మనిషికి మనసే లేనప్పుడు....
రాని మార్పుకు మూహర్తమెందుకు ?
మనసులో మమతలే లేనప్పుడు...
మేమున్నామంటూ మాటలెందుకు ?
సాయం చేసే హృదయమే లేనప్పుడు...
పెట్టెల నిండ డబ్బులెందుకు ?
చేసే పనిలో స్పష్టత లేనప్పుడు....
రాత్రి కలల్లో మేడలెందుకు ?
నీతికి కాలం లేనప్పుడు....
నీతిమంతుడికీ జననమెందుకు ?
ఆలోచనలో అందం లేనప్పుడు....
దేహం పై రంగులెందుకు ?
కన్నీటిని తుడిచే చేయి లేనప్పుడు...
కపట ప్రేమతో కల్మషమెందుకు...?
ప్రేమించే అంతరాత్మ లేనప్పుడు...
ఛీ.... వ్యర్ధమై ఈ నీ బ్రతుకెందుకు...!
2 Comments:
-
- చిలమకూరు విజయమోహన్ said...
Monday, 27 December, 2010చక్కటి అక్షర మధనం.- astrojoyd said...
Monday, 27 December, 2010Dr.ci.na.ray raasina"parulakosam paatupadani"-ane ghazalki anukaranaalaa undi,mee kavitha.
Subscribe to:
Post Comments (Atom)