నాలొ ఉన్న నమ్మకానికి...
నన్ను నడిపించే ధైర్యానివి నువ్వేనని ఎలా చెప్పను...?
నాలొ ప్రతి శ్వాసకి ....
నేను బ్రతికున్నది నీ ఆశతొనేనని ఎలా తెలుపగలను...?
నీ పేరు పలకాలనే పెదవులకి...
నా చిరునవ్వే నువ్వని ఎలా చెప్పను...?
నిన్ను ఆర్తిగా వెతికే నా చూపులకి...
నా కంటిపాపే నువ్వని ఎలా చెప్పను...?
మదన పడుతున్న నా మదికి....
నా మనసాక్షివే నువ్వని ఎలా చెప్పను...?
నీ ఆలొచనల్లొ తెలుతున్న నా ఊహలకి...
కంట పడని నా ప్రాణం నువ్వని ఎలా చెప్పను....?
నా అంతర్మధనంలొ నలుగుతున్న నీ ప్రతి జ్ఞాపకానికి...
నా గుండెచప్పుడు నువ్వని ఎలా తెలుపను....?
నిశేదిని పాలించు నిశ్శబ్దనికి....
తడబాటుతొ నిండిన ఈ హృదయ ఎడబాటుని ఎలా చెప్పను...?
స్నేహితులుగా మనం కలిసి గడిపిన కాలనికి...
నీ మీద నాకున్నది ప్రేమే అని ఎలా చెప్పగలను...?
4 Comments:
-
- Siva said...
Friday, 19 February, 2010superbbbbbbbbbb Boss keka ..... nijam ga chala chala baga vrasavu... inthaki aa bangaram evvaro memu telusukovachaaaaa?????- దేవకీ said...
Friday, 19 February, 2010రేవా మీ కవిత చాలా బాగుంది... మంచి భావంతొ వ్రాసారు...ఆ అదృష్టవంతురాలు ఎవరొ మేము తెలుసుకొవచ్చా...?- విమల said...
Friday, 19 February, 2010బాగుందండి ... మీ కవిత.... మంచి లైనింగ్ తొ చాలా బాగా వ్రాసారు....- వామనరావు said...
Friday, 19 February, 2010రేవా చాలా రొజులకి మళ్ళీ మీ కవిత చదువుతున్నాను... నీ పదాల అల్లిక నిజంగా అద్భుతం బాబు...నీకు మంచి భవిష్యత్ వుంది...
Subscribe to:
Post Comments (Atom)