నా గదికి తొరణమాలలు ... ధూప... దీపమ్ములు ఎందుకు..

ఏ బాధ నివారణకు ... ఏ వాంఛ పరిపూర్తి కొరకు?

దేవుడూ మానవుడూ వీరిద్దరూ... యీ అనంత విశ్వంలొ మూర్ఖులే...

ఏ కొణం నుంచి చూచినా ఓటమిని అనుభవించే వాళ్ళు వీళ్ళే కనుక...

ఒకనాడు నీవు పెండ్లాడిన ఒయ్యారపు భార్య...

తప్పతాగి తందనాలాడుతున్న నీ క్షేమం కొసం...

తులసి కొట చుట్టూ కన్నీటి దీపాలు వెలిగిస్తుంది...

ఇది ఏ నాగరికతకు ఫలశృతి?

అర్ధరాత్రి ధియేటర్లలొ అర్ధనగ్న లాస్యానికి...సెక్సీ హాస్యానికి...

అమెరికన్ జాకెట్లు తొడిగిన బంగారు పిచ్చికలు కిచకిచలాడుతున్నప్పుడు...

ఊరవతల సందులలొ... అంగళ్ళలొ...

విక్రయార్ధం రంగేసిన...రకరకాల మొనగాల్ని.. విలాసం పేరుస్తుంది...

ఇది ఏ భొగవంతుని విచలింప చేయగలదు?

దారి తెలియక తడబడుతున్న అంధుడిని చూసి

చీకటి నీ తల్లి అని...కటువైన నిజాన్ని కాలం చెప్పుతుంది...

ఇది ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి...?

విధి విపక్షుల్ని... పక్షుల్లా తరుముతుంటే...

అలవాట్లు ఆచారాల రైలుపట్టాల మీద దొర్లుకుంటూ...

మైలుపడ్డ దుప్పటిలా నన్ను అలుముకుంటుంది...

నా బాధ ఏ సౌధాంతరాలకు పయనించగలదు?

ఏవరి గుండెలను స్పృశించగలదు...?

0 Comments:

Post a Comment