పగటికి చితి పేర్చి సంధ్యా జ్వాలలను మాలలుగా...నీ మెడలొ వేయ్యలేను..

వెన్నెలను మధిస్తూ తీసిన నా వేదన గరళాన్ని...నీకు బహుమతిగా యువ్వలేను

వెలుగును వెనక్కి నెట్టుతూ...రేపటి కొసం అతికించుకున్న

నా పాతముఖాన్ని నీకు చూపించలేను...ఎందుకంటే..

మలినమైన నా మనసు...నీశేది చీకట్లునీ కప్పుకుంటుంది..

చెమ్మగిల్లిన నా చూపు...కొత్త కన్నీటి కొసం వెతుక్కుంటుంది..

నీ రూపం నా దేహనికి తగిలినప్పుడు...నిరాశ మంచుల మారుతూ..

నా ఆనంద ప్రభాతపు...నీల సముద్రంపై..

వెండి మువ్వలా కరుగుతుందనుకున్నాను...

కాని బ్రతుకు అంచుమీద నల్లని దు:ఖపు కెరటంతొ

విరుచుకుపడుతుందనుకొలేదు..

నీ ఊహల కౌగిలిలొ ఒదిగిన కాంక్ష తప్తమై..

ఉష: కాంతిలా మారి నా గుండెని శొభింపజేస్తుందనుకున్నాను..

కాని చినిగిన స్వప్నపు సంచిలొ..

చితికిన బాష్పంలా మారుతుందనుకొలేదు నేస్తం..

కదలని కాల గడియారపు గుండెల్నీ...సుతారంగా మీటుతూ..

అనంతమైన శూన్యాన్ని అలుముతూ వెళ్ళీపొయావు..

సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపిస్తున్నట్లుగా...

ఈ జీవిత ఘటానికి శెలవంటూ...

అవ్యక్తంగా మూలుగుతుంది వెలుగుతుంది...నా ప్రాణదీపం...

కడసారైన నిన్ను చూడాలని...!

0 Comments:

Post a Comment