కలవర పాటుకు గురిచేసే వెలుతురు కన్నా... కలలను బ్రతికిస్తూ సేదతీర్చే చీకటంటే ఇష్టం...

ఆశలను ప్రేరేపించే గెలుపు కన్నా... నిరాశ కలిగించే ఓటమంటే ఇష్టం...

వెన్నెల పంచే చంద్రుడు కన్నా... భగ భగ మండే సూర్యుడంటే ఇష్టం...

దాహన్ని తీర్చే నీటి చుక్కల కన్నా... బయటకు విరజిమ్మే చెమట చుక్కలంటే ఇష్టం...

ఆనందం కల్గించే సుఖ:ల కన్నా... నిరాశకు గురిచేసే కష్టాలంటే ఇష్టం...

దిగులుతొ కుంగి పొయే భయం కన్నా... ఎదురు తిరిగి పొరాడే ధైర్యమంటే ఇష్టం...

ఆహ్లదంతొ ముంచేత్తే సంద్రం కన్నా... విలపిస్తూ జాలువారే కన్నీరంటే ఇష్టం...

జనన మరణాలకతీతుడైన భగవంతుడు కన్నా...

సమస్యల చక్రాన్ని తిప్పుతూ సాగిపొయే సామాన్యుడంటే ఇష్టం...

కొత్తగా పరిచయం చేస్తున్న జననం కన్న... పాత జ్ఞాపకాలను సమాధి చేసే మరణమంటే ఇష్టం...

పనికి రాని పొగత్తల కన్నా....కృంగదీసే విమర్సలంటే ఇష్టం...

అలంకరంతొ అందాన్నిచ్చే బంగారం కన్నా... మమకారాన్ని పెంచే మాంగళ్యమంటే ఇష్టం...

నయవంచన చేసే ప్రియరాలు కన్నా... మురిపంతొ తినిపించే మాతృమూర్తంటే ఇష్టం...

నమ్మక ద్రొహం చేసే స్నేహితులు కన్నా...

నన్ను నేనే ఓదార్చుకునే ఒంటరితనమంటే మరి మరి ఇష్టం...!

4 Comments:

  1. రాంగోపాల్ said...
    బాగుంది.
    దేవకీ said...
    చాలా చాలా బాగా వ్రాసావు... సూపర్..... నీకు ఎలా వస్తున్నాయి రేవా ఇలాంటి మంచి మంచి పదాల అల్లిక... మంచి భావంతొ వ్రాసావు..
    సృజన said...
    మీ కవిత చాలా బాగుంది...
    వామన రావు said...
    నువ్వు కవితకు జీవం పొస్తున్నావు... చాలా బాగుంది నాన్న....

Post a Comment