మొండి చేతుల్లొ ఉన్న వేణువు...మదిని ఓదార్చగలదా..
5 comments Posted by బుజ్జి at 4/19/2010 11:50:00 PMఓ నిచ్చేలి...
లో లోపల కురుస్తున్న నీ జ్ఞాపకాల కుండపొత వర్షం...
కన్నుల కీటికి లొంచి తుంపరులై జారుతున్నాయి...
ఊహకీ...ఆలొచనకి...మధ్య నలిగిపొతూ...
అంతర్మధనంలొ హృదయం మౌనమై మిగిలిపొతుంది...
నా అరచేయి అరవిందంలొ... మబ్బుల తునకలలాంటి...
నీ ముంగురులు...సన్నజాజి దండలా జారుతూ...
ప్రశాంతతని చేకూర్చే సడిచెయ్యని నీ చిరునవ్వులలొ సేదతీరుతూ...
శూన్యంలొ సైతం వెలుగు పంచే ఆ సొగసైన కళ్ళును చూస్తూ...
ఆశల నిండిన వెచ్చని స్వప్నాల పాన్పుపై విశ్రమిస్తున్నాను...
ఇంతకు మునుపు తెలియదు...
మదిలొ పూచే వసంతాలు... మమతానురాగాలతొ నిండిన వాత్సల్యాలు...
మల్లెచెండ్లు వలే మేల్కొలిపే నీ జ్ఞాపకాల వేకువలు...
చీకటి నిండిన నా ఏకాంతలొ నీ ఆలొచనల మందారాలు...
నా ఊహల ప్రత్యూష పవనలతొ నిండిన ఉత్సహపు సముద్రాలు...
కలల రాశులు మీద చిమ్ముతున్న...నా ఉద్రేకపు సమీరాలు...
అంతరంగాన్ని ఆవిష్కరించే కన్నీళ్ళూ...
అన్ని నువ్వే నాకు ఇస్తున్నావని...!
కాలాన్ని...దూరాన్ని...చింతలన్నీ...చీకటినీ...
చీల్చుకొని నిన్ను చుడగల్గినంత కాలం...
సజీవ చైతన్య గళం లాంటి నా కలం...
ఊపిరిని దీనంగా మోసుకుపొతున్న నా ప్రాణం...ఏప్పటికి ఆగవు...!
అలసట లేని పరుగుతొ...
ఆశ నిరాశల నడుమ రెపరెపలాడుతున్న ప్రాణ దీపాన్ని
కారుణ్యపు హస్తాలతొ కాపాడుకుంటూ...
అమ్మ ఒడిలొ చేరిన ఆరొజు...
కన్నా...కన్నీళ్ళెందుకురా? అంటూ...
చిత్రంగా తాను కన్నీరు పెట్టుకున్న వైనం నేడు సాక్షత్కరిస్తుంది...
కరిగిపొవడం తప్ప...కాఠిన్యం తెలియదు...నా పిచ్చి తల్లికీ..!
ఎన్ని దిగుళ్ళు నన్ను క్రూరంగా వేటాడాయో...
ఎన్ని చింతలు నన్ను వేదించాయో...
ఎన్ని నీడలు నన్ను భయపెట్టాయో...
ఎన్ని ముళ్ళు నా లేత గుండెలొ దిగబడ్డాయో...
అనుక్షణం నాకొసం తల్లడిల్లే...నీకు...ఏలా చెప్పను...!
గొరు ముద్దల తినిపించిన నీకు...
నే తిన్న వేదన ముద్దల గురించి ఎలా చెప్పను...?
నీ వెచ్చని కౌగిలిలొ నా కష్టాలను కరిగిస్తున్న నీకు...
చమరిన నా కళ్ల వెనుకున్న అగాధాన్ని ఎలా చూపను...?
మాటలు నేర్పిన అమ్మ...
నా మాటల్లొని మంటలను భరించగలదా...?
నాకే తెలియని ఈ విపత్కర పరిస్ధితుల నడుమ....
రేపు ... మాపుల కాలచక్రాలలొ నా జీవితం...
ఓ యుగంలా గడుస్తుంది...!
అందుకే కడుపులొ బడబాగ్నిని దాచుకొని...
చిరునవ్వుల నురుగులును చిందే కడలి నా తొబుట్టువని చెప్పుతుంటాను...!
నా మాతృమూర్తికీ...!
ప్రభాత సముద్రం పై కురుస్తున్న వెన్నెలలా...
నెత్తురు చల్లబడే చలిలొ...
తనువు తియ్యని స్పర్శ కొరకు తపిస్తుంది...
కన్నెమనసులొ కొటి కాంతులతొ నిండిన సరి కొత్త కాంక్షని ప్రేరేపిస్తుంది ...
పరువానికి వచ్చిన వయస్సు విరహంతొ రగిలిపొతుంది...
హృదయం స్వగతాలతొ కుంగిపొతుంది...
యౌవన భారంతొ...తనువు విరుచుకుపడుతూ...
శార్కరములతొ కడిగిన అధరాలకు సుధలు నింపుతూ...
కైపు నిండిన కంటికి కాటుకనద్దుతూ...
పగలు పూచిన మల్లెచెండ్లులను రాత్రికి పొగు చేసి...
శంకాకులమైన రాత్రిలొ...
సగం కాలిన అగరువత్తుల మత్తులొ...
సన్నగా ప్రసరిస్తున్న దీప శిఖ నీడల నడుమ...
సుతారపు సువాసన నిండిన అత్తరును పూసుకొని...
మది ఏకాంత సరస్సున తొలి కొర్కెను మెల్కొలుపుతుంది...
వలపు తెరల సందుల నుండి...
సౌందర్యపు పరిమళంతొ వీచే హేమంత సమీరాలు ఒంటిని నిమురుతూ...
మౌనంతొ కదులుతున్న కాలాన్ని ఊహల లతలతొ బంధీస్తూ...
కవ్విస్తున్న బుగ్గలపై సిగ్గులు చిందిస్తూ...
తలపుల రవికలొ దాచుకున్న...
తళుకులతొ నిండిన కలల పుప్పొడిని...
తొలిరాత్రిలొ వెదజల్లాలని...
పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి...
పళ్ళెరంలొ పెట్టి... ప్రాణనాధుడి కందించాలనే ఆశ.....
నా కన్పిస్తుంది...
అంధకారమైన సముద్రం పై...
చంద్రాకారం వెలుగుతునట్లుగా...
మొండి చేతుల్లొ మానవత్వం...
మంటగలిసి పొతున్నట్లుగా...
దివ్య సీమను చూపే నేత్రాలు...
దిగంతాలకై వెతుకుతునట్లుగా...
ఆకాశపు వొంపులతొ ఉన్న కాలం...
పాతాళపు సొంపుల్లొ ఉన్న విధిని సాయమడిగినట్లుగా...
ప్రాణ సారం లేని అనుభవం...
పశ్చాత్తాపంతొ నా చుట్టు తిరుగుతునట్లుగా...
కాషయం కట్టుకున్న పుష్కర రేవులు...
పుణ్యస్నానమాడుతునట్లుగా...
తుషార బిందువులతొ తడిసిన మల్లేలు...
భగ్న హృదయాలను కలచివేస్తున్నట్లుగా...
ముల్లపై బ్రతుకుతున్న రొజాలు...
మృదు హసాన్ని సంతరించుకున్నట్లుగా...
ఆలొచన పాత్రలొ నిండిన ఈనాటి జ్ఞాపకాలు...
రేపటికి పాతవవుతున్నట్లుగా...
నుదుట నున్న కస్తూరి...
నవ వర్ణ చిత్రాల ఊర్వశిలా విహరిస్తున్నట్లుగా...
మౌనంతొ కలిసి నగ్నంగా నిదురిస్తున్న నిశ్శబ్దం...
నీ మాటతొ ఉల్కిపడినట్లుగా...
రేపటి కొసం ఉదయం...
ఈ రొజే వెలుగును సమకూర్చుకుంటునట్లుగా...
మనొవాంఛ తీరక ముందే ...
మరణమొచ్చి రమ్మంటున్నట్లుగా...
ఎందుకొ నాకన్పిస్తుంది నేస్తం...
ప్రేమ పేరున సొదరీమణుల... అమాయకత్వంతొ ఆడుకుంటూ...
యాసిడ్ లను ముఖాల పై చిలికిస్తూ...
అమానుషత్వం మూర్తిభవించిన...
కొందరు అన్నయ్యలను నేను గాంచాను...
ఎవరిచ్చారు వారికి ఆ హక్కు...? అందం వాళ్ళమ్మ సొత్తా...!
పేదరికంలొ పుట్టిన పువ్వులకు...
సంపదతొ అమరిన సుఖాలను చూపిస్తూ...
వ్యభీచారపు కొంపల్లొ వికశింపజేస్తున్న...
దయనీయపు దృశ్యాలను నేను చూసాను...
ఆ వెదవలకేమి తెలుసు...? ఆ పురిటి నొప్పుల చీకటి బాధలు...!
బ్రతుకు భారాన్ని మూపుపై మోస్తూ.....
ముళ్ళకంచెల మధ్య... బురదగుంటల మధ్య...
నిట్టూర్పుల సెగలతొ మూకీభవిస్తూ...
అప్పుడొ... ఇప్పుడొ రాలిపొయే...
ఆ బడుగు ఆకుల దైన్యాన్నీ నేను చూసాను...
ఎవ్వడిచ్చాడు సలహా ఆదేవుడుకు...
పేదరికాన్ని వాళ్ళ ఒంటికి వ్రాయమని...?
ఆశయాలు రానీ....ఆదర్శాలు లేని...
మోటుగా ... దిగులుగా సాగే వీరి జీవితాల పై...
తళుకు తళుకు మనే ఆశల కలల పుప్పొడిని
వెదజల్లేదేవరూ...?
నిజా నిజాలన్వేషణలొ...అబద్దాన్ని గెలిపిస్తూ...
మారిపొతున్న సమాజన్ని చూస్తే దిగులు రేపుతుంది...
మారలేని నాకు మాయగా కన్పిస్తుంది...
నేను కొరుకునేది ఒక్కటే నేస్తం..
నా అక్షరాలన్ని నీ అశ్రువులిని తుడవాలని..
నువ్వు ఆనందంగా నవ్వీతే ఆ అమృతతత్వాన్నీ..
నేను అందుకొవాలని..
నీశి తీరాలలొ నువ్వున్నప్పుడు..
చింతలతొ... చిరాకులతొ ..
తనువును సజీవంగా సమాధి చేస్తున్నప్పుడు..
సమరొత్సహాన్ని మోసుకుంటూ...నీకివ్వాలని..
ఉద్రేకపు తరంగాన్ని గుండెల్లొ నింపుకొన్న నీకు..
సమస్యల చీకట్లను చంపుతూ...మైత్రి దీపంగా వెలగాలని..
నిరాశ దూళీ క్రమ్మిన నీ తనువుని..
కష్టాలతొ ఎండిన గొంతుని..
విజయ సంకల్పంతొ నిండిన...శాంతి సుధలతొ తడపాలని..
నీ ఎకాంతంలొ...మౌన నిట్టూర్పుల నడుమ..
బాధలతొ...సల సల కాగే అశృవులను చిందిస్తున్నప్పుడు..
సనాతన పరిమళంతొ నిండిన స్వాతి చినుకునై...నీకు సేద తీర్చాలని..
తరగని దూరాన్ని దాటాలన్న నీ ప్రయత్నంలొ..
ఆటుపొట్లు నడుమ ...సాగే నీ పయనంలొ..
నిరాశను కలిగించే మైళ్ళురాళ్ళూ...ఆవిర్బవిస్తునే ఉంటాయి..
అవి...అశాంతి...అలజడుల ఆర్బాటపు చిరునవ్వులలొ నిగ్గు తగ్గి ..
సిగ్గుతొ మార్గ మధ్యలొ ఎక్కడొ మృత్యువుని వెతుక్కుంటూ..
గెలుపుని నీకు బహుకరిస్తాయి..!
ఆ బహుమానం నా మనసైతే...ఆ విజేత నువ్వే నేస్తం..!
మనసుకి... మనసుకి... మధ్య ముడి పెట్టే మాంగళ్యంలొ...
మమతనురాగ బంధాలను చూడగలిగే వ్యక్తి కావాలి...
చెక్కిలి పై నిలిచిన కన్నీటి బొట్టులొ ... భారమైన పాత జ్ఞాపకాల మత్తుతొ...
చిరునవ్వుల భూగొళాన్ని చూడగలిగే వ్యక్తి కావాలి...
దుఃఖాన్ని ఎండగడుతూ.... రాగ ద్వేషలను ప్రక్షాళన గావిస్తూ....
ఆపదలొ సైతం నేనున్నానంటూ... వెన్నుతట్టి నిలిచే వ్యక్తి కావాలి....
మదిని కలచి వేసే భావలను కరిగిస్తూ...
మౌనంతొ విజయాలను సాదిస్తూ...గమ్యాన్ని జీవితంతొ కొలిచే వ్యక్తి కావాలి...
జ్ఞాపకాలను హత్తుకుంటూ...బాధలను దిగమింగుతూ...
రూపం లేని శత్రువుల పై... వికసిత హృదయాలతొ యుద్దం చేసే వ్యక్తి కావాలి...
అలుపు లేని గుండె చప్పుడును... ఆత్మవిశ్వాసంగా మారుస్తూ...
విర్రవిగుతున్న సమస్యల కల్లొల తరంగాల పై... సింహంలా శయనించే వ్యక్తి కావాలి...
ఆ వ్యక్తి ... నువ్వే కావాలి నేస్తం...! ఎందుకంటే....
మనిషంటే ఆరు అడుగుల జడత్వం కాదు... అరవై కేజిలా నిశ్శబ్దం కాదు....
ఎల్లలు లేని సువిశాల ఆకాశం...అత్యంత విలువైన బహుమానం....
మధుర బంధాల మహ సాగరం.... మనిషికున్న మానవత్వం...!
నా అపజయాల వేడుకలను చూడలేక ప్రాణం వెళ్ళిపొతుంది..
3 comments Posted by బుజ్జి at 4/07/2010 11:09:00 PMగతించిన గతం... నా గత స్మృతులన్ని మీటుతుంటే...
కనబడని కాలం నా కళ్ళ ముందే కనుమరుగవుతుంటే...
మది అంచుల్లొ దాగి ఉన్న మౌనం...
నిట్టూర్పుల సవ్వడిలొ కరిగి కన్నీరవుతుంటే ....
కనురెప్పలను కాగడాలుగా మారుస్తూ...
గుండెల్లొ ఆరని... నీ జ్ఞాపకాల చితిమంటలను ....
కొటి ప్రభాతకాంతులుగా మారుస్తూ....
ఆరిపొతున్న నా ఊహలకు... వెలుగులను నింపుతూ....
మరు జన్మలొనైన నాతొ పయనిస్తావని ఎదురుచుస్తున్నాను నేస్తం...!
తనువులొ నిండిన నీ ఆలొచనలను...ప్రతిక్షణం తడుముతూ ఉంటే...
ఛిద్రమైన నీ స్మృతి చిహ్నాలు... నిస్సహయంగా పలకరిస్తుంటే...
నిరంతరం అపజయాల వేడుకలను చూడలేక...
నా అంతర్మధనంలొ నలిగిపొతున్న ప్రాణం ఇక శెలవంటూ...
వెళ్ళి పొతుంది...నేస్తం!
ఇంతలొనే ఎప్పుడొచ్చాయో ... తెలియదు కాని...
వెన్నెంటి సొలిపొయే....ఈ రెండు కన్నీటి బొట్లు...
నిశ్శబ్దంగా వచ్చి చెక్కిలి మీద నుంచున్నాయి...నిస్సహాయంగా...!
నా కనుల ఎదుట నువ్వు లేవు...
కాని నా ప్రతి జ్ఞాపకంలొను నువ్వే...!
నా మాటల్లొ నువ్వు లేవు...
కాని నా ప్రతి పలుకులొను నువ్వే...!
నా గమనంలొ నువ్వు లేవు...
కాని నా ఊహల ప్రతి అడుగులొను నువ్వే....!
నా కవితలలొ నువ్వు లేవు...
కాని నా ప్రతి భావం లొను నువ్వే...!
నా ఆలొచనలొ నువ్వు లేవు...
కాని నా ప్రతి తలపులొను నువ్వే...!
నా ఆవేశంలొ నువ్వు లేవు...
కాని నా ప్రతి స్పందన లొను నువ్వే...!
నా శ్వాసలొని నువ్వు లేవు...
కాని నా ప్రతి ఊపిరిలొను నువ్వే...!
నా కన్నీటిలొని నువ్వు లేవు...
కాని నా ప్రతి ఓదార్పు లొను నువ్వే...!
నా వేదనలొని నువ్వు లేవు...
కాని నా ప్రతి చిరునవ్వులొను నువ్వే...!
నా బ్రతుకులొ నువ్వు లేవు...
కాని నా కంటబడని ప్రాణం మాత్రం నువ్వే...!