ప్రకటన మౌనవ్రతం నడుమ కేంద్రం దొబూచులాడుతుంటే....

ఆందొళనలు... భయందొళనల నడుమ రాష్ట్రం 'బంద్' ఖానా అవుతుంది...

ఆశ... నిరాశల మధ్య ఆంద్రావని కేంద్రం వైపు మోర చాపి చూస్తుంది...

సీమాంధ్రలొ రగిలిన నిరశగ్ని చల్లారలేదు సరి కదా...

నాయకులు దాయదులై భరతమాతను పంచుకుంటున్నారు....

ఒక చొట దీక్ష శిబిరాన్ని భగ్నం చేస్తే... మరొచొట వెలుస్తొంది...

ప్రజల జీవితాలతొ పేకాడే ప్రవృతి పార్టీల్లొ పెరిగిపొయింది...

మొదట చేసిన బాసలను తూచ్ అనడం పరిపాటైపొయింది...

నీతి భాహ్యమైన తీరు నగ్నంగా ప్రజలందరికి కనిపిస్తుంది...

విసిగిపొయిన యువత....లాఠి దెబ్బల తిన్న విద్యార్ధుల మదిలొ...

నిండిన ఆత్మవిశ్వాసం నేడు ఆత్మహుత దాడుల్లొ అంతమవుతుంది...

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మేధావులు ఇప్పుడు ఏమయ్యారు...?

పరిష్కారాన్వేషణలొ పాలు పంచుకుంటున్నారా...! లేక

టివీల్లొ షొ కొసం నీరాహర దీక్షల్లొ తలమునకలవుతున్నారా...!

రాజకియాన్ని ఆటలా మర్చేస్తూ....

భావొద్రేకపు ఉద్యమాల సంద్రంలొ అమాయక ప్రజలను తొసేస్తూ...

మానవ జీవితాన్ని భస్మం చేస్తున్నారు...

నెహ్రు ఆశలకు భిన్నంగా ఎర్రరంగు పావురాలను ఎగురవేస్తున్నారు...

బాపుజీ కలలు కన్న దేశం ఇదేనా?

ప్రజల ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేదెప్పుడు...

క్రొసులకొద్ది నడిచిన నా అంతరంగంలొ ఈ జ్వాలలు చల్లారేద్దెప్పుడు...

3 Comments:

  1. ఆరుద్ర... said...
    చాలా బాగా చెప్పారు రేవా... బాగుంది...
    దేవకీ said...
    నాయకులు దాయదులై భరతమాతను పంచుకుంటున్నారు....


    చాలాబాగుంది మీ కవిత...మంచి లైనింగ్.... నిజంగా రాజకియ లబ్ధి కొరకు... రాష్ట్ర బంద్ లు... నిరాహరదీక్షలు...వీటిలొ సామన్య ప్రజలు బలీ అవుతున్నారు...
    మార్తండేశ్వరావు... said...
    నెహ్రు ఆశలకు భిన్నంగా ఎర్రరంగు పావురాలను ఎగురవేస్తున్నారు...
    క్రొసులకొద్ది నడిచిన నా అంతరంగంలొ ఈ జ్వాలలు చల్లారేద్దెప్పుడు...

    చాలా బాగా చెప్పావు బాబు... నీ కవితలొ ఉన్న ప్రతి అక్షరం సత్యం.... నిజ జీవితంలొ జరుగుతున్నది... కళ్ళుకు కట్టినట్లు చూపించావు..

Post a Comment