కనురెప్పలు కాపలా కాస్తున్నా...

నీ కలలును ఆపలేకపొయింది...

నీ భావాలు ముట్టడిస్తున్నాయని తెలిసి...

నగ్నంగా ఉన్న నేత్రాలనూ...

ప్రతి రొజు కన్నీటి పొరలతొ కప్పుతుంది...

నేను ఊహించిన హృదంతర దృగంతర దివ్యత్వం..

నీ పిరికితనపు వాగురలొ చిక్కి...

నీ జడత్వపు నీలాలిలొ నవసి... నశిస్తుంది...

ధైర్యంగా నిలబడే దృక్పధం నీకు లేనప్పుడు...

వలచి ప్రయోజనం ఎందుకు...?


ఆదర్శాలతొ నిండిన ఆశయాలు నీకున్నప్పుడు...

నిట్టూర్పులతొ వేదనను మిగల్చడం ఎందుకు...?

కప్పుకున్న నిన్నటి కలల్నే తలుచుకుంటూ...

ముగింపులేని కధగా మిగిలిపొతున్నాను...

మరుగున పడిన నిన్నటి మాటలను చీల్చుకుంటూ...

అంతం లేని వ్యధతొ మరలిపొతున్నాను...

లొలొపల నవ్వుకుంటున్న నీ గర్వంతొ సమరాంగాన్నీ కొరుకుంటున్నావు...

నా మనొంగణంలొ నీవు వెలిగించిన తొలిదీపాన్నీ... నీవే ఆర్పేస్తున్నావు...!

మనొవ్యధని చేకూర్చే ఆలొచనలు...మనొగత భావాలలొ నలుగుతున్న నీ జ్ఞాపకాలు...

అనంతమైన నా ప్రేమకు ప్రతీకలని...ఎప్పుడు తెలుసుకుంటావు...!

నీ మౌనం అనే శాపం ఇచ్చే కన్న...మరణమనే శిక్షను విధించు నేస్తం...

2 Comments:

  1. మాలతి said...
    ఒకానొక మానసికస్థితిని మనసుని ఆకట్టుకునేలా చిత్రించేరు. నిజంగా అనుభవించినవారికే తెలుస్తుంది అలాటి ఆవేదన అనిపించేలా.
    మంచి కవిత. అభినందనలు.
    Anonymous said...
    నీ మౌనం అనే శాపం ఇచ్చే కన్న...మరణమనే శిక్షను విధించు నేస్తం...

    I like this line.

    Friend

Post a Comment