ఎసెమ్మెస్ లు వెళ్ళుతునే ఉన్నాయి...

కీ బొర్డుపై వేళ్ళు కదులుతునే ఉన్నాయి...

ఈమెయిళ్ళు ఇంకా పూర్తి కాలేదు...

నైట్ పార్టీల మజా ఇంకా తీరలేదు...

పబ్బుల్లొ పరిచయాలు పెరగలేదు...

వెబ్బుల్లొ వెలుసుబాటు ఇంకా చిక్కనేలేదు...

ఎన్ని పనులు... ఎన్నీ వ్యాపకాలు...

గుండెలను హత్తుకున్న ఏడాది అనుభుతులను

తడిమి చూస్తే...ఏం మిగిలింది...?

2010 కాలింగ్ బెల్ కొడుతుంటే....

2009 తలుపుతీస్తూ... కరిగిపొయింది...

కాలం వేగమే అంత...! మా యువత ఉడుకు రక్తం ఉరకల్లాగ....!

ఎన్ని సాధించిన... ఇంకా ఎన్నొ మిగిలున్నాయి...

కొత్త ఎడాది స్వాగతానికి ఆశల తొరణం కట్టాలి...

ఆశయాల గుమ్మం ముందు... లక్ష్యాల ముగ్గులేయాలి...

సరదాల మధ్యనే విజయం సాధించాలి...

వ్యక్తీగా ఎదగాలి...సంఘమై సాగాలి...

ఎంచుకున్న దారి సరైందైతే....

లక్ష్యం చేరకుండా ఎవరూ ఆపలేరు...

ఆత్మవిశ్వాసాన్ని ఊపిరి నిండా నింపి...

ఆగని కాలనికి ఆనందాలను అద్దుదాం...

"నూతన సంవత్సర శుభాకాంక్షలతొ.... మీ రేవా"



గుండెల్లొ బాధ ఆకాశాన్నంటితే ఏం లాభం...అంతా శూన్యం...


ఎండిన కనుపాప తిరిగి వర్షిస్తే ఏం లాభం...అంతా ఆర్ధ్రతమానం...


నీ విరహపు వేడిలొ ద్రవీభవిస్తున్నాను...


నీ వలపుల నీడలొ ఘనీభవిస్తున్నాను...


నీ సుమధుర జ్ఞాపకాలను ఆస్వాదించేది నేనే...


నీ చుర కత్తుల చూపులతొ ఆక్షేపించబడేది నేనే...


జ్ఞాపకాల విలాసంలొ దుఖ: వెచ్చటి కంబళై కౌవ్విస్తుంటే...


బంధనాలు తెంచమని నిన్ను అడిగేదేలా...?


విధి వైపరిత్యంలొ నీ ఎడబాటు సైగలతొ గుండెను మండిస్తుంటే....


ప్రాణ రక్షణకై నీ చిరునవ్వుల హస్తాన్ని అడిగేదేలా...?


నా ప్రతి ప్రశ్నకి ఒకటే వైనం... అదే మౌనం...


మనశ్శాంతి కొ దృక్పధం....మరణం నాకు ఔషదం...



గతం నువ్వై తాకుతుంటే....నా చితిని నేనే చూస్తున్నట్లుంది...

బ్రతికిన కాలంలొ మధుర క్షణాలను వెతుకుతుంటే....

విధి నీతొ గడిపిన నిమిషాలనే గుర్తుచేస్తుంది....

నీ జ్ఞాపకాలను వేదన సిరాగా నాపై చల్లుతుంటే....

శ్వాశ మరిగి గుండెపై తపన పెంచుతుంది....

ఎడబాటుల నీరిక్షీణలొ నిన్ను శొధిస్తుంటే....

వెతికి అలసిన కళ్ళు స్వేదాన్ని చిందిస్తుంది....

ఒక ప్రక్క హృదయం నిట్టూర్పు తొ వాడుతుంటే....

మరొ ప్రక్క ఆత్రుతతొ నీ తలపులు వికశిస్తున్నాయి....

నా కష్టాలకు శత్రువులా... సుఖాలకు సంపన్నురాలిగా... నిలుస్తావనుకున్నాను....

కాని

కారణాలు లేకుండ వెడలిన నిన్ను చూస్తుంటే...

తొరణాలను లేని నా హృదయ వాకిలి ప్రస్పూటిస్తుంది....

మౌనంతొ మరలుతున్నాను....మళ్ళీ నీకు కన్పించకూడదని....

శెలవు నేస్తం....



హృదయాకాశంలొ వెలిగే చిరునవ్వుల సౌగంధం... సంధ్య...
లలిత రాగాల సుమగంధం...కుడి ఎడమల కుసుమ పరాగం... సంధ్య...

మెరిసే నక్షిత్రం... కురిసే వెన్నెల... విరిసే కలువ... పూచే కుసుమం... సంధ్య...

చుక్కల వెలుగుతొ సౌందర్య లొకాలను వెలిగించే హరిత వర్ణాల అందం ... సంధ్య ...

కలల ఆకులపై కురుస్తున్న మంచు బిందువుల సొయగం... సంధ్య ...

ఉషస్సులతొ చీకటిని హరిస్తూ...తన్మయంతొ ఉప్పొంగే భావ కెరటాల వెల్లువ... సంధ్య...

యుగాలని... తరాలని మింగేస్తూ...అనంతానంతగా సాగిపొయే చెలిమి... సంధ్య...

సెలయేరు సొగసులతొ....జలపాతాల రాజసంతొ... జన హృదయాలలొ ప్రవహంచేది... సంధ్య...

తడారిపొయిన కలల ఎడారిలొ చిరుజల్లులను కురిపించే రంగుల హరివిల్లు... సంధ్య...

అధరాలపై కదులుతున్న అస్ధిత్వమైన అక్షరాలకు సరికొత్త అర్ధం... సంధ్య...

ఏకాంతంలొ...మనసు పొరలలొ అలసి...సొలసి...అల్లుకున్న ఆశల అన్వేషణ ... సంధ్య ...

నిశేదిలొ తళ్ళుక్కు మనే తారా దీపం... బ్రతుకు వాకిట నవ్వులు రువ్వే వెలుగు తొరణం... సంధ్య...

ఆశయ సాగర మధనంలొ అమృతతుల్యానికి ప్రతీక ... సంధ్య ...

గడిచి పొయిన జ్ఞాపకాలను కళ్ళ ముందు నిలిపే సుంధర స్వప్నం ... సంధ్య...



ప్రకటన మౌనవ్రతం నడుమ కేంద్రం దొబూచులాడుతుంటే....

ఆందొళనలు... భయందొళనల నడుమ రాష్ట్రం 'బంద్' ఖానా అవుతుంది...

ఆశ... నిరాశల మధ్య ఆంద్రావని కేంద్రం వైపు మోర చాపి చూస్తుంది...

సీమాంధ్రలొ రగిలిన నిరశగ్ని చల్లారలేదు సరి కదా...

నాయకులు దాయదులై భరతమాతను పంచుకుంటున్నారు....

ఒక చొట దీక్ష శిబిరాన్ని భగ్నం చేస్తే... మరొచొట వెలుస్తొంది...

ప్రజల జీవితాలతొ పేకాడే ప్రవృతి పార్టీల్లొ పెరిగిపొయింది...

మొదట చేసిన బాసలను తూచ్ అనడం పరిపాటైపొయింది...

నీతి భాహ్యమైన తీరు నగ్నంగా ప్రజలందరికి కనిపిస్తుంది...

విసిగిపొయిన యువత....లాఠి దెబ్బల తిన్న విద్యార్ధుల మదిలొ...

నిండిన ఆత్మవిశ్వాసం నేడు ఆత్మహుత దాడుల్లొ అంతమవుతుంది...

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మేధావులు ఇప్పుడు ఏమయ్యారు...?

పరిష్కారాన్వేషణలొ పాలు పంచుకుంటున్నారా...! లేక

టివీల్లొ షొ కొసం నీరాహర దీక్షల్లొ తలమునకలవుతున్నారా...!

రాజకియాన్ని ఆటలా మర్చేస్తూ....

భావొద్రేకపు ఉద్యమాల సంద్రంలొ అమాయక ప్రజలను తొసేస్తూ...

మానవ జీవితాన్ని భస్మం చేస్తున్నారు...

నెహ్రు ఆశలకు భిన్నంగా ఎర్రరంగు పావురాలను ఎగురవేస్తున్నారు...

బాపుజీ కలలు కన్న దేశం ఇదేనా?

ప్రజల ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేదెప్పుడు...

క్రొసులకొద్ది నడిచిన నా అంతరంగంలొ ఈ జ్వాలలు చల్లారేద్దెప్పుడు...


ఓ నిర్వేదం...ఒక నిట్టూర్పు...నిర్లిప్తమైన క్షణానికి కారణం...నీ జ్ఞాపకం...


నీ పరిచయం ముందు...సారం లేని బ్రతుకు శబ్ధనికి...సారాంశం లేని నిశ్మబ్ధాన్నీ...


కాలపు ఉద్వేగంలొ...విధిచే నేట్టేయబడ్డ...ఓ జీవం ఉన్న నిర్బేధ్యుడినీ...


నా మౌనాన్ని నీ చూపుల శృతితొ జతచేసి నీ చెలిమికి అర్పించలేను...


హృదయాంతరాలలొ యుగాలుగా దాగిన నిన్ను...


ఒక్క కన్నీటి చుక్కతొ కడిగేయాలేను...


దుర్లభమైన...నీ ఎడబాటు సంద్రాన్ని దాటగలను కాని...


నీ అంతరంగపు సుశుప్తావస్ధలొ ఓలలాడుతున్న నా మదిని ఊరడించలేను...


నీ ఆలొచనలు...కడలిలొ అలలుగా మారి ...నా మది తీరాన్ని ఢీ కొంటున్నాయి..


నిర్వ్యామోహితమైన నీ కర స్పర్స కొరకు...


పగటి వేళ నా మదిలొ నీ రూపాన్ని పతాకొత్సవం చేస్తున్నాను...


అశృవులు నిండిన మగత చూపుతొ నిరాసక్తుడిగా...


రాత్రి వేళ నా అంతరాత్మలొ నీ తలపులకు చందనొత్సవం గావిస్తున్నాను...


హృదయం భావొద్రేకంతొ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీ వలపుల దృశ్యమానంలొ...


అలసి సొలసిన ఈ గొంతులొ మాటరాక గద్గదమవుతుంది...


గతంలొ నేను పారేసుకున్న నీ తలపుల అనుభూతులు...


భవిష్యత్తు లొనైనా దొరుకుతాయని ఆశతొ వెతుకుతున్నాను...



ప్రేమను పంచుతుంటే అందుకోనంటున్నావు....


మనసు లేని మానువా నువ్వు....


మనసు నీకు అర్పిస్తానంటే మౌనం వహించావు....


మాటలు రాని...ప్రాణం లేని రాయివా....


నీ హృదయం అనురాగం లేని శవమా?


నీ మనసు ప్రేమను పొందలేని శిల్పమా?


లేకనీ కన్నులు కోరుకునే అందం నాలో కనిపించలేదా?


ఐనా అందం కాదు నేస్తమా మదిని ఆనందింపజేసేది....


ఐశ్వర్యం కాదు ప్రాణమా మనసులు ఐక్యం చేసేది....


ఒక్కసారి నీ మనసుతో నన్ను చూడు....


నా ప్రేమ శికరంపై రాణిలా కూర్చున్న నీ రూపం కనబడుతుంది....


ఐనా ఏముందనే అంత పొగరు నీకు.....


మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు....


శాస్వతమైనా నా చెలిమి కాదని?



జ్ఞాపకాలు ప్రళయాగ్నిగా మదిని కాల్చేస్తున్నా....


చిరునవ్వులను పెదవులకు అద్దుకుంటున్నాను....


తలపులు జ్వాలలుగా గుండెని దహిస్తున్నా...


శరత్కాలపు శశిధరుడిచే వెన్నెల కురిపించుకుంటున్నాను....


కన్నీటిగోడలలొ ఎదురుగావున్న నీ రూపం మసక బారుతున్నా...


కరస్పర్సతొ కలవర పరుస్తున్న అశృవులని అంతం చెస్తున్నాను ...


స్వేచ్చయుత సంధ్యలా వెలిగిపొతున్న సూర్యుణ్ణీ కాను...


ఎరుపెక్కిన కనుపాపలొ రక్తఛారని చెరిపేయడానికి ....


అమాస్య చీకటితొ కుంగిపొతున్న చంద్రుడిని కాను....


పాదాలపై జారిపడ్డ కన్నీటి మెరుపుని తుడిచేయడానికి.....


శిశిరాలతొ నిండిన నీ మౌనం ... నా గుండెను గాయం చేస్తుంటే...


అంతరాలలొ నలిగిపొయే నీ భావం... నా తనువును చింద్రం చేస్తుంది....


స్నేహని వదులుకొలేక... ప్రేమను పొందలేక.... నేను....


ప్రేమను స్వీకరించలేక....స్నేహన్ని దూరం చేసుకొలేక... నువ్వు....


మౌనపు సంద్రానికి చేరొ ఒడ్దున నిలిచిపొయాము.....


నీ ఎడబాటుతొ కనుమరుగై పొతున్ననా అంతరంగపు అనుభూతిని....


నీర్లిప్తంగా సాగిపొయే నా గమ్యంలొ ప్రతిబింబించె నీ లాస్యాన్ని ఆస్వాదిస్తూ....


నిన్ను స్పందింపజేసే మార్గం కోసం వెతుకుతూ...నా ఈ అన్వేషణా.....



ఆకాశరాజు...భూమాత పై దండాయాత్ర ప్రకటించడా....అన్నట్లుగా


నీలిమేఘాలు అమ్ముల పొదలొ దాచుకున్న పన్నీటి జల్లులను...


అస్త్రాలుగా పడమి తల్లి పైకి సందిసున్నాయి...


చెట్లు తమవొంతు సాయంగా ఒంటిపైనున్న సలిలసుధలు రాలుస్తున్నాయి...


నిర్మలమైన నింగి... నిశబ్దంగా నల్లబారిపోయింది....


తమకేమి పట్టనట్లుగా...


నదులు నెరజాణల్లా హొయలొలుకుతూ సాగరసంగమం వైపు సాగుతున్నాయి...


ఇంతలోనే ....!!!


కాంతులీనే కొటితారలను సంకేతంగా పంపి....


మబ్బుల చాటునున్న చంద్రుడు... మేఘాలతో సంధి చేసుకున్నాడేమో...


కాంతి కిరణాలను నిర్మొహమాటంగా నలుదిశలా విరజిమ్ముతున్నాడు....


మరొ చల్లని చంద్రొదయంలొ వెన్నెల పరావర్తనం తాకి...వెండి కలువలు వికసిస్తున్నాయి....


నా పయనంలొ ఇలా ఎన్నొ దృశ్యాలు కన్పిస్తున్నాయి.....


కళ్ళార్పక చూస్తున్నా ...స్వర్గానికిపోయే జీవాత్మలా ..



పరాజితమైన నా చూపుల వెనుక పెను చీకటి సృష్టిస్తూ...

కాలం నిన్ను తన ఎదలొ దాచిందనుకున్నాను.... కాని

నీ తలపుల వేకువతొ నిండిన బ్రతుకును చమరిస్తూ.....

విధి ఈ రొజు విడిపొమ్మంటుందనుకొలేదు.....

ఎడబాటు కూటమి ఎడారులై... సేగలు రేపుతుంటే...

మదిలొ చినుకంటి చెలిమి దూరమై వేదిస్తుంది....

రాలిన కలల ఆకులపై కురుస్తున్న జ్ఞాపకాలతొ....

ఊపిరి కరువైన నా హృదయన్ని నీ ముంగిట వదిలేస్తున్నా....

కన్నీళ్ళ సంద్రాలుగా కొలువై నిండిన చీకటిలొ...

రుధిరంతొ నిండిన నా గుండెను నీ కర్పిస్తున్నా...

నిశ్మబ్ధ విచీకలొ నీర్లిప్తంగా నీతొ కలిపిన అడుగులను

ఈ జన్మకు వరం అనుకున్నా....

అంతరాత్మలొ నీ ఉనికి అనంతమని తెలుసుకొని... ...

తలవంచుకొని శూన్యంలొ పయనిస్తున్నా....

నీ కనుపాపలు వెతికే రూపం.. నేను కాదని తెలిసిన మరుక్షణం

దిగులుతొ చలిస్తూ...ఊహలతొ నిండిన మనసుని నీ దొసిలికి అందిస్తున్నాను....

పాదాలకడ్డం పడలేని ఉద్వేగాలు నీడలా వెంబడిస్తున్నాయి....

వేదనతొ వొణీకించే విషాదపు సాయంత్రాలు సందిగ్ధతలంపులతొ బంధిస్తున్నాయి...

నా హృదయ గతభావంలొ తేజొదీప లావణ్యంగా వెలిగిన నువ్వు...

నేడు నా దృష్యాంతంలొ పాలిపొయి.... నస్వరమైన దేహంతొసాక్షత్కరిస్తున్నావు....

చీ....నీదీ ఓ బ్రతుకేనా...



నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....

గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......


నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....

కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....


గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....

గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....

రేపటి నా పయనం ఎటువైపని....


వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే

నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....


చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే

అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...


పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....

గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....


స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే

సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...


ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...

మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....


ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....



కదలని పగళ్ళూ..... కలత నిదురలు...

నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...

ఎన్నాళ్ళిలా....?

జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...

నీరాశ ఆకాశంలా కమ్ముకునా చింతలేదు.... ఆత్మసైర్ధ్యమే నీకున్న అంతస్తులని చెప్పుకొ...

వేదనలు చుట్టుముట్టినా బాధపడకు....నమ్మకముంటే నరకం కూడ స్వర్గంగా స్వాగతిస్తుంది...

ఆశయ సాధనలొ స్వార్ధం సరసమాడినా భయపడకు....ఆత్మవిశ్వాసముంటే అపజేయం కూడ ఆవిరవుతుంది...

గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కార్చకు....వేదిస్తున్న విధిపై పట్టుదలని పణంగా పెట్టు...

మనశాంతి కరువైందని విచారించకు... అది నీ మనస్తతత్వంలొనే దాగుంటుందని గ్రహించు...

ఎదలొ కష్టాలూ... ఎడారులై సేగలురేపితే ఏంటి...?

చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?

సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...

అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...

తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి... మీ రేవా...

;;