వాన వెలిసాక గొడుగు... మది గాయపడ్డాక నీ అడుగు... ఎందుకు నేస్తం....!
Posted by బుజ్జి at 4/12/2011 09:36:00 PMనా జీవితపు విలువలను... నీ ఆత్మ విశ్వాసంతో...ఆవిష్కృతం చేద్దామనుకున్నాను...
కాని ఈ రాత్రి మూగ సైగలతో మేల్కోన్న... నిరాశతో మాట్లాడుతున్నాను ఏంటీ..?
నైరాశ్యం... నిస్పృహలతో నిండిన....ఈ పాత కాలపు గుండెను నీకర్పిద్దామనుకున్నాను..
కాని నిస్సహాయతతో నిండి ఈ చీకటీలో...విధి లిఖించిన వెర్రి చిత్రంలా మిగిలిపొయానేంటీ...?
పక్షవాతపు మంచం కౌగిలింతలో... చెదలు పట్టిన భాగవతంలా...
గత చరిత్ర బురదలో కూరికుపొయిన.... బిలహరి రాగంలా....
నువ్వు నన్ను ఎప్పుడూ అర్ధం చేసుకోలేవు... నేస్తం...!
స్త్రీ హృదయం అద్వయతంలా....ఎనాడు ఎవరికి అర్ధం కాదని మరో సారి నిరూపించావు....
వాన వెలిసాక గొడుగు... మది గాయపడ్డాక నీ అడుగు... ఎందుకు నేస్తం...
తీక్షణ... వీక్షణల్లో... హృదయతూణీరంలో...
నాలో నేను...ఈ నిశ్శబ్దపు యుద్ధం చేయ్యలేక...
చెదిరిన స్వప్నాలను... బాష్పాలుగా మారుస్తూ.... ఎదబీడుని తడుపుతున్నాను....
ఒంటరితనంలో ఇమడలేక... ఆవహించిన ఏకాంతపు మౌనంతో బ్రతకలేక...
దిశా నిర్దేశం లేని... నిరాసక్త తీరాలకు పయనిస్తున్నాను....
ఆశ నిరాశ ఊహాల ఊగిసలాటలో...నీ వేడి చూపులు....
నా జ్ఞాపకాల తెరలను చీల్చుతున్నాయి..
అడుగడుగున ప్రతి కదలికలో... అనంతమైన నీ ఆలోచనలు నన్ను వేదిస్తునే ఉన్నాయి....
అతృత్ప అశాంత అంతరంగాలైన నా తనువు...
కాంక్ష లాసజ్య కౌగిలితో నిండి నీ స్త్రీత్వము నేడు ఏమైంది....
అపార కృపా తరంగితాలైన ఆనాటి నీ స్నిగ్ధ దరహాస పరిమళాలు నేడు...ఏమైయ్యాయి...
నీ సంచలనాత్మక ఆలోచనలతో...నిత్యం నన్ను వేధిస్తున్న....
నన్ను అంటిపెట్టుకొన్న ఆత్మకు... కొత్త ఆశతో ప్రాణం పొస్తావని....
నా సుప్త సౌందర్యపు హృదయంలో...
నీ భావాల దారలతో నన్ను అల్లుకుంటావని... ఎదురుచూస్తున్నాను....!