మరణిస్తున్నాను మన్నించు నేస్తం....

శరీరంతో అనుక్షణం...మనసుతో ప్రతిక్షణం ...

నేడు రేపుల మధ్య నలుగుతున్న...నీలి ఘటనా దృశ్యాల మధ్య ...

ఒంటరిగా నేను..అచేతనంగా.. నవ్వుకుంటూ...

మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

స్వప్నాలు ఆగిపొతున్నా...కెరటాలు కదలనంటున్నా ...

ఆదర్శం అణగనంటున్నా ... నాకంటూ ఎవ్వరు మిగలనంటున్నా...

ఈ మానసిక ప్రయాణం ...శబ్ద సమూహాల వద్ద చేరి ...

ఆత్మసంఘర్షణల మధ్య ..కన్నీటితో...

మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

ఆనందం కోసమో ..అనురాగం కోసమో...

సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో...

మధ్య మధ్య మండుతున్న ఈ విశ్రాంతి భరించలేక....

నిత్యం నన్ను తగలబేడుతున్న వెలుగు కంటే...

కళ్ళు కనిపించనంత చీకటే నయమనిపిస్తుంటే...

తట్టుకోలేక మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

జననానికి మరణానికి నడుమ మిగిలేది...

ఒకే ఒక కన్నీటి పంక్తి మాత్రమే...

నలుదిక్కులనుండి చేయి చాస్తున్నది...

ఎపుడో ఒక నాటి నవ్వు మాత్రమే...

అందుకే...

దేన్నీ ఆహ్వానించలేక...అలాగని త్యజించలేక...

నాలో ఉన్నా నీతో బతికే ధైర్యం లేక...

మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

6 Comments:

  1. చెప్పాలంటే...... said...
    baavundi
    మనసు పలికే said...
    చాలా బాగుందండీ మీ కవిత..
    >>మధ్య మధ్య మండుతున్న ఈ విశ్రాంతి భరించలేక....
    నిత్యం నన్ను తగలబేడుతున్న వెలుగు కంటే...
    కళ్ళు కనిపించనంత చీకటే నయమనిపిస్తుంటే...
    నిజమే చాలా సార్లు అలాంటి చీకటే నయమనిపిస్తుంది..
    కొత్త పాళీ said...
    huh??
    నర్మద said...
    చాలా లొతుగా ఉంది రేవా... నిజ జీవితానికి చాలా దగ్గరగా వ్రాసారు... నీకు సాటి ఎవరు చెప్పు... నీ కవితలతొ మమ్మల్నీ ఆనందింపజేస్తున్నావు...
    Padmarpita said...
    ఎలా మిస్సయ్యాను ఇంతమంచి కవితను????
    manasulomatacheppana said...
    Sowjnaya said
    మిస్సయ్యాను ఇంతమంచి కవితను............

Post a Comment