నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....

గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......

నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....

కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....

గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....

గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....

రేపటి నా పయనం ఎటువైపని....

వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే

నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....

చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే

అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...

పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....

గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....

స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే

సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...

ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...

మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....

ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....

5 Comments:

  1. సాగర్ said...
    రేవా గారు... మీ కవిత చాలా చాలా బాగుంది....ప్రతి మనిషి జీవితంలొ కష్టాలు ఎదుర్కొంటునే ఉంటాడు... కష్టాలు లేని మనిషి లేడు అనడంలొ సందేహం లేదు... మీ ప్రతి వాక్యం... సుపర్... ఎంత అద్బుతంగా వ్రాసారు.....ఎప్పటివొ నా పాత జ్ఞాపకాలు గుర్తు చేసారు....
    దేవకి said...
    నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....
    గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......
    వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే
    నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....
    చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే
    అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...

    మీ కవితలని మిస్ కాకుండా చదువుతాను.... ఏమి వ్రాసారు సార్... వన్డర్ పుల్ లైనింగ్....చాలా చాలా బాగా వ్రాసారు...

    నాకు బాగా నచ్చిన కవితలొ ఇది ఒకటి... ప్రతి పదం ఒక అణీముత్యం.... ఎంత అద్బుతంగా వ్రాసారు...
    Hima bindu said...
    chalaa baagundi
    Anonymous said...
    చాలా చక్కగా వ్రాశారు..
    Tanvi Reddy said...
    Reva garu mee Lining Excellent... chala chala bagundi...

    ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

    కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

    ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

    వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....

    ee lining Awesome antha baga vrasaru... nijamga jeevithaniki chala daggara vundi... manchi bhavam... superrrr....

Post a Comment