నా అక్షరాలు...జాజిపువ్వుల అత్తరు దీపాలలో...


మంత్ర లొకపు మణి స్తంభాలలో...


నాకే తెలియని సుందర విచిత్రాలు...


నిశ్శబ్దంగా... కన్నీటి కలం నుండి జారుతూ...


మది కాగితం మీద కదులుతున్నాయి...


నా అక్షరాలు...విరహ నిద్రా పరిష్వంగంలొ...


చీకటి నవ్వుల్లొ వెలుతురు చిందీస్తూ...


వాకిట నవ్విన వేకువలొ తులసిని చిగురీస్తూ...


కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలుగా...


ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలుగా...


వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా...


వెండి కెరటాలలో... చందనశాలా చిత్రాలుగా...మారుతున్నాయి...


ఇది అంతా నీ మాయే కదా నేస్తం..!

4 Comments:

  1. అపర్ణ said...
    చాలా బాగుంది
    Anonymous said...
    very Nice...good attempt...
    నర్మద said...
    నా అక్షరాలు...విరహ నిద్రా పరిష్వంగంలొ...
    చీకటి నవ్వుల్లొ వెలుతురు చిందీస్తూ...
    వాకిట నవ్విన వేకువలొ తులసిని చిగురీస్తూ...
    కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలుగా...
    ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలుగా...
    వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా...
    వెండి కెరటాలలో... చందనశాలా చిత్రాలుగా...మారుతున్నాయి...


    రేవా గారు బాగున్నారా... చాలా రొజులుకి మళ్ళీ మీ కవితలు చదువుతున్నాను...సూపర్...
    అనిత said...
    చాలా బాగుంది మిత్రమా... మీ ఫొన్ నెంబరు ఉంటే... కొంచెం మీ బ్లాగు లొ పెట్టండి.. మీతొ మాట్లాడాలని ఉంటుంది...

Post a Comment