అద్దం ముందు నిలబడితే నా కంటి పాపలొ నీ ప్రతిబింబం కన్పిస్తుంది.....

నా గుండెను సృశిస్తే స్తబ్ధతకు ప్రతీకగా నీ పేరు ప్రతిద్వనిస్తుంది....

చిరుగాలిలొ చేతులూపితే నీ స్మృతి పరిమళం చుట్టుముడుతుంది....

నువ్వు నా చెంత నుంటే ఊహల వాతవరణం వేడెక్కుతుంది...

నీ జ్ఞాపకాలు తొడుంటే...నిన్న కన్న కల మరియు రేపు కనే కల నీదవుతుంది....

నీ చిరునవ్వుల వెలుగుంటే....ఎడబాటుల నిశేది అస్తమిస్తుంది....

రెప్పలలొ దాగిన కన్నీటికి నీ ఓదార్పుంటే....అంతరంగాలలొ దాగిన దిగులు ఆవిరవుతుంది...

మరి అణువణువునా నీవైనప్పుడు... నా ఆలొచనలే నీదైనప్పుడు...

నిద్రెలా వస్తుంది... రేయేలా గడుస్తుంది....నేస్తం...!

4 Comments:

  1. Hima bindu said...
    చాల బాగుందండీ..బాగా రాస్తున్నారు .
    బుజ్జి said...
    ద్యాంక్స్ అండి చిన్ని గారు..... మీ లాంటి వారి మన్ననలు తొడుంటే... ఇంకా మంచివి వ్రాస్తాను....
    priya said...
    aani muthayam andi mee okkakka kavitha .....superb one.
    బుజ్జి said...
    ధ్యాంక్స్ అండీ దుర్గా గారు... వ్రాయటం కన్న మీరు చదువుతూ ఆశ్వదించటమే... ఓ గొప్పతనం మరియు... ఓ గొప్ప వరం....

Post a Comment