ఎప్పుడొ...ఒళ్లొ కూర్చొబెట్టుకున్న గుర్తు...
పాయసం తినిపించిన జ్ఞాపకం...
ఊయలలూపిన అనుభవం...
అంతకు మించి మాతృత్వపు అనుభూతులు
తేలియని ఎందరొ అనాధులు ...
ఆకలేస్తుంటే... గొరుముద్దలు తినిపించకపొతేనేమి...
రైలు పట్టాల పక్క వదిలేసి పొతేనేమి...
అనాధశరణాలయలొ పెరిగితేనేమి...
మమ్మల్నీ కన్నది ఓ అమ్మే కదా...
నీ మనసులొ ఇంతటి క్రూరత్వమా...
లేకుంటే మాకేమిటి ఈ దారుణం...
చిందర వందరగా అక్షరాలును తుడిచేసిన తెల్లకాగితం...
మసకబారిన నలుపు-తెలుపుల ఛాయాచిత్రం...
ఎవరొ కక్షగట్టి చిదిమేసిన లేత జ్ఞాపకం...
వ్యక్తావ్యక్త భావాల నైరూప్య చిత్రం...
అర్ధమైన కానట్టున్న మార్మిక కవిత్వం...
అనాధలకు అమ్మంటే కలలాంటి ఓ నిజం...
ఎందుకంటే...ఉన్నా రాదు కనుక...
మా గుండేలొ మేమిచ్చుకున్న రూపం...
తేజొవతీ..త్రినయనా...లొలాక్షీ... కామరూపిణీ..
మాలినీ...హంసినీ..మాత మలయాచల వాసినీ...!
మీరు పుస్తకాలలొ... సినిమాలొ చూసే అమ్మ...
మమ్మల్ని ఇలా వదిలేసిన అమ్మ...బహుస ఒకటి కాదేమో...
ఎంత చెప్పిన వినని నా పిచ్చి మనసులొ ఈ రొజుకి ఒక ఆశ...
శరణాలయపు గేటు చప్పుడైతే నువ్వేమోనని...