ఓ నిర్వేదం...ఒక నిట్టూర్పు...నిర్లిప్తమైన క్షణానికి కారణం...నీ జ్ఞాపకం...


నీ పరిచయం ముందు...సారం లేని బ్రతుకు శబ్ధనికి...సారాంశం లేని నిశ్మబ్ధాన్నీ...


కాలపు ఉద్వేగంలొ...విధిచే నేట్టేయబడ్డ...ఓ జీవం ఉన్న నిర్బేధ్యుడినీ...


నా మౌనాన్ని నీ చూపుల శృతితొ జతచేసి నీ చెలిమికి అర్పించలేను...


హృదయాంతరాలలొ యుగాలుగా దాగిన నిన్ను...


ఒక్క కన్నీటి చుక్కతొ కడిగేయాలేను...


దుర్లభమైన...నీ ఎడబాటు సంద్రాన్ని దాటగలను కాని...


నీ అంతరంగపు సుశుప్తావస్ధలొ ఓలలాడుతున్న నా మదిని ఊరడించలేను...


నీ ఆలొచనలు...కడలిలొ అలలుగా మారి ...నా మది తీరాన్ని ఢీ కొంటున్నాయి..


నిర్వ్యామోహితమైన నీ కర స్పర్స కొరకు...


పగటి వేళ నా మదిలొ నీ రూపాన్ని పతాకొత్సవం చేస్తున్నాను...


అశృవులు నిండిన మగత చూపుతొ నిరాసక్తుడిగా...


రాత్రి వేళ నా అంతరాత్మలొ నీ తలపులకు చందనొత్సవం గావిస్తున్నాను...


హృదయం భావొద్రేకంతొ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీ వలపుల దృశ్యమానంలొ...


అలసి సొలసిన ఈ గొంతులొ మాటరాక గద్గదమవుతుంది...


గతంలొ నేను పారేసుకున్న నీ తలపుల అనుభూతులు...


భవిష్యత్తు లొనైనా దొరుకుతాయని ఆశతొ వెతుకుతున్నాను...

4 Comments:

  1. Hima bindu said...
    బాగుంది
    Narasimha said...
    Hi Reva...

    Nee poems chala pain fulga vundi... naa chanipoyena lover gurthuku vachindi... nee poem lo lining really awesome... kekaaaa....

    Pain kuda intha antham gaa vuntunada ani chupinchavu really great
    Rayudu said...
    నిర్వ్యామోహితమైన నీ కర స్పర్స కొరకు...
    పగటి వేళ నా మదిలొ నీ రూపాన్ని పతాకొత్సవం చేస్తున్నాను...
    అశృవులు నిండిన మగత చూపుతొ నిరాసక్తుడిగా...
    రాత్రి వేళ నా అంతరాత్మలొ నీ తలపులకు చందనొత్సవం గావిస్తున్నాను...

    What a wonderful composing... good lining.... Excellent... Amazing... Reva jee....
    దేవకీ said...
    హృదయాంతరాలలొ యుగాలుగా దాగిన నిన్ను...

    ఒక్క కన్నీటి చుక్కతొ కడిగేయాలేను...


    నువ్వు ఉపయోగించే ప్రతి పదం చాలా కఠినంగా ఉంది... మనసును పిండేస్తుంది... ఎన్ని సార్లు చదివానో నాకే గుర్తులేదు... అంత బాగా వ్రాసావు... నిజంగా నీ కవితలకు నేను బానిస... ఇంత అద్బుత పదజాలం ఎక్కడ చూడలేదు.... నీ భవిష్యత్ సూపర్....

Post a Comment