నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి..

మరో హృదయం పడే తపన ''ప్రేమ'' అయితే..

అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే ''స్నేహం''..

మునిమాపు వేళ రెండు నక్షత్రాలు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు..

ముని కాళ్ళ మీద నిలిచిన దేవతలు..

మనల్ని అసూయగా చూస్తున్నారేమిటి..నేస్తం..ఆ దిష్టి కళ్ళతొ..!

నవనవాలైన నీ ఆశల వర్ణాలతొ ఉదయించిన భానుడు..

సింధురం కన్న ఎరుపైన నీ హృదయాన్నిచదువుతూ..

ఇతడే నీ స్నేహితుడని ఏడిపిస్తున్నాడేమిటి నేస్తం..ఆ దురుసు నొటితొ..!

ఒకరి నడుం ఒకరు చుట్టుకొని..

మన స్నేహంతొ విరియించుకున్న ప్రతి పువ్వూ అనార్తవంగా మారుతూ..

ఎర్రని పెదవుల పై తెల్లని నవ్వులగా విరుస్తూ..

ఎవ్వరికి దొరకని మన రహస్యాల్ని వశపరుచుకుంటున్నాయి..

హిమస్నాత మాలతీలతలతొ అల్లుకున్న మన బంధాన్ని..

శ్రీ గంధపు సనాతనతొ నిండిన మన స్నేహపు పరిమళాన్ని..

హేమంత సమీరాలకు ఒక అలంకారమనీ..గర్వపడుతున్నాయి..

నీవిచ్చిన ఈ స్నేహ సుమాలకు నేను ఏమి ఇవ్వగలను నేస్తం...

కడకంటితొ కార్చిన కన్నీటి బొట్టును తప్పా....!

0 Comments:

Post a Comment