గుండెల్లొ బాధ ఆకాశాన్నంటితే ఏం లాభం...అంతా శూన్యం...
ఎండిన కనుపాప తిరిగి వర్షిస్తే ఏం లాభం...అంతా ఆర్ధ్రతమానం...
నీ విరహపు వేడిలొ ద్రవీభవిస్తున్నాను...
నీ వలపుల నీడలొ ఘనీభవిస్తున్నాను...
నీ సుమధుర జ్ఞాపకాలను ఆస్వాదించేది నేనే...
నీ చుర కత్తుల చూపులతొ ఆక్షేపించబడేది నేనే...
జ్ఞాపకాల విలాసంలొ దుఖ: వెచ్చటి కంబళై కౌవ్విస్తుంటే...
బంధనాలు తెంచమని నిన్ను అడిగేదేలా...?
విధి వైపరిత్యంలొ నీ ఎడబాటు సైగలతొ గుండెను మండిస్తుంటే....
ప్రాణ రక్షణకై నీ చిరునవ్వుల హస్తాన్ని అడిగేదేలా...?
నా ప్రతి ప్రశ్నకి ఒకటే వైనం... అదే మౌనం...
మనశ్శాంతి కొ దృక్పధం....మరణం నాకు ఔషదం...
5 Comments:
Subscribe to:
Post Comments (Atom)
నీ వలపుల నీడలొ ఘనీభవిస్తున్నాను...
సూపర్ లైనింగ్ ... మీ ప్రతి కవితను నేను చదువుతుంటాను... చాలా బాగా వ్రాస్తున్నారు
ప్రాణ రక్షణకై నీ చిరునవ్వుల హస్తాన్ని అడిగేదేలా...?
రేవా చాలా బాగుంది... విషాద కవితలు గొప్పగా వ్రాసే వారు ఎవరైనా వున్నారు అంటే అది నీ తరువాతే... అంత అద్భుతంగా వ్రాస్తున్నావు...
మనశ్శాంతి కొ దృక్పధం....మరణం నాకు ఔషదం...
నువ్వు ఉపయోగించే పదాల అల్లిక నిజంగా సూపర్...
అంత కఠినమైన పదాలు ఏలా వస్తున్నాయి నీకు... చాలా బాగా వ్రాస్తున్నావు...
నీ చుర కత్తుల చూపులతొ ఆక్షేపించబడేది నేనే...
చాలా బాగుంది అని పది సార్లు చెప్పిన అది చిన్నగానే ఉంటుంది నాన్న...
నిజంగా నీ ప్రతి పధం ఓ అద్భుతం... అమోఘం...