మరుగుతున్న నా రక్తంతో ఈ సమాజాన్నీ మార్చలేను...


చేవ లేని నా చేతులతో ఈ అవినీతిని కడగలేను...


రాలుతున్న నా కన్నీటి చుక్క ఓ శోకాంజలి అయితే...


ఓటమితో... న్యాయం ఒంటరిగా మిగిలితే...


పిడికెడు బూడిదలో....ఈ దర్మం...


దిక్కు తోచక...ఈ సమాజం... దిగంతాల నీడల్లో తలదాచుకుంటుంది ...


గత చరిత్ర జ్ఞాపకాలుగా మట్టిపొరల్లో మిగిలిపొతుంది....


కమ్ముకున్న భయాన్నీ.. ధైర్యంతో చేదిద్దాం...!


నిరాశతో ప్రశ్నించే కన్నీటిని... గెలుపుతో తుడిచేద్దాం... !


భయమైరుగని నీ మది ఆయుధమైతే...


నీరాశతో నిండిన నిశ్శబ్దపు శిలలను కరిగించు...!


కసితో కూడిన కృషి నీ రధమైతే...


గెలుపును సారధిగా గుండెల్లో ధ్వనించు....!


ఉదయిస్తున్న సూర్యుడుని చూడు...


వాలిపొతున్న సంజ వన్నెల బానుడుని కాదు...!


అరవిరిసిన వెండి వెన్నెలను చూడు...


కరగు మబ్బుల్లో కృంగిపోతున్న చంద్రుడిని కాదు...!


విజయ దరహాసం...నీ మెడలో గొలుసులుగా కదిలినప్పుడు...


చెమ్మగిల్లిన చూపు... వెచ్చని రెక్కలుగా విచ్చుకున్నప్పుడు...


మొదలు పెట్టిన నా తొలి ప్రయత్నం... మరో మార్పుకు నాందవుతుంది.....


కడతేరని నా కలల ప్రయాణం... కోటి నిజాలకు వారధిగా నిలుస్తుంది...

2 Comments:

  1. విజయ్ అనంగి said...
    vah...! kallu therichela vuindi mee kvitha. kapatanni... sutiga shoot cheesaru... modatisariga choosa mee blognu ...chedunu dahiche pannilo chintha nipplla segalu kkutunnai
    విజయ్ అనంగి said...
    vah...! kallu therichela vuindi mee kvitha. kapatanni... sutiga shoot cheesaru... modatisariga choosa mee blognu ...chedunu dahiche pannilo chintha nipplla segalu kkutunnai

Post a Comment