ఆకారం లేని మనసు పై ... మమకారాల హొరేమిటి...?


సాగిపొయే శబ్ధానికి... నిశ్మబ్ధల అడ్దుకట్ట ఏమిటి...?


ఆగిపొయే గుండెపై ... అంతరంగంలొ ఆరాటం దేనికి ...?


చూపులేని కాలం పై... జ్ఞాపకాల గుబులేమిటి ...?


ధైర్యమనే వెలుగు క్రింద ... పిరికితనపు చీకటేమిటి...?


మృత్యువుతొ కరిగిపొయే తనువుపై ... అంతుచిక్కని ఆశేమిటి...?


తరిగిపొయే యువ్వనంపై ... తనివితీరని మక్కువెందుకు...?


నిరుపయోగమైన అందంపై ... అలంకారాల ఆపేక్షేందుకు...?


తల్లడిల్లుతున్న కురులలొ... వాడిపొతున్న కుసుమాలేందుకు...?


కష్టాలలొ జాలువారే కన్నీరుకు... అప్యాయతతొ హత్తుకొని చేలిమేందుకు...?


కదలలేని శిలలకు ... కరుణతొ దండాలేందుకు ...?


జారిపొయే కలలపై ....చిరునవ్వుల ఆర్బాటమెందుకు...?


మానవత్వం లేని మనిషిపై....అశాశ్వతమైన ప్రేమేందుకు...?


సాటి మనిషికి సాయం చేయ్యనీ నీ బ్రతుకేందుకు...


నీకు ఈ జీవితమేందుకు...? అంతా వ్యర్ధం...!


బాబా...

జగత్తు యొక్క అనిత్యత్వముని గ్రహించి...


ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది...


ఆత్మనుసంధానము చేస్తూ...


ద్వారకామాయైన నీ హృది దర్బారులొ మాకు సేద తీరుస్తున్నావు...


న్యాయమిమాంసాది షడ్దర్మనములను చదువ పనిలేదని...


గుర్వనుగ్రహం లేని పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనమని...


పతకము లేని కంఠహరంతొ సమానమని...


ఫకిరు పదవే నిజమైన మహరాజ పదవని...


సిరి సంపదలు క్షణభంగురాలని చాటుతున్నావు...


షట్ శాస్త్ర పారంగతుడవైన నీవు...శ్యామకర్ణ వాహన భూషితుడవై...


మాలొ ఉన్న అజ్ఞానమనే చీకటిని చీల్చుటకు వచ్చిన సూర్యుడుగా వెలుగుతున్నావు...


సమస్త చేతన చేతనంలందు నిరాడంబరత... దయాళువు గల్గినవాడివై...


నీ పేరునే లిఖిస్తున్న నా హృది అభంగంలొ చిరస్మరణీయంగా ప్రకాశిస్తున్నావు...


నీ యశుద్ధములొ నేనొక పురుగుని... అట్లగుటచే నేను ధన్యుడనైతిని...


ప్రణిపాతని చేకూరుస్తూ...యుక్తితొ... మా కాయమును తరింపజేస్తూ...


ఉదయ సంధ్యలొ బాలబానుడుగా ఉదయిస్తూ...


మా జీవితమనే ఓడకు... సద్గుర సారంగుడవై... ముందుకు నడుపుతున్నావు...


ఏమిచ్చి నీ ఋణం తీర్చుకొను బాబా... రిక్తిహస్తలతొ నమస్కారించడం తప్పా...!


కలవర పాటుకు గురిచేసే వెలుతురు కన్నా... కలలను బ్రతికిస్తూ సేదతీర్చే చీకటంటే ఇష్టం...

ఆశలను ప్రేరేపించే గెలుపు కన్నా... నిరాశ కలిగించే ఓటమంటే ఇష్టం...

వెన్నెల పంచే చంద్రుడు కన్నా... భగ భగ మండే సూర్యుడంటే ఇష్టం...

దాహన్ని తీర్చే నీటి చుక్కల కన్నా... బయటకు విరజిమ్మే చెమట చుక్కలంటే ఇష్టం...

ఆనందం కల్గించే సుఖ:ల కన్నా... నిరాశకు గురిచేసే కష్టాలంటే ఇష్టం...

దిగులుతొ కుంగి పొయే భయం కన్నా... ఎదురు తిరిగి పొరాడే ధైర్యమంటే ఇష్టం...

ఆహ్లదంతొ ముంచేత్తే సంద్రం కన్నా... విలపిస్తూ జాలువారే కన్నీరంటే ఇష్టం...

జనన మరణాలకతీతుడైన భగవంతుడు కన్నా...

సమస్యల చక్రాన్ని తిప్పుతూ సాగిపొయే సామాన్యుడంటే ఇష్టం...

కొత్తగా పరిచయం చేస్తున్న జననం కన్న... పాత జ్ఞాపకాలను సమాధి చేసే మరణమంటే ఇష్టం...

పనికి రాని పొగత్తల కన్నా....కృంగదీసే విమర్సలంటే ఇష్టం...

అలంకరంతొ అందాన్నిచ్చే బంగారం కన్నా... మమకారాన్ని పెంచే మాంగళ్యమంటే ఇష్టం...

నయవంచన చేసే ప్రియరాలు కన్నా... మురిపంతొ తినిపించే మాతృమూర్తంటే ఇష్టం...

నమ్మక ద్రొహం చేసే స్నేహితులు కన్నా...

నన్ను నేనే ఓదార్చుకునే ఒంటరితనమంటే మరి మరి ఇష్టం...!


మరువలేని నీ జ్ఞాపకాలు విరులుగ వికశిస్తుంటే...

గడిపిన గతస్మృతులను ఎలా మరువగలను?

నీ విరహమే నా బాధకు హేతువవుతుంటే

నీ మననముతొ మనసు అనుక్షణం పడే క్షొభను ఎలాచెప్పను...

సుగుణ స్వరూపమైన నీపై ....

నిర్గుణ స్వరూపమైన ఈ ఆలొచనల వర్షమేమిటి ?

సాత్త్వికగా విరిసిన నా అక్షులతొ...నీ రాకకై....పిపాసగా ఎదురు చూస్తుంటే...

యుక్తయుక్తములు కాంక్షించక... కొపొద్దీపితురాలవై...

మనొవ్యాకులతకు గురిచేసే ఆ చూపుల మౌన ప్రబొధాలేమిటి?

అమేధ్యాపు ఆలొచనలతొ...నిష్ఫలమైన సఖ్యత్వాన్ని నటిస్తూ...

అనన్యమైన నా చెలిమిని...నీ దుర్గుణంతొ వ్యతిరేకిస్తున్నావు....

ఇన్నాళ్ళు నీ అన్వేషణలొ తత్పరుడైన ఉన్నందుకు ప్రతీకగా....

ఎడబాటును నాకు భూషణంగా బహుకరిస్తున్నావు....

సజీవ ప్రతిమగా ఉన్న తనువు పై ముముక్షుత లేదు...

ఇరువురం ఏకాత్మభావంతొ చేసుకున్న బాసలను మరిచి...

మరణ మృదంగానికి మాటులు వేస్తూ...

ఊహల సంద్రంలొ సమసి పొమ్మని ప్రేరేపిస్తున్నావు....

అజ్ఞానమనే మగతతొ నిండిన నీ పేరాసతొ నన్ను తృణీకరిస్తున్నావు.... ఇది న్యాయమా...!


పల్లెకు పండగ కళ వచ్చినట్లుంది...

పడుచులు తాతలనాటి రాగిపాత్రలు చింతపండేసి తొముతుంటే...

ముసలమ్మ బ్యూటి పార్లలతొ కుస్తీపడుతున్నారు...

హరిదాసు బిక్షాటకు బయలుదేరుతూ కీర్తన శృతి చేస్తుంటే...

బక్క గంగిరెద్దు పై అతుకుల బొంత కప్పి...

ఎండిన డొక్కను దాచేస్తున్నాడు...

ఏడాది నుంచి జీడిపప్పు మేస్తున్న పందెం కోళ్లకి ఒకటే టేన్షన్...

పొలింగ్ తేది దగ్గరపడుతున్న పొలిటిషియన్లా...

ఒకపక్క సుబ్బిగొబ్బెమ్మలు విధులన్నీ చుట్టేస్తుంటే...

మరొపక్క జడ్డీమెంట్లు వంకతొ సొగసైన బామలు...

వరుసైన కుర్రాళ్ళుకు వలపు బాణాలు విసురుతున్నారు...

ముద్దుగొలిపే ముద్దుగుమ్మలు...పట్టుపావడా కట్టుకొని వయ్యారంగా నడిచొస్తుంటే...

బ్రహ్మచారుల గుండెలు జడగంటల మాదిరి ఊగుతున్నాయి...

గుప్పుమంటూ నేతి వాసన మనొవేగంతొ వచ్చి...ముక్కుపుటాల్ని తాకుతూ..

ముదురు బంగారపు వర్ణంతొ ఆత్మీయతలొ ముంచుకున్నట్లుండే అరిసెలు నొరురురిస్తున్నాయి...!

చిటికెడు కస్తూరిని చిలికిస్తూ...పళ్లెం నిండా తమలపాకులను పరుస్తూ...

సొగసైన చేతులతొ చిలకలు చుడుతూ..సొగసైన చెలికాడికి అందిస్తూ...

సమయ స్పూర్తితొ మసలు తెలుగు గృహుణులకు సాటేవ్వరు ?

"సంక్రాంతి శుభాకాంక్షలు...."


ఓ సాయినాధ...!

తేజొ వంతమైన నేత్రాలతొ నిండిన

నిర్వ్యామోహ మైన నీ సుందర రూపం కాంచుట తొనే...

కంఠం ఆనందాతిరేకంతొ ఒక ప్రక్క గద్గదమగుతుంటే...

మరొ ప్రక్క భక్త్యావేశాలతొ నిండిన అక్షువులు ఆనందాశృవులను చిందిస్తున్నాయి...

ద్వంద్వాతీతుడువైన నీ పాదమస్తకముల స్పర్సతొ...

హృదయం భావొధ్రేకంతొ నిండి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే...

నిరాసక్తుడువైన నీవు...అష్టసిద్ధులను ఆధీనం చేసి...

చింతరహితుడవై...శాంతంగా దర్సనమిస్తున్నావు...ఏమిటి బాబా నీ మాయ..!

మా దుర్లభమును తరుముతూ...ఆశ్చర్య వినొదాలకు హేతువవుతూ...

నీ చరణారవిందంలపై సర్వస్యశరణాగతికి కారణభూతుడువవుతున్నావు...

దయార్ధ హృదయంతొ నిండిన నీ ప్రేమను గులాల్ గా చల్లుతూ....

ఆత్మజ్ఞానం నీ గని అని...దివ్యానందం నీ ఉనికి అని చాటుతున్నావు...

బానిసలకు బానిసనగు నేను ...నీకు మాత్రం బుణగ్రస్ధుడిని...

భవ సాగరం హరించుటకు నీవు నాకు అగస్ధ్యుడివి...

నీ నామం వినుటలొ నా శ్రవణం...నీ కిర్తనలొ నా జిహ్వ...తరీస్తుంటే...

జాగ్రదవస్ధలొనైనా.... స్వప్నావస్ధలొనైన...

మా అంతర్ముఖతలొ ముముక్షుతతొ నిండిన శేజ్ లా హరించుకొకుండా...

ధునిలా...నిత్యగ్నిహొత్రిలా వెలుగుతునే ఉంటావు...

;;