మరువలేని నీ జ్ఞాపకాలు విరులుగ వికశిస్తుంటే...
గడిపిన గతస్మృతులను ఎలా మరువగలను?
నీ విరహమే నా బాధకు హేతువవుతుంటే
నీ మననముతొ మనసు అనుక్షణం పడే క్షొభను ఎలాచెప్పను...
సుగుణ స్వరూపమైన నీపై ....
నిర్గుణ స్వరూపమైన ఈ ఆలొచనల వర్షమేమిటి ?
సాత్త్వికగా విరిసిన నా అక్షులతొ...నీ రాకకై....పిపాసగా ఎదురు చూస్తుంటే...
యుక్తయుక్తములు కాంక్షించక... కొపొద్దీపితురాలవై...
మనొవ్యాకులతకు గురిచేసే ఆ చూపుల మౌన ప్రబొధాలేమిటి?
అమేధ్యాపు ఆలొచనలతొ...నిష్ఫలమైన సఖ్యత్వాన్ని నటిస్తూ...
అనన్యమైన నా చెలిమిని...నీ దుర్గుణంతొ వ్యతిరేకిస్తున్నావు....
ఇన్నాళ్ళు నీ అన్వేషణలొ తత్పరుడైన ఉన్నందుకు ప్రతీకగా....
ఎడబాటును నాకు భూషణంగా బహుకరిస్తున్నావు....
సజీవ ప్రతిమగా ఉన్న తనువు పై ముముక్షుత లేదు...
ఇరువురం ఏకాత్మభావంతొ చేసుకున్న బాసలను మరిచి...
మరణ మృదంగానికి మాటులు వేస్తూ...
ఊహల సంద్రంలొ సమసి పొమ్మని ప్రేరేపిస్తున్నావు....
అజ్ఞానమనే మగతతొ నిండిన నీ పేరాసతొ నన్ను తృణీకరిస్తున్నావు.... ఇది న్యాయమా...!
నీ కవిత నిజంగా హృదయాన్ని హత్తుకునేది గా వుంది... నా గత స్మృతులను గుర్తుకు చేస్తుంది.... పదాలు అల్లిక చాలా బాగుంది... కష్టతరమైన పదాలను ఉపయోగించారు...