నా జ్ఞాపకాల నెమలి కన్నుకు... జీవం లేకపొతే ఏంటీ....
3 comments Posted by బుజ్జి at 6/28/2011 10:25:00 PMవెన్నెలనీ వేడెక్కించే నా చూపుల నిట్టూర్పులు...
శూన్యంలో మిగిలిపొతే ఏంటీ....
నీ వలపుల దూరాన్నీ ముడివేసుకున్న...
నా హృదయ స్పందన ఎప్పుడూ...నీకు విన్పిస్తూనే ఉంటుంది.... !
నా జ్ఞాపకాల నెమలి కన్నుకు... జీవం లేకపొతే ఏంటీ....
పాత పుస్తకం పేజీల మధ్యప్రత్యక్షం అయినపుడల్లా... నీ కధ చెప్పుతూనే ఉంటుంది...!
కదులుతున్న గడియారం శబ్దంతో... అసంతృప్తిగా ఆగిపొయే కధకు...
ముగింపు మరణమని తెలిసినా కూడా....
ఎందుకో ఆ పుస్తకం తెరవాలనిపిస్తుంది... మళ్ళీ మళ్ళీ నీ కధే వినాలనిపిస్తుందిరా....
కార్తెలు కరిగిపొతున్న.... కారు మబ్బులు కరగట్లేదు....
0 comments Posted by బుజ్జి at 6/22/2011 08:54:00 PMకార్తెలు కరిగిపొతున్న.... కారు మబ్బులు కరగట్లేదు....
రుతురాగం లయ తప్పుతున్న... రైతు యాగంలో భయం పోవట్లేదు...
మైమరిపించాల్సిన తోలకరి .... మురిపించుకుంటుంటే...
ఆదుకోవల్సిన వర్షాసంధ్యని .... భూమాతపై అలుగుతుంటే...
స్తబ్ధతతో నిండిన నింగికి .... అన్నదాత ఆశా కర్పూర దీపాల్ని వెలిగిస్తున్నాడు...
భస్మీకృత ధాత్రిని కరుణించమని....చేతుల్ని జోడిస్తున్నాడు....
చిరుగంధ సువాసనలతో నిండాల్సిన ధరిత్రి....నేడు...
ఆకాశ ద్వారం దాటని చినుకులకై.... దృవగళాలెత్తి ఏడుస్తుంది....
పచ్చని పుడమిపై పగుళ్ళు చూడలేక....
జారిన అశృవులతో... ఎండిన పంటను తడపలేక....
ఈ విశాల గగనం మీద... గడిచిన శిశిరాన్ని తలచుకుంటూ...
ఆలోచనాంధకారంలో ఆకలిని ఆవిరిచేస్తున్నాడు....
దిక్కు... దిక్కుకు స్వాగత తోరణం కడుతూ...
చీకటి గదిలో మూల్గుతున్న ఆశను... రొజు తట్టి లేపుతూ....
కురియని వానలకు....తడవని హృదయంగా మిగిలిపొతున్నాడు....
అందుకే ....రా...
గతించిన కాల చరిత్రలో....అదృశ్యమైన మా జీవితశాఖలపై నిండిన....
మగత మేఘాల తెరలను తొలగిస్తూ....రాజర్షిలా... నిశ్శబ్దంగా వర్షించు....
దిగ్ర్భాంతంతో... బీడువారిన మా మదిపై...దేవర్షిలా....చిరుజల్లులను కురిపించు...
మీ రేవా....