స్త్రీ!!!


చిన్నప్పట్నుంచి వింటున్న పేరు...


కట్నం కుమ్ములాటలో.... ప్రేమ పేరు తో మరిగే విష కషాయం లో కరిగి....


సగం తిన్న కలల్ని నెమరేస్తూ... సగం చచ్చిన ప్రాణాల్ని జొకొట్టుకుంటున్నావు...!!!


కష్టాల బాధలలొ...బ్రతుకు సమరంతో కాంక్షా నీహారాల ఆశాసూర్యుడు ప్రతిఫలింపక...


చినిగిన స్వప్నపు సంచిలో... చితికిన ఆదర్శాలను తలుచుకుంటూ...


అర్ధాంగి ఆకారాన్ని అద్దంలొ చూసుకుంటూ...నిద్రపొతున్నావు...!!!


సహనం చెలికత్తెగా ... బాధలు అనే కలుపుమొక్కలను ఏరుతూ...


కన్నీళ్ళతో చేసే బ్రతుకు వ్యవసాయం స్త్రీ ...


ఏరుకుంటుంది పారేసుకున్న ధాన్యం కాదు...


వదనాన జారే స్వేదాంబుకణాలలో...మగవాడి పరువు తాలూకు గుర్తులు...!


తనకన్ని తేదీలు గుర్తుంటాయి ... తన పుట్టినరోజు తప్ప...!


ఎందుకంటే...


బ్రతుకు పొగలతో ఆమె జీవితపు క్యాలెండరు మసి బారిపొయింది...


నీ బ్రతుకుని మాకు మెతుకులుగా తినిపిస్తూ... పస్తులున్న పడతీగా మిగిలిపొయింది....


ఒక్కటి మాత్రం నిజం ...


మనిషి గతం లో " తను" ఉంది...


వర్తమానం లో "తను" ఉంది....


భవిష్యత్తు లో కూడా "అతను" లో అన్నీ "తను" అయిన విజేతగా నిలుస్తుంది... ఈ వనిత...


ఈ లొకం అంతటా నరకాశురులే...


మరి సత్యభామలా ఎన్ని యుద్ధాలు చేయ్యవల్సివస్తుందో...??


అందుకే ....ఓ స్త్రీ !!


నీవు నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో...


ధైర్యమే ఒక కవచంగా సాగుతున్ననీకు...


అర్పిస్తున్నాను...అభిమాన నీరాజనం !!!


సమర్పిస్తున్నాను...మమకార సిరి చందనం !!!!

4 Comments:

  1. Priya said...
    మనిషి గతం లో " తను" ఉంది
    వర్తమానం లో "తను" ఉంది
    భవిష్యత్తు లో కూడా "అతను" లో అన్నీ "తను" అయిన విజేతగా నిలుస్తుంది ఈ వనిత...

    Chala Chala Bagundhi :)
    సరిత said...
    కన్నీళ్ళతో చేసే బ్రతుకు వ్యవసాయం స్త్రీ ...
    ఏరుకుంటుంది పారేసుకున్న ధాన్యం కాదు...
    వదనాన జారే స్వేదాంబుకణాలలో...మగవాడి పరువు తాలూకు గుర్తులు...!


    స్త్రీ గురించి ఎంత బాగా చెప్పావు బాబు... నీ ప్రతి పదం నిజం... ఈ సమాజంలో అవమానాలు తనవే...అపనిందలు తనవే...
    Anonymous said...
    చాలా చాలా బాగుంది
    రాజారావు said...
    తనకన్ని తేదీలు గుర్తుంటాయి ... తన పుట్టినరోజు తప్ప...!
    ఎందుకంటే...
    బ్రతుకు పొగలతో ఆమె జీవితపు క్యాలెండరు మసి బారిపొయింది...
    నీ బ్రతుకుని మాకు మెతుకులుగా తినిపిస్తూ... పస్తులున్న పడతీగా మిగిలిపొయింది....


    మంచి లైనింగ్ తో చాలా బాగా వ్రాసావు....

Post a Comment