హృదయాకాశంలొ వెలిగే చిరునవ్వుల సౌగంధం... సంధ్య...
లలిత రాగాల సుమగంధం...కుడి ఎడమల కుసుమ పరాగం... సంధ్య...

మెరిసే నక్షిత్రం... కురిసే వెన్నెల... విరిసే కలువ... పూచే కుసుమం... సంధ్య...

చుక్కల వెలుగుతొ సౌందర్య లొకాలను వెలిగించే హరిత వర్ణాల అందం ... సంధ్య ...

కలల ఆకులపై కురుస్తున్న మంచు బిందువుల సొయగం... సంధ్య ...

ఉషస్సులతొ చీకటిని హరిస్తూ...తన్మయంతొ ఉప్పొంగే భావ కెరటాల వెల్లువ... సంధ్య...

యుగాలని... తరాలని మింగేస్తూ...అనంతానంతగా సాగిపొయే చెలిమి... సంధ్య...

సెలయేరు సొగసులతొ....జలపాతాల రాజసంతొ... జన హృదయాలలొ ప్రవహంచేది... సంధ్య...

తడారిపొయిన కలల ఎడారిలొ చిరుజల్లులను కురిపించే రంగుల హరివిల్లు... సంధ్య...

అధరాలపై కదులుతున్న అస్ధిత్వమైన అక్షరాలకు సరికొత్త అర్ధం... సంధ్య...

ఏకాంతంలొ...మనసు పొరలలొ అలసి...సొలసి...అల్లుకున్న ఆశల అన్వేషణ ... సంధ్య ...

నిశేదిలొ తళ్ళుక్కు మనే తారా దీపం... బ్రతుకు వాకిట నవ్వులు రువ్వే వెలుగు తొరణం... సంధ్య...

ఆశయ సాగర మధనంలొ అమృతతుల్యానికి ప్రతీక ... సంధ్య ...

గడిచి పొయిన జ్ఞాపకాలను కళ్ళ ముందు నిలిపే సుంధర స్వప్నం ... సంధ్య...

5 Comments:

  1. Padmarpita said...
    baagundandi.
    దేవకీ said...
    సంధ్య గురించి చాలా బాగా వ్రాసావు రేవా.... చాలా బాగుంది...

    ఈ లైనింగ్ సూపర్....
    "యుగాలని... తరాలని మింగేస్తూ...అనంతానంతగా సాగిపొయే చెలిమి... సంధ్య...
    సెలయేరు సొగసులతొ....జలపాతాల రాజసంతొ... జన హృదయాలలొ ప్రవహంచేది... సంధ్య..."
    సురేష్ said...
    చాలా బాగా వ్రాసారు....
    సుందర రావు said...
    బాగుందండి
    రాజా said...
    ఇంతకి ఆ సంధ్య ఎవరు... మేము తెలుసుకొవచ్చా.... మీకొసం కాదు... మాకొసం... కాని మీ కవిత చాలా ఫీల్ కనబడుతుంది...సూపర్... మీ కవితలు చాలా చూసాను.. ఆర్కుట్ మొత్తం వీరవిహరం చేస్తున్నాయి...

Post a Comment