నాటి నా భాగ్యనగరం:-
చారిత్రాత్మక ప్రదేశాల కేంద్రబిందువు నా భాగ్యనగరం....
సభ్యమత సమైక్యతకి చిరునామా నా భాగ్యనగరం....
వలస వచ్చిన ప్రజలను ఓడిలో దాచుకున్న భూమాత నా భాగ్యనగరం...
పొట్టకూటికోసం వచ్చిన వారికి ఆకలి తీర్చిన మాతృమూర్తి నా భాగ్యనగరం....
సాగరన్ని గుండెలో దాచుకున్న సౌదర్యపు సొగసరి నా భాగ్యనగరం....
నేటి నా భాగ్యనగరం:-
పెద్దపెద్ద భవనాల పునాధులను గుండెలొ గుచ్చుకుంటుంది నా భాగ్యనగరం....
పేదప్రజలకు గజం భూమి అందనంత ఎత్తుకెగసింది నా భాగ్యనగరం....
ఉగ్రవాదుల అగ్రనిలయం నా భాగ్యనగరం....
క్షణక్షణం భయాందోళనలో మునిగిపొయింది నా భాగ్యనగరం....
కులమతాల చిచ్చులో మండిపోతుంది నా భాగ్యనగరం.....
ఘడియ ఘడియకి పేలుతున్న బాంబులతో భగ్గుమంటుంది నా భాగ్యనగరం.....
నాడు అది భాగ్యనగరం నేడు అది దౌర్భాగ్యనగరం.....
4 Comments:
Subscribe to:
Post Comments (Atom)
యదిమర్శిన భాధలన్ని తిరిగితోడినౌ గదయ్యా – నీలాగ సక్కంగ అలోచించెటోల్లు కరువైండ్రిప్పుడు హైదరాబాదుల.
అప్పుడున్న సమైఖ్యతా నడవడిక ఇప్పుడ్లేకచ్చింది. మిలమిల మెరిసే దయ్యలంజూసి అభివృద్దనుకుని సంకల్గొట్టుకుంటాన్రిప్పుడు. ఈ పబ్లిక్కెప్పుడు సమజైతదో.