ప్రేమను పంచుతుంటే అందుకోనంటున్నావు....
మనసు లేని మానువా నువ్వు....
మనసు నీకు అర్పిస్తానంటే మౌనం వహించావు....
మాటలు రాని...ప్రాణం లేని రాయివా....
నీ హృదయం అనురాగం లేని శవమా?
నీ మనసు ప్రేమను పొందలేని శిల్పమా?
లేకనీ కన్నులు కోరుకునే అందం నాలో కనిపించలేదా?
ఐనా అందం కాదు నేస్తమా మదిని ఆనందింపజేసేది....
ఐశ్వర్యం కాదు ప్రాణమా మనసులు ఐక్యం చేసేది....
ఒక్కసారి నీ మనసుతో నన్ను చూడు....
నా ప్రేమ శికరంపై రాణిలా కూర్చున్న నీ రూపం కనబడుతుంది....
ఐనా ఏముందనే అంత పొగరు నీకు.....
మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు....
శాస్వతమైనా నా చెలిమి కాదని?
3 Comments:
Subscribe to:
Post Comments (Atom)
నా ప్రేమ శికరంపై రాణిలా కూర్చున్న నీ రూపం కనబడుతుంది....
ఐనా ఏముందనే అంత పొగరు నీకు.....
మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు....
రేవా ... మీరు చాలా బాగా వ్రాసారు... మీ లైనింగ్ చూస్తుంటే జీవితంలొ చాలా వేదన అనుభవించారని తెలుస్తుంది...
మీరు మదిలొ ఏ భావం కావలనుకుంటే... ఆ భావాన్నీ వ్రాయగలరు....మీకు మంచి భవిష్యత్ వుంది....