జీవితం ఒక సంద్రమైతే ....

అందులొ ఎగసిపడే అలలు నీ గురించి కన్న కలలే.....

నా అంతరంగాలలొ ఉప్పొంగే తరంగాలైతే....

అందులొ విచ్చుకున్న ఆలొచనలు నీ గురించి కన్న తలపులే....

నేస్తమా.....!

ఆరాధన భావమో... మరి ఆకర్షణ స్వభావమో తెలియదు కాని

విరబూసిన వెన్నెలలా నువ్వు కన్పిస్తే చాలు...

నా మది వికశించిన పుష్పమవుతుంది....!

జ్ఞాపకాల మధురమో....మరి నీరిక్షణ సుమధురమో.... తెలియదు కాని

కలబొసిన చిరునవ్వుతొ నువ్వు పలకరిస్తే చాలు...

స్వేచ్చయుత మయురిలా తనువు పులకరిస్తుంది....!

ఆశల ఊసులను మూటకట్టుకొని....

సమశయమనే పొరను చేదించి నిన్ను పలకరించాలని...

నీ మృదు మధుర మాటల ప్రవాహంలొ పాల నురగనై పరవశించాలని ....

మనసును దాగిన కొరిక ప్రేరేపిస్తుంది.... కాని

ఉవ్వేతున పొంగుతు వచ్చిన అలలు.... ఇసుక రేణువులను చూసి

తన్మయత్వంతొ మాటలు మరచి వెనుదిరిగి వెళ్ళినట్లుగా.....

నీ చెంత చేరే సరికి కంటపడని బిడియంతొ మాటలకు అడ్డుకట్ల వేస్తున్నాను ...

మౌనంగా మరలిపొతున్నాను....

ఎప్పటికైనా నీ దేహంతరంలొ ఒదిగిన హృదయ వీణను మీటి....

నీ గీతామృతంలొ నేనూ ఒక బిందువు కావాలనీ....

నీ చల్లని గాన ప్రవాహంలొ పల్లవిగా నిలవాలనీ ....

కల కాలం నీ స్నేహం కొసం పరితపిస్తూ......

నిశ్మబ్ధ మహ సముద్రంలా నీరిక్షిస్తాను....

2 Comments:

  1. Padmarpita said...
    మీ నిరీక్షణ ఫలిస్తుందిలెండి!
    Pranav Ainavolu said...
    అచ్చం నా మాటల్లానే ఉన్నాయి... ప్రతి అక్షరం నేను అనుభవించిన వేదనే... బహుశా మన ఆలోచనల్లో సారుప్యత ఉందేమో?!
    మీ నిరీక్షణ తప్పకుండ ఫలించాలని ఆశిస్తూ...

    -ప్రణవ్

Post a Comment