మౌనంతొ మాటలు కరువైన రోజులుకి దూరం గా...
నాలొ నేనే మట్లాడుకుంటూ...
నన్ను నేనే ఓదార్చుకుంటూ... గడిపిన క్షణాలను మరచి పొతున్నాను...
చిక్కటి నిషేదిలొ ఉలిక్కి పడిన నా కళ్ళలొకి...
అంధకారమైన భవిష్యత్తుని చూస్తూ....
ఆవేశంతొ రగులుతున్న నా గుండె చప్పుళ్ళకి లయగా ...
విర్రవీగుతూ...వికృత నాట్యంతొ సాగిపొతుంది కాలం గానుగెద్దులా....
ఉదయం కోసం ఎదురు చూసినా నా బ్రతుకుని వికటాట్టహాసం చేస్తూ...
నిదుర లేని చీకటి రాత్రులనే మిగిలుస్తూ.. వెళ్ళీపొతుంది విధి విలాశంగా...
సమస్యల శృంఖలాలును తెంచుకొని బాహ్య ప్రపంచం లోనికి అడుగు పెట్టాను....
ఎటు వైపు చూసినా... పచ్చిక బయళ్ళతో ప్రపంచం కళకళలాడుతోంది...
చల్లగాలుల పలకరింపులతో... మేను పులకరిస్తుంది....
చీకటి గుహలకు దూరం గా...
నాలుగు గోడల మధ్య బందీ గా ఉన్న రొజులని మరచి పోవాలని...
విజయాల వెలుగు రేఖల వైపు అడుగులు వేస్తూ...
భయాలన్నిటినీ ధైర్యంతొ విచ్చుకున్న కత్తులకు బలి ఇస్తూ...
చైతన్య వర్ణాల నిండిన... స్వేఛ్ఛా లొకం లోకి పరిగెడుతూనే వున్నా....
మలి సంధ్య వెలుగులను నింపిన దీపాలకొసం....పులకించే పుష్యరాగాలుగా...
4 Comments:
-
- హను said...
Tuesday, 23 February, 2010good one bujji,chala bagumdi- Hima bindu said...
Tuesday, 23 February, 2010చాలా చాల బాగుంది .- Vasanth said...
Tuesday, 23 February, 2010Superrrrrrrrr boss kekaaaaa laa vrasavu...... amazing.......- దేవకీ said...
Wednesday, 24 February, 2010చాలా బాగుంది రేవా... చాలా అద్భుతంగా మలిచావు... పదాల అల్లిక చాలా చాలా బాగుంది...