స్వప్నావస్ధ నుండి... జాగ్రదవస్ధ వరకు....మది పగ్గాలను లాగుతూ...


చావు పుట్టుకల చక్రాలను తిప్పే నీకు మరణమా... బాబా...!


దయార్ధ హృదయంతో...జగత్తు అనిత్యత్వమును గ్రహించిన....


సర్వాంతర్యామి అయిన భగవత్తత్వకు మృత్యుభయమా....!


నిర్గుణ స్వరూపంతో...ఆత్మసంధానం చేస్తున్నశుద్ధ చైతన్య మూర్తికీ అంత్యకాలమా...?


నిరాసక్తమైన మనస్సుతో...చింతారహితుడివైన మహాపురుషుడికి దుఖ:భారమా....?


ఏంటి బాబా ఈ మాయా...!


నిష్కల్మష భక్తిభావాలకు బానిసనైన నేను.... నీకు బుణగ్రస్ధుడిని...


అమృతతుల్యమైన భవ సాగరాన్నీ హారించటంలో... నీవు నాకు ఆగస్తుడివి....


దాతృత్వముతో నిండిన నీ చరణారవిందంలే... సర్వస్యశరణాగతికి మౌన ప్రబొధాలు.....


ముముక్షతతో నిండిన నీ పాదసేవలే...అనన్యమైన త్రివేణీ ప్రయాగల స్ధాన ఫలలాలు...


నీ మది కోళంబాలో... నిరాశానిస్పృహలకు తావులేదు....


ఎందుకంటే... ఆత్మజ్ఞానము నీ గని... దివ్యానందం నీ ఉనికి...


సమస్త చేతన చేతనంలలో నిండిన అజ్ఞామనే మగతను తొలిగించే అంశుధరుడువు...


నిప్పుకణములవంటి అక్షులతో..నిత్యగ్నిహొత్రివలే మా అంతరాత్మలో వెలిగే వైధాత్రుడువు...


ఏకాత్మభావంతో....నా మది అభంగములలో నీ నామము లిఖిస్తూ....


నా దయార్ధహృదయంలో...ద్విగుణీకృత ప్రకాశంతో నిండిన ....


నిర్వ్యామోహమైన నీ ప్రతిమకు ప్రణతినర్పిస్తున్నాను....


అష్టసాత్త్వికలతో పూజిస్తూ....రిక్త హస్తములను జోడిస్తూ....కారుణ్యంతో స్మరిస్తున్నాను...


నా ఆత్మకు యజమానివి... నా బుద్ధికి సారధీవి....


నీ ప్రేమ అనిర్వచనీయం...నీ ఆజ్ఞా అనుల్లంఘనీయం...


నీ ఊదీ వివేకం... నా దక్షిణ వైరాగ్యం....


రేవా...



అంశుధరుడు = సూర్యుడు


వైధాత్రుడు = బ్రహ్మ కుమారుడు


ప్రణతి = నమస్కారం


కోళంబా = పాత్ర


అభంగము = పేజిలు

1 Comment:

  1. vignesh ,Raghu said...
    ఏవో కొన్ని మంచి పనులను పెట్టుబడిగా పెట్టి వేల కోట్లు దోచుకున్న దొంగ దేవుడికి అందరూ అండగా వుండటం మన దేశం యొక్క దౌర్భాగ్యం.. అప్పట్లో విజయవిహారం బాబా మోసాలను సాక్యాలతో సహా బయటపెట్టింది కానీ ఎవరూ support చేయలేదు..warren buffett, bill gates లాంటి నాస్తికులు అంతా కన్నా ఎక్కువ ఆస్తులను జనం కోసం త్యాగం చేశారు..

    ఈ రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు బాబా గురించి చేస్తున్న హడావిడి చూస్తుంటే మనం ఎంత అసత్యపు స్వార్థపరమైన సమాజంలో వున్నామో అర్థం అవుతుంది..సామాజిక భాద్యత గల మీడియా కూడా అతన్ని దేవుడిగా భావించి ప్రచారం చేయటం అత్యంత భాధాకరం...అసలు ఈ బురిడీ బాబా గొప్పతనం ఏంటో కొంచెం తార్కికంగా వివరణాత్మకంగా ఎవరన్నా posts పెడితే చదవాలని వుంది

Post a Comment