కదలని పగళ్ళూ..... కలత నిదురలు...
నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...
ఎన్నాళ్ళిలా....?
జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...
నీరాశ ఆకాశంలా కమ్ముకునా చింతలేదు.... ఆత్మసైర్ధ్యమే నీకున్న అంతస్తులని చెప్పుకొ...
వేదనలు చుట్టుముట్టినా బాధపడకు....నమ్మకముంటే నరకం కూడ స్వర్గంగా స్వాగతిస్తుంది...
ఆశయ సాధనలొ స్వార్ధం సరసమాడినా భయపడకు....ఆత్మవిశ్వాసముంటే అపజేయం కూడ ఆవిరవుతుంది...
గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కార్చకు....వేదిస్తున్న విధిపై పట్టుదలని పణంగా పెట్టు...
మనశాంతి కరువైందని విచారించకు... అది నీ మనస్తతత్వంలొనే దాగుంటుందని గ్రహించు...
ఎదలొ కష్టాలూ... ఎడారులై సేగలురేపితే ఏంటి...?
చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?
సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...
అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...
తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి... మీ రేవా...
3 Comments:
Subscribe to:
Post Comments (Atom)
చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?
సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...
అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...
తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి...
చాలా బాగుంది... చదువుతుంటే ఉత్సహం వస్తుంది... ఓటమిపై కసి రెగులుతుంది... కవితలొ భావాన్ని నాటావు... నీ కవితలు చూస్తూ ఉంటాను... నీకు మంచి భవిష్యత్ ఉంది... ఇంత పిన్న వయస్సులొనే యువతకు ఆదర్సంగా నిలుస్తున్నావు....నీ కవితలొ కసి కనబడుతుంది...చెమట చుక్కుని కూడ గెలుపు చుక్కగా మార్చుకొమంటున్నావు... సూపర్....
నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...
ఎన్నాళ్ళిలా....?
జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...
ఎమి చెప్పావు గురూ.... కేకా.... అవును ఎన్నాళ్ళు ఇలా... బద్ధాకాన్ని ముక్కలు చేసేది ఎప్పుడు... ఆశృవులు చిందిస్తున్న నయనాలు పన్నీరుని చిందేచేదేప్పుడు...మంచి స్పూర్తినిస్తున్నావు రేవా... ఇంకా మంచివి నువ్వు వ్రాయాలని కొరుకుంటున్నాను....
well said.