గ్రీష్మ ప్రధమ దివసాలైనా....


ఇంకా వసంతపు గడుసుతనం వేధిస్తునే ఉంది నీలా...!


నవ్యమైన ... దుర్నిరీక్ష్యమైన కాంతి కొసం...


ప్రతి రాత్రి చీకటిని చంపుతున్నాను...


ఆ వెలుగులొ నీవు కన్పిస్తావని...!


నా కన్నుల కాంక్ష లాసజ్య ధనువువై...


నీ కౌగిలిలొ వొదిగిన నా తనువు కొసం...


నిశ్మబ్దపు పరుపుపై పవలిస్తున్నాను...


ఆనాటి మధుర స్మృతిగా మిగిలిపొతావని...!


ఎర్రనైన ఏకాంత సరస్సున...విరిసిన ఎర్ర కలువలా...


సంస్కారపు కేశపాశంలొ తురిమిన అనురాగపు గులాబిలా...


స్నిగ్ధ దరహాస పరిమళాలను గుభాళిస్తున్నావు...


నీవు కానరాక ఒంటరిగా ఎన్ని దీన నయనాల్నీ...


ఎన్నీ మౌన నిశ్వాసాల్నీ ఏరుకున్నానొ....


ఇంతలొ వివేకం లేని ఆవేశంలా...


సంయమనంలేని సౌఖ్యంలా...


నాకే తెలియని ఓ నిస్పృహ నన్నావరించుకుంది...


నా బ్రతుకులొ అదృష్టం నవ్వుతుందొ..


ఏడుస్తుందొ... నాకే తెలియని ఓ విభ్రాంతిలొ...


నా నొసటన ఆనందపు నెలవంకలు ఇక లేవని....


విధి లిఖించిన వెర్రి చిత్రంలా మిగిలిపొయాను..

0 Comments:

Post a Comment