అప్పటి వరకు బాధ అంటే తెలీదు

అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప

కన్నీళ్ళు అంటే తెలీదు

నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప

కష్టాలంటే తెలీదు

నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప

విడిపోవడం అంటే తెలీదు

చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప

మౌనంగ వుండడం తెలీదు

సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప

మరి ఈరోజేమిటి..

నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి

అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో

భాషగా మారిపోతున్నాయి

మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి

వీడుకోలు చెప్పడం అంత కష్టమా?

అరే...ఇదేమిటి?

ఆకాశంలో కదా మేఘాలున్నాయి

మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

0 Comments:

Post a Comment