ఎవరు నేస్తం నీవు?
చినుకు చినుకు కలిసి చిరునవ్వును తడిపినట్లు
ఆకు ఆకు కలిసి కొమ్మల కాంతలపై
అత్తరు సుతారంగా అద్దినట్లున్న ఉషోదయంలో నులి వెచ్చని తొలి వేసవివా?
గుండె కవాటాలను తడుముకుంటున్న నిముషంలో
గగనమంత హృదయంలో దాచుకున్న రుగ్ధ వర్ణానివా?
నిద్ర తన ప్రగాఢ పరిష్వంగంలో మరచిపోయిన
కలల కుంచెతో దిద్దిన నిట్టూర్పు మంచుశిలవా?
అందెల ఆకాశ౦లొ... తెలి మబ్బుల చారల వలయంలో ...
వెండి వెన్నెలగా మెరుస్తున్న నక్షత్రాల జరీ అంచువా?
గదిలోని సగం కాలిన అగరవత్తుల కొనలు అలిగి ఆవిరవుతుంటే
అంధకారపు అరమోడ్పు కనులను మూసిన ధవళ వస్త్రానివా?
అంతులేని అవిశ్రాంతమయిన అవనిపై వాలిన చెరగని ధరహాసనివా?
కాంతి కిరణాల్ని చూపుతున్నవెలుగుల విభుదివా?
నిరాశను కదిలించిన శుబాభినవ ప్రభాతానివా?
మౌనంగా భరించే మలయ మారుతపు చిహ్నానివా?
అదృశ్య స్వర్గాల్ని... అశ్రుత గాంధర్వాన్ని...
అన్వేషించుకుంటూ అలల అంతరంగానివా?
ఇంతకి ఎవరు నేస్తం నీవు ?
నిరాశను కదిలించిన శుబాభినవ ప్రభాతానివా?
మౌనంగా భరించే మలయ మారుతపు చిహ్నానివా?
అదృశ్య స్వర్గాల్ని... అశ్రుత గాంధర్వాన్ని...
అన్వేషించుకుంటూ అలల అంతరంగానివా?
చాలా బాగుందండి... మంచి లైనింగ్ తొ చక్కగా వ్రాసారు... మీకు మంచి భవిష్యత్ ఉంది నేస్తం... రానున్న రొజుల్లొ మిమ్మల్నీ మరొ తిలక్ గానొ లేక మరొ శ్రీ శ్రీ గానొ చూస్తానేమో...