జీవితం అనుభవాల మూట...
భావలు అవ్యక్తవ్యక్తంగా...నీ ముందు గెంతులేస్తునప్పుడు...
సమాధి చేయబడ్డ కొరికలు...నీ ముందు సాక్షత్కరిస్తున్నప్పుడు...
దేన్నీ సాధించలేననే అసంతృప్తి...నీ ముందు నాట్యం చేస్తున్నప్పుడు...
నీలొ ఉత్సహన్ని నింపే ఆయుధం...అమ్మ...
నీతికి నిదర్శనం...త్యాగానికి ఆకారం...
సత్యానికి ఆదర్శం...ప్రగతికి సొపానం...
స్నేహనికి ప్రతిబింబం...విజయానికి ఓంకారం...అమ్మ...
తొలి పలుకులకు గర్వపడుతూ...తప్పటడుగులకు మురిసిపొతూ...
తప్పుటడుగులను సరిచేస్తూ...
నీ నవీన జీవన గమనానికి బాటలు వేసే మార్గదర్శి...అమ్మ...
గుండెలొని రాగాన్ని...మమతానుబంధాలతొ అల్లీ...
నిదురరాని ఘడియలలొ... అనురాగంతొ నిండిన జొల పాట పాడుతూ...
నిశేదిని పాలించు నిద్రసీమను ... నీ కంటి దరికి ఆహ్వనిస్తుంది...
కలతలన్ని మరచి....కలల దొంతరల్లొ తేలిపొమ్మంటుంది...
దూరమున్న ఆ పేగు బంధం... ఓ పలకరింపు కొసం తపిస్తూ...
ఓ చిన్న మాటకై ఎదురు చూస్తుంది...
అనుక్షణం నీ వెంటే ఉన్నానంటూ...మదికి ధైర్యాన్నిస్తుంది...
నిరాయుధ సిపాయిలా కష్టాలను శాసిస్తూ...
జీవన పొరాటంలొ నిగ్గు తేలిన బలశాలి... అనుభవ శాలి... అమ్మ...
జీవన పొరాటంలొ నిగ్గు తేలిన బలశాలి... అనుభవ శాలి... అమ్మ..
ఈ కవితా పాదాలు కొత్తగానూ, మనసును హత్తుకునేట్టుగా వున్నాయి.
అక్షరాల ఫాంట్ సైజ్ పెంచితే చదవడానికి బాగుంటుంది. గమని౦చగలరు.
chala bagundi friend ... maa ammanu chaduvutunnatlu vundi... nee kavitha chaduvutunatlu ledhu... its really heart touching ....