యుగయుగానికీ స్వభావం మారుస్తున్నాడు...
కన్పించని ప్రలొభాలకు మనిషి లొంగుతున్నాడు...
నాడు జాతికి... ప్రగతికీ కనబడని విపత్తులు...
మన వేషభాషలు.. మన సంస్కృతులు...
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తున్నాయి...
నేడు పరభాషకు... మన భాషకు వచ్చే మార్పును
ఈ జగత్తు...సిగ్గిలిన సొగకళ్లతొ కొత్త భాషలొ అక్షరాలను మౌనంగా దిద్దుతుంది...
ఏ దేశ భాష అయినా ఏనాడు కాదొక స్ధిరబిందువు...
నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు...
భాషకు ఆదర్మాలు లేవు.. ఆశయాలు లేవు...
పరభాష ధూళిని చల్లుతూ...మన భాషను మలినం చేసుకుంటూ...
సంతత ప్రకాశంగా వెలిగే తెలుగునూ...
దీపపు చీవర నిప్పు నలుసులా అర్ధవిహీనంగా ఆపేస్తున్నాము...
ఎదురపడిన వాళ్ళను పరభాషలొ పలకరిస్తే...వైభవమని గర్వపడుతూ...
పాశ్చత్య నాగరికత నగ్నత్వంలొకి చూస్తూ....
మారుతున్న పర సంస్కృతి సుందరిని కౌగిలించుకుంటున్నాము...
ఇన్నేళ్ళ తర్వాత...
శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పుని గుర్తుకు తెస్తొంది ....
ఎవరు ప్రత్యూషపవనాలలొ మన జాతి గౌరవాన్ని... లతాంతాలుగా వెలిగిస్తారు...?
ఏ అక్షాంశరేఖలమీద నిలిచి.. దిగాంతాలకు మన తెలుగు కీర్తిని చాటుతారు...?
మళ్ళీ మంచి రొజులు రావాలని...
పాత బట్టలుగా మూట కట్టిన మన తెలుగు పరువుప్రతిష్టలను...
ఒక స్మృత్యాగ్ని కణంలా నలుదిక్కులలొ వెలిగిస్తూ...
నిశ్మబ్ద నదీతీరాలలొ పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ నిలవాలని ఆశీస్తున్నాను....
దీపపు చీవర నిప్పు నలుసులా అర్ధవిహీనంగా ఆపేస్తున్నాము...
ఎదురపడిన వాళ్ళను పరభాషలొ పలకరిస్తే...వైభవమని గర్వపడుతూ...
పాశ్చత్య నాగరికత నగ్నత్వంలొకి చూస్తూ....
మారుతున్న పర సంస్కృతి సుందరిని కౌగిలించుకుంటున్నాము...
"రేవా గారు చాలా చక్కగా చెప్పారు... తెలుగు భాష గురించి చక్కగా వివరించారు...మీ కవితలో నేటి సమాజం స్ఫష్టంగా కనబడుతుంది..."
ఒక స్మృత్యాగ్ని కణంలా నలుదిక్కులలొ వెలిగిస్తూ...
నిశ్మబ్ద నదీతీరాలలొ పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ నిలవాలని ఆశీస్తున్నాను....
సూపర్ లైనింగ్ చాలా బాగా వ్రాసారు.... మీ కవితలు అన్నీ ఈ రొజు చదివాను... ఇన్నాళ్ళు మీ కవితలను చదివే అదృష్టాన్ని కొల్పోయానని అన్పించింది రేవా గారు.. మీ కవిత సరళీ తిలక్ గారిని గుర్తు చేస్తుంది....