2010 కాలింగ్ బెల్ కొడుతుంటే.... 2009 తలుపుతీస్తూ... కరిగిపొయింది...
Posted by బుజ్జి at 12/29/2009 09:49:00 PMఎసెమ్మెస్ లు వెళ్ళుతునే ఉన్నాయి...
కీ బొర్డుపై వేళ్ళు కదులుతునే ఉన్నాయి...
ఈమెయిళ్ళు ఇంకా పూర్తి కాలేదు...
నైట్ పార్టీల మజా ఇంకా తీరలేదు...
పబ్బుల్లొ పరిచయాలు పెరగలేదు...
వెబ్బుల్లొ వెలుసుబాటు ఇంకా చిక్కనేలేదు...
ఎన్ని పనులు... ఎన్నీ వ్యాపకాలు...
గుండెలను హత్తుకున్న ఏడాది అనుభుతులను
తడిమి చూస్తే...ఏం మిగిలింది...?
2010 కాలింగ్ బెల్ కొడుతుంటే....
2009 తలుపుతీస్తూ... కరిగిపొయింది...
కాలం వేగమే అంత...! మా యువత ఉడుకు రక్తం ఉరకల్లాగ....!
ఎన్ని సాధించిన... ఇంకా ఎన్నొ మిగిలున్నాయి...
కొత్త ఎడాది స్వాగతానికి ఆశల తొరణం కట్టాలి...
ఆశయాల గుమ్మం ముందు... లక్ష్యాల ముగ్గులేయాలి...
సరదాల మధ్యనే విజయం సాధించాలి...
వ్యక్తీగా ఎదగాలి...సంఘమై సాగాలి...
ఎంచుకున్న దారి సరైందైతే....
లక్ష్యం చేరకుండా ఎవరూ ఆపలేరు...
ఆత్మవిశ్వాసాన్ని ఊపిరి నిండా నింపి...
ఆగని కాలనికి ఆనందాలను అద్దుదాం...
"నూతన సంవత్సర శుభాకాంక్షలతొ.... మీ రేవా"
2 Comments:
-
- దేవకీ said...
Tuesday, 29 December, 2009రేవా నేటి ప్రంపచాన్ని కళ్ళకు చూపించావు... చాలా బాగా వ్రాసావు... నీకు కూడ నా నుతన సంవత్సర శుభాకాంక్షలు.... రాబొయే ఎడాది నీకు అద్భుతంగా ఉండాలని కొరుకుంటున్నాను...- మాలా కుమార్ said...
Thursday, 31 December, 2009నూతన సంవత్సర శుభాకాంక్షలు .