నాకు తెలీయనిదేదొ ఉందనుకునే బాల్యంలొ...


చిన్నప్పటి జ్ఞాపకంలా నా తలపుల్లొకి నువ్వొస్తున్నావు ఎందుకు...?

నయనంలొ అశృవే స్వప్నంగా మారుతున్న ఈ మునిమాపు వేళలొ...

మహిత రత్నరాశులగా మెరుస్తూ... నా గుండె వెనుక దాగుతున్నావెందుకు...?

నా నుండి కదిలిపొయే నీ ఆలొచనలు నన్ను ప్రశ్నిస్తూ...

జాలిగా చీకటిని ఆశ్రయిస్తున్నాయి...

నిద్రలొ నీ సొగసైన కలలు నన్నునిలదీస్తూ...

వెలుగులొ మౌనంగా మాయమవుతున్నాయి...

నిన్ను నువ్వే బంధించుకొని...నమ్మకాల సూత్రలలొంచి తప్పించుకొలేక...

కన్నీటి రూపంలొ...నా కళ్ళ నుండి జ్ఞాపకాలుగా జారిపొతున్నావు...

నా అంతరాంతర నిశేదిలొ ఏకాకిని చేస్తూ...

మది వాకిటన విడిచి మౌనంగా మరలిపొతున్నావు...

మంచి గంధాలను రాసుకుంటూ...మల్లెపూల మీద పడుకునే నీకేం తెలుసు...

నాలొ అణుచుకున్న రొదన రాత్రుల గురించి...!

ప్రలొభాలకు లొంగిపొతూ...మోహపు మాధుర్యంలొ తేలుతున్న నీకేం తెలుసు...

ఎన్ని విలువలు...ఎన్ని వెలుగులును కొల్పొయానో..!

మరక పడిన నమ్మకాన్ని చేరుపుకుంటూ...

మోజుపడిన ఆత్మను మోసుకుంటూ...

సుమనస్సుందర వసంతలొ ఉగాది కొసం అన్వేషిస్తున్నాను...

5 Comments:

  1. Anonymous said...
    మంచి గంధాలను రాసుకుంటూ...మల్లెపూల మీద పడుకునే నీకేం తెలుసు...

    నాలొ అణుచుకున్న రొదన రాత్రుల గురించి...!

    ప్రలొభాలకు లొంగిపొతూ...మోహపు మాధుర్యంలొ తేలుతున్న నీకేం తెలుసు...

    ఎన్ని విలువలు...ఎన్ని వెలుగులును కొల్పొయానో.

    pai lines contradictory gaa unnai .. konchem explain chestharaa ...

    I like your poems alot .. :)
    సరిత said...
    This comment has been removed by a blog administrator.
    సరిత said...
    నిన్ను నువ్వే బంధించుకొని...నమ్మకాల సూత్రలలొంచి తప్పించుకొలేక...
    కన్నీటి రూపంలొ...నా కళ్ళ నుండి జ్ఞాపకాలుగా జారిపొతున్నావు...


    రేవా గారు మీ కవితలు చాలా ఎక్కువగా చదువుతాను... భావం మీ ప్రతి కవితా చాలా లొతుగా ఉంటుంది... మా జీవితాలాకు చాలా దగ్గరగా ఉండేటట్లు వ్రాస్తారు...ఇలా అడుగుతున్నాను అని తప్పుగా అనుకొకండి.. మీ లవర్ మిమ్మల్నీ మోసం చేసిందా... అలా చేస్తే ఆవిడ దురదృష్టవంతురాలు... ఎందుకంటే ఇంత అద్భుతమైన భావాలు ఉన్న వ్యక్తీని కొల్పొయినందుకు....
    అక్షయ said...
    చాలా బాగుంది
    Anonymous said...
    Excellent and too depth...

Post a Comment