూర్యొదయాశ్లేషానికి పులకరిస్తూ...



నీలాల మోహన వస్త్రం దొలిచి...



మౌళి మీద హిమసుందర కిరీటం ధరించిన



ఆనాటి మహరాణి నా భరతదాత్రి...



నేడు ఈ పాడు నాగరికతలొ పాలిపొతూ...కాలుష్యానికి కరిగిపొతూ...



పాపత్ములకు పురుడు పొస్తూ...రుధిరంలొ తడిసిపొయింది...



ముడుచుకుని పొయిన తన వొడలి ముడతలను చూస్తూ...



భావ శూన్యురాలై మూగబొయింది...



నేను చూసాను...

నిజంగా ఆకలితొ అల్లాడి

మర్రిచెట్టు కింద మరణించిన ముసలివాణ్ణీ...

నేను చూసాను...

నిజంగా తల్లి లేక... తండ్రి లేక ఏడుస్తూ...

ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ...

మురికికల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలుణ్ణీ...

నేను చుసాను...

నిజంగా నిరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు

ప్రసవించి మూర్చిలిన దృశ్యాన్నీ....!

నేను చూసాను...

నిజంగా పిల్లకు గంజికాసిపొసి... తాను నిరాహారుడై...

రుద్ధబాష్పాకులిత నయనుడైన వృద్ధుడను...

నేను చూసాను...

నిజంగా... దైన్యాన్ని.. హైన్యాన్ని...

క్షుభితాశ్రు కల్లొలనీరధుల్ని... శవాకారవికారుల్ని....

నేను చూసాను...

క్షయగ్రస్త భార్య ఇక బతకదని...

ప్రచండ వాతూల హత నీపశాఖవలె

గజ గజ వణికిపొయిన ఆరిక్త...అశక్త గుమాస్తాని...

అయిదారుగురు పిల్లల గలవాణ్ణీ....

ఇది ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి...?

ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి?




నన్ను నిర్బంధించకు నేస్తం...


ఈ రాత్రిని ఇక చూడలేను...


కృత్రిమ వేషాన్ని అభినయింపలేను..


మానవత లేని లొకాన్ని స్తుతింపలేను...


మానవునిగా శిరసెత్తుకు తిరగలేను...


ఈ నాగరికతారణ్యవాసం భరించలేను...


ఒక్క నిరుపేద వున్నంతవరకు...


ఒక్క మలినాశ్రు బిందు వొరిగినంత వరకు....


ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు...


ఒక్క శుష్కస్తస్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంత వరకు....


ఒక్క తల్లి నీరవాక్రొశ రవమ్ము విన్నంత వరకు...


ఒక్క క్షత దు:ఖిత హృదయ మూరడిల్లనంత వరకు...


నాకు శాంతి కలగదింక నేస్తం... నేను నిగర్వినైనాను...


ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను...


ఈ గుండె గూడుపట్లు ఎక్కడొ కదలినవి...


ఈ కనులు వరదలై పారినవి...


ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి...


ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు...?


ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు?


ఏ భొగవంతుని విచలింప చేయగలదు?


ఏ భగవంతునికి నివేదించు కొనగలదు...?

;;