జ్ఞాపకాలు ప్రళయాగ్నిగా మదిని కాల్చేస్తున్నా....

చిరునవ్వులను పెదవులకు అద్దుకుంటున్నాను....

తలపులు జ్వాలలుగా గుండెని దహిస్తున్నా...

శరత్కాలపు శశిధరుడిచే వెన్నెల కురిపించుకుంటున్నాను....

కన్నీటిగోడలలొ ఎదురుగావున్న నీ రూపం మసక బారుతున్నా...

కరస్పర్సతొ కలవర పరుస్తున్న అశృవులని అంతం చెస్తున్నాను ...

స్వేచ్చయుత సంధ్యలా వెలిగిపొతున్న సూర్యుణ్ణీ కాను...

ఎరుపెక్కిన కనుపాపలొ రక్తఛారని చెరిపేయడానికి ....

అమాస్య చీకటితొ కుంగిపొతున్న చంద్రుడిని కాను....

పాదాలపై జారిపడ్డ కన్నీటి మెరుపుని తుడిచేయడానికి.....

శిశిరాలతొ నిండిన నీ మౌనం ... నా గుండెను గాయం చేస్తుంటే...

అంతరాలలొ నలిగిపొయే నీ భావం... నా తనువును చింద్రం చేస్తుంది....

స్నేహని వదులుకొలేక... ప్రేమను పొందలేక.... నేను....

ప్రేమను స్వీకరించలేక....స్నేహన్ని దూరం చేసుకొలేక... నువ్వు....

మౌనపు సంద్రానికి చేరొ ఒడ్దున నిలిచిపొయాము.....

నీ ఎడబాటుతొ కనుమరుగై పొతున్ననా అంతరంగపు అనుభూతిని....

నీర్లిప్తంగా సాగిపొయే నా గమ్యంలొ ప్రతిబింబించె నీ లాస్యాన్ని ఆస్వాదిస్తూ....

నిన్ను స్పందింపజేసే మార్గం కోసం వెతుకుతూ...నా ఈ అన్వేషణా.....

4 Comments:

  1. దేవకీ said...
    స్నేహని వదులుకొలేక... ప్రేమను పొందలేక.... నేను....
    ప్రేమను స్వీకరించలేక....స్నేహన్ని దూరం చేసుకొలేక... నువ్వు....
    మౌనపు సంద్రానికి చేరొ ఒడ్దున నిలిచిపొయాము.....

    రేవా .... సూపర్.... చాలా బాగా వ్రాసావు... నీకు ఎలా వస్తున్నాయి ఇలాంటి భావాలు...
    నిజంగా ఎంతొ బాగా వ్రాసావు... విషాధ కవితలకు నేను వున్నాను అని చెప్పుతున్నావు....Wonderfulllll
    సరస్వతి said...
    స్వేచ్చయుత సంధ్యలా వెలిగిపొతున్న సూర్యుణ్ణీ కాను...
    ఎరుపెక్కిన కనుపాపలొ రక్తఛారని చెరిపేయడానికి ....
    అమాస్య చీకటితొ కుంగిపొతున్న చంద్రుడిని కాను....
    పాదాలపై జారిపడ్డ కన్నీటి మెరుపుని తుడిచేయడానికి.....

    మీరు వ్రాసే ప్రతి లైనింగ్ చాలా బాగుంది... మా హృదయాన్ని హత్తుకుంటుంది....

    తెలియకుండానే ... నా జీవితపు పాత జ్ఞాపకాలు నా కళ్ళ ముంది సాక్షాత్కరిస్తున్నాయి....

    సూపర్ ..... మీ భవిత బాగుంటుంది...
    Vinayaka Rao said...
    నీర్లిప్తంగా సాగిపొయే నా గమ్యంలొ ప్రతిబింబించె నీ లాస్యాన్ని ఆస్వాదిస్తూ....
    నిన్ను స్పందింపజేసే మార్గం కోసం వెతుకుతూ...నా ఈ అన్వేషణా.....

    Wonderful lining Reva Garu... chala depth tho vrasaru.... chala chala bagundi...
    మోహన said...
    Too good.

Post a Comment