మనిషికి మనసే లేనప్పుడు....


రాని మార్పుకు మూహర్తమెందుకు ?



మనసులో మమతలే లేనప్పుడు...


మేమున్నామంటూ మాటలెందుకు ?



సాయం చేసే హృదయమే లేనప్పుడు...


పెట్టెల నిండ డబ్బులెందుకు ?



చేసే పనిలో స్పష్టత లేనప్పుడు....


రాత్రి కలల్లో మేడలెందుకు ?



నీతికి కాలం లేనప్పుడు....


నీతిమంతుడికీ జననమెందుకు ?



ఆలోచనలో అందం లేనప్పుడు....


దేహం పై రంగులెందుకు ?



కన్నీటిని తుడిచే చేయి లేనప్పుడు...


కపట ప్రేమతో కల్మషమెందుకు...?



ప్రేమించే అంతరాత్మ లేనప్పుడు...


ఛీ.... వ్యర్ధమై ఈ నీ బ్రతుకెందుకు...!




మరుగుతున్న నా రక్తంతో ఈ సమాజాన్నీ మార్చలేను...


చేవ లేని నా చేతులతో ఈ అవినీతిని కడగలేను...


రాలుతున్న నా కన్నీటి చుక్క ఓ శోకాంజలి అయితే...


ఓటమితో... న్యాయం ఒంటరిగా మిగిలితే...


పిడికెడు బూడిదలో....ఈ దర్మం...


దిక్కు తోచక...ఈ సమాజం... దిగంతాల నీడల్లో తలదాచుకుంటుంది ...


గత చరిత్ర జ్ఞాపకాలుగా మట్టిపొరల్లో మిగిలిపొతుంది....


కమ్ముకున్న భయాన్నీ.. ధైర్యంతో చేదిద్దాం...!


నిరాశతో ప్రశ్నించే కన్నీటిని... గెలుపుతో తుడిచేద్దాం... !


భయమైరుగని నీ మది ఆయుధమైతే...


నీరాశతో నిండిన నిశ్శబ్దపు శిలలను కరిగించు...!


కసితో కూడిన కృషి నీ రధమైతే...


గెలుపును సారధిగా గుండెల్లో ధ్వనించు....!


ఉదయిస్తున్న సూర్యుడుని చూడు...


వాలిపొతున్న సంజ వన్నెల బానుడుని కాదు...!


అరవిరిసిన వెండి వెన్నెలను చూడు...


కరగు మబ్బుల్లో కృంగిపోతున్న చంద్రుడిని కాదు...!


విజయ దరహాసం...నీ మెడలో గొలుసులుగా కదిలినప్పుడు...


చెమ్మగిల్లిన చూపు... వెచ్చని రెక్కలుగా విచ్చుకున్నప్పుడు...


మొదలు పెట్టిన నా తొలి ప్రయత్నం... మరో మార్పుకు నాందవుతుంది.....


కడతేరని నా కలల ప్రయాణం... కోటి నిజాలకు వారధిగా నిలుస్తుంది...


గడిచిన ప్రతి క్షణం నీ జ్ఞాపకాలుగా మారుతుంటే...


కరిగిన కాలం లతాంతాలుగా మారి నీకు అభిషేకిస్తుంటే...


ఒంటరి తనాన్ని అంతం చేసే నీ తలపులు....నా గతాలుగా మిగిలిపొతుంటే...


తీరలేని నా ఆశల వెనుక తిరిగి రాని ఆ రోజులును ఏలా లెక్కపెట్టను...!


మౌనమేరుగని నా మదికి మాయ మాటలతో ఏలా బుజ్జగించను.....!


అర్పించిన నా మనసు అపార్ధాల అగ్నిలో దగ్ధమవుతుంటే...


గుండెలో విషాదాన్నీ మిగులుస్తూ...నిశ్శబ్దపు అడుగులతో...


పయనమైన నీకేం తెలుసు...నేస్తం... నన్ను వదలని నీ తలపుల విలువ ఏంటో... !


హృదయంలో అనుభూతులుకు ఆకారం కల్పించలేక...


జన్మకు చాలని ఆవేదననీ అంకితమిస్తూ....


విషపు చిరునవ్వుతో నిర్లీప్తంగా వెళ్ళిపొయే నీకేం తెలుసు...


కడకు రాని నీ కదలిక విలువ ఏంటో...!


నీలో ఆశ ఆకాశమయినప్పుడు నేను ఎక్కడుంటే ఏంటీ?


మనసులో స్వచ్ఛత శూన్యమయినప్పుడు నువ్వు ఎవ్వరైతేనేంటీ?


చెదిరిన కేశాలతో... నలిగిన హృదయంతో...


ఆత్మల్ని వదిలేసి...జీవత్సవంలా... అస్తమించగలను కానీ....


అబద్దపు అనుబంధాలతో... కారణాల్ని అన్వేషిస్తూ...


నిశ్చలంగా కాలాన్నీ మాత్రం వెళ్ళదీయలేను....


కాంక్షా నీహారాల ఆశాసూర్యుడు ప్రతిఫలింపక...


గుండెల్లో చిరిగిన స్వప్నపు సంచుల్నీ దూర తీరాల దారాలతో సవరిస్తూ...


ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరీమళాలు కోసం అన్వేషిస్తున్నాను....

;;